జమ్మూ కశ్మీర్ విషయంలో మరో కీలక నిర్ణయం!
Jun 13 2021
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ విషయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి తర్వలోనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఎన్నికలను నిర్వహించే దిశగా కదులుతోంది. ఈ రెండు అంశాలపై అక్కడున్న అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టి, వారి వారి అభిప్రాయాలను తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2018 లో మెహబూబా ముఫ్తీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించాయి. ఆ తర్వాత 2019 లో 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే 2019 సాధారణ ఎన్నికలతో కలిపే జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం తలపోసింది. అయితే అక్కడి స్థానిక పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం... వెనకడుగు వేసింది. ప్రస్తుతం కేంద్రం జమ్మూ కశ్మీర్ విషయంలోమళ్లీ యాక్టివ్ అయ్యింది. రాష్ట్రహోదాను కల్పించడం, ఎన్నికలను నిర్వహించడం అన్న రెండు అంశాలపై ముందుకు సాగాలని, ఈ విషయంలో అన్ని పార్టీలతోనూ సంప్రదింపులకు తెర తీయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.
No comments:
Post a Comment