Wednesday, February 22, 2023

భయపెట్టాలనే బిబిసి పై దాడులు

 భయపెట్టాలనే బిబిసి పై దాడులు


-రాఘవశర్మ, ' ద గార్డియన్' సౌజన్యం తో


'చైనా నుంచి బిబిసి డబ్బులు తీసుకుందా?" అంటూ వార్తా విశ్లేషణ కోసం రిపబ్లికన్ టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది.


 లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ ఛానల్లో ఆర్నబ్ గోస్వామి కనిపిస్తున్నారు.


 "లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఏదైతే దారుణమని అనుమానించామో, అది పచ్చి నిజమని తేలింది. బిబిసికి చైనా నిధులు ముట్టాయి” నుదుటపై పడుతున్న జుట్టును పైకి లాక్కుంటూ అరిచారు అర్నబ్.


ఇది జరిగిన రెండు నెలల తరువాత, ఓ మంగళవారం 50 మందికి పైగా ఆదాయపన్ను శాఖాధికారులు ఢిల్లీ, ముంబయిలలోని బిబిసి కార్యాలయాల్లోకి ప్రవేశించారు. 


ఆ అధికారులు మూడు రోజుల పాటు తమ ఫైళ్ళన్నీ వెతికారని, ఈ మెయిల్స్, ఫోన్లు, ల్యాప్టాప్లలోని సమాచారాన్నంతా కాపీ చేసుకున్నారని అక్కడ ఉన్న బిబిసి ఉద్యోగులు తెలిపారు.


 పన్నులకు సంబంధించిన సమాచారం పూర్తిగా సేకరించేవరకు అయిదుగురు సీనియర్ ఎడిర్లతో పాటు, పది మంది ఉద్యోగులను శుక్రవారం వరకు బైటికి పోనీయ లేదు.


 ఇవ్వన్నీ సాధారణంగా జరిగే పరిశీలనేనని ప్రభుత్వం ప్రకటించింది.


 “ఆదాయపనున్న శాఖ చేసిన పరిశీలనకు, బిబిసి-ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదానికి ఎలాంటి సంబంధం లేదు” అని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సలహాదారు కంచన్ గుప్త ప్రకటించారు. 


“ఇదేమీ దాడులు చేయడమో, స్వాధీనం చేసుకోవడమో కాదు, కేవలం పరిశీలనే. బిబిసి డాక్యుమెంటరీ విడుదల చేయడానికి ముందే కొన్ని విషయాలు స్పష్టం చేయమని పది నోటీసులిచ్చాం. వాటికి బిబిసి స్పందించలేదు. ఫలితంగా ఈ పరిశీలన చేయాల్సి వచ్చింది. ఈ పరిశీలనలో అనేక అవకతకలు, వ్యత్యాసాలు బైటపడ్డాయి" అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ శుక్రవారం ప్రకటించింది. 


ఈ విచారణకు తాము సహకరించామని బిబిసి తెలిపింది.


 బిబిసి పైన ఈ దాడులు జరుగుతున్నప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.


 ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత దేశంలో పత్రికా స్వేచ్ఛపై బెదిరింపులు, అధికారిక పెత్తనం సాగుతోందని అనేక మంది పరిశీలకులు భావిస్తున్నారు.


మోడీ గురించిన ఒక డాక్యుమెంటరీని జనవరిలో బిబిసి బ్రిటన్లోనే ప్రసారం చేయడం పట్ల భారత ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది.


 'ఇండియా : ద మోడీ క్వశ్చన్' అన్న పేరుతో రెండు భాగాలుగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ మోడీ హిందూ జాతీయ ప్రభుత్వానికి, అల్పసంఖ్యాకులైన ముస్లిం జనాభాకు మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయని ఆరోపించింది.


 మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో ఆరాష్ట్రంలో జరిగిన మతఘర్షణల్లో వందలాది మంది ముస్లింలు మరణానికి దారి తీసిన పరిస్థితికి మోడీ సహకరించారని ఆడాక్యుమెంటరీ చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది. 


ఈ డాక్యుమెంటరీ బ్రిటన్ దౌత్య కేబుల్లో గతంలో ప్రసారం కాకపోయినప్పటికీ, ఏళ్ళతరబడి మోడీని వెంటాడుతున్న ఈ ఆరోపణలు ఇప్పుడేమీ కొత్తకాదు.


 తన పైన వచ్చిన ఈ ఆరోపణలన్నిటిపైన 2012లోనే సుప్రీం కోర్టు నుంచి క్లీన్ చిట్ తీసుకున్నారు. 


ఈ డాక్యుమెంటరీ భారత దేశంలో తయారైంది కాదు. 


కానీ ప్రభుత్వం బిబిసి పైన ఆరోపిస్తూ ఇది “వలసవాద ప్రచారం” అని “పరస్పర విరుద్ధమైన చెత్త” అని, భారత దేశం ఒక బలీయమైన ప్రపంచ శక్తిగా ఎదగడం ఇష్టం లేని పశ్చిమ దేశాలు, మన దేశాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. 


అత్యవసర చట్టాలను వెలికితీసి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ పంపిణీ కాకుండా చర్యలు చేపట్టింది.


 బిబిసి అవినీతికి పాల్పడే సంస్థ అని హిందూత్వ అనుకూల సామాజిక మాధ్యమాల్లో ఒక విద్వేష ప్రచారం మొదలైంది.


 భారత దేశానికి వ్యతిరేకమైన చైనా నుంచి ఈ బిబిసికి నిధులు అందాయని ఆరోపించారు.


 చైనాకు చెందిన హువాయ్ కంపెనీ నుంచి వాణిజ్య ప్రకటనల రూపంలో బిబిసి ముడుపులను స్వీకరించిందని పేర్కొన్నారు. 


ఈ ఆరోపణలు వెలువడిన వెంటనే భారతవ్యతిరేక ప్రచారాన్ని చేయడానికి బిబిసికి చైనా నిధులు సమకూరుస్తోందని భారతదేశంలోని పెద్ద పెద్ద వార్తా ఛానెళ్ళు కూడా చర్చలు మొదలు పెట్టాయి. 


దీంతో బీజేపీ శ్రేణులు కూడా అందుకున్నాయి. 


“ఇదొక విధానం. అంతకు ముందు దీన్ని చాలా సార్లు చూశాం" అని భారతదేశానికి చెందిన జర్నలిస్టు రఖిబ్ హమీద్ నాయక్ అన్నారు.


 విద్వేషపూరిత ప్రసంగాల గురించి, హిందూత్వ జాతీయ సమాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారం గురించి విశ్లేషించే 'హిందూత్వ వాచ్' అనే వెబ్సైట్ను ఆయన నిర్వహిస్తున్నారు.


 "ఈ తప్పుడు ఆరోపణలను హిందుత్వ వాద ఐటీ సెల్ తొలి సారిగా ట్వీటర్లో ప్రచారం చేసింది.


 తరువాత ప్రధాన టెలివిజన్లలో చర్చలు జరిపింది. 


ప్రభుత్వ సంస్థలు దాడులతో ఆ ప్రచారం ఆపేశారు.” అని రఖిబ్ హమీద్ నాయక్ అన్నారు.


 "వాళ్ళ ఉద్దేశ్యం ఒకటే. ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోళ్ళు మూయించడం.


 విమర్శనాత్మకంగా ఉండే మీడియా గొంతులు మూగవోయాక వారి కంఠాలు మాత్రమే ప్రతిధ్వనించాలి” అంటూ కొనసాగించారు.


ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు భావ వ్యక్తీకరణ, పత్రికా స్వేచ్చ గొంతు నులిమేసి, రాజ్యాంగాన్ని స్తంభింపచేసి అనేక మంది జర్నలిస్టులను జైళ్ళలో కుక్కిన చరిత్ర భారత దేశానికుంది.


 మోడీ అధికారంలోకి వచ్చిన 2014నుంచి ఒక పద్ధతి ప్రకారం విమర్శనాత్మక వార్తలు రాకుండా పత్రికల నోళ్ళు మూయించారని కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.


 అలా రాసే జర్నలిస్టులే ధ్యేయంగా వారిని 'జాతి వ్యతిరేకుల'ని, వారి వల్ల ప్రభుత్వానికి ముప్పు వాటిల్లుతుందని ప్రచారం మొదలు పెట్టారు. 


ఈ ఏడాది పత్రికా స్వేచ్ఛ జాబితాలో 180 దేశాలకుగాను ఎన్నడూ లేని విధంగా భారత దేశం 150వ  స్థానానికి దిగజారింది.


 ప్రభుత్వం పత్రికలను అణచి వేస్తోందనే వాదనను కేంద్ర సమాచార శాఖ అధికార ప్రతినిధి కంచన్ గుప్త తిరస్కరించారు.


 “వాస్తవానికి పత్రికలను భయపెడుతున్నామన్నది నేను ఎక్కడా చూడలేదు.


 పత్రికా కార్యాలయాలు ప్రభుత్వ పరిశీలనకు అతీతం కాదు.


 పన్ను చెల్లించే చట్టాలు వారికి కూడా సమానంగా వర్తిస్తాయి” అన్నారు.


భారతదేశంలో పెద్ద ఎత్తున ఉన్న పత్రికలు, వార, మాస, పక్ష పత్రికలు, డిజిటల్ మీడియా, టెలివిజన్లలో వాస్తవ దృశ్యాలను చైతన్య వంతంగా ప్రసారం చేయవలసి ఉంది. 


వీటిలో ప్రధాన స్రవంతిలో ఉన్న చాలా వాటి ప్రయోజనాలు బీజేపీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల చేతిలో ఉన్నాయి.


 ఇలాంటి పత్రికలు, చానెళ్ళు మోడీకి, బీజేపీ పాలనకు అనుకూలంగా ఉన్న వారిపై వ్యతిరేక కథనాలను ప్రసారం చేయలేక, ముద్రించలేక పోతున్నాయి.


 "ప్రభుత్వానికి సంతోషం కలి  గించడానికి రాజీ పడిపోయిన విస్తృతమైన పత్రికలు, టెలివిజన్ చానళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నాయి” అని న్యూస్  లాండరీ అనే డిజిటల్ వార్తా సంస్థ సీఈవో అభినానంద్ సెక్రి అన్నారు.


 డిజిటల్ మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వం నిరంకుశమైన చట్టాలను ప్రవేశ పెడుతోందని విమర్శకుల ఆరోపణ.


 ఏవి తప్పుడు వార్తలు, ఏవి కావోనని విచారించి, నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ చట్టాలుకట్టుబెడుతున్నాయంటున్నారు.  


 పెద్ద సంఖ్యలో ప్రచురణ సంస్థలను దెబ్బతీయాలనే ధ్యేయంతో ఉందని, ఇందులో భాగంగా అంతర్జాతీయ మీడియా పైన జరిగిన దాడిలో బిబిసి పైన జరిగింది తొలి దాడి. 


భారత దేశంలో పనిచేయడానికి విదేశీ విలేకరులకు వీసా మంజూరు చేయడంలో అడ్డంకులు సృష్టించడంతో పాటు సున్నితమైన ప్రాంతాలలో వారు పర్యటించడానికి కూడా ఆంక్షలు ఉన్నాయి. 


బిబిసి పైన దాడులు మొదలవ్వగానే, దాని పైన బీజేపీ విమర్శలు రెట్టింపయ్యాయి. 


బిబిసి "ప్రపంచంలో అంత్యంత అవినీతి సంస్థ" అని బీజేపీ అధికార ప్రతినిధి గౌతం భాటియా ఆరోపించగా, "చెడ్డ పనుల కోసమే ఏర్పడిన సంస్థ" అని బీజేపీ సభ్యుడు, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ కర్ ఆరోపించారు. 


బిబిసి కార్యాలయాల పైన ప్రభుత్వ దాడులు అభినానంద్ సెక్రిని ఆశ్చర్యపరిచాయి. 


డిజిటల్ మీడియాలో భాగంగా ఆయన నిర్వహించే  న్యూస్ లాండ్రీ చిన్నదైనా ప్రభుత్వంతో లాలూచీ పడేది కాదు కనుకనే 2001లో ఆయన కార్యాలయంపై రెండు సార్లు   ఇన్ కంటాక్స్ అధికారుల దాడులు జరిగాయి. 


"మేము ప్రసారం చేసే వార్తల పట్ల ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంటుందో ఇన్ కంటాక్స్ వంటి ఏజన్సీలతో భయపెడుతుంది" అని అన్నారు.


ఇన్ కంటాక్స్ దాడుల తరువాత కూడ న్యూస్  లాండరీపైన వేధింపులు ఆగలేదు. 


అభినానంద్ సెక్రి పైన క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా, మీ డాక్యుమెంట్లు సమర్పించాలని ప్రతి రెండు నెలల కొకసారి ఇప్పటికీ ఆదాయపన్నుల శాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి.


 " దేని కోసం వారు విచారిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా వార్తలు ఒక ప్రవాహం లాంటివి. మేం రాసే వాటిలో ఏ మార్పూ ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. 


కీలకమైన వార్తలను ప్రసారం చేసినందుకు నిరంకుశమైన చట్టాల కింద తమని ప్రాసిక్యూట్ చేస్తారని జర్నలిస్టుల్లో ఒక భయం పట్టుకుంది.


 'ద వైర్' వంటి న్యూస్ వెబ్సైట్లు, 'కారవాన్' వంటి పత్రికలు కీలకమైన వార్తలు ప్రసారం చేసినందుకు, రాసినందుకు కేసులు పెట్టారు.


 మహమ్మద్ జుబీర్ అనే జర్నలిస్టుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తొలుత ప్రసారం చేసి, తరువాత ఆయనను అరెస్టు చేసి, నిర్బంధించారు.


 సిద్ధికి కప్పన్ అనే కేరళకు చెందిన జర్నలిస్టును రెండేళ్ళు జైల్లో నిర్బంధించాక ఈ ఏడాదే బెయిల్ మంజూరైంది. 


ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో ఒక మైనర్ పై  సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చంపేసిన సంఘటనకు సంబంధించి వార్తను ఇవ్వడానికి కేరళ నుంచి వెళ్ళిన సిద్ధికి కప్పన్  ను టెర్రరిస్టు చట్టాల కింద అరెస్టు చేశారు.


 రెండేళ్ళ క్రితం అతన్ని అరెస్టు చేసినప్పటికీ ఇప్పటి వరకు విచారణేమొదలు పెట్టలేదు. 


వార్తల రిపోర్టింగ్ ద్వారా అతను మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వ ఆరోపణ. 


తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే కేసులు పెట్టారని సిద్ధికి కప్పన్ ఆరోపణ. 


"ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కీలకమైన వార్తలను రాశానని నాపై కక్ష కట్టారు. 


భారత దేశంలో స్వతంత్రంగా వ్యవహరించే జర్నలిస్టుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.


 పరిస్థితులు చాలా దారుణంగా దిగజారుతున్నాయి. 


నాకు జరిగిన దాన్ని ఇతరులకు ఒక హెచ్చరిక లాగా భావిస్తున్నారు' అని సిద్ధికి కప్పన్ అంటున్నారు.


మోడీ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకంటే కశ్మీర్లోనే ఎక్కువగా పత్రికా రంగాన్ని అణచివేస్తోంది.


 దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్న ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్ లో 2019 నుంచి పజ్జెనిమిది నెలల పాటు ఇంటర్నెట్ను నిలిపివేసింది.


 ఫలితంగా పత్రికా కార్యాలయాలు పూర్తిగా అణచివేతకు గురయ్యాయి. 


నియంతృత్వ చట్టాల కింద అరెస్టైన ముగ్గురు జర్నలిస్టులు ఇప్పటికీ జైళ్ళలోనే మగ్గుతున్నారు.


 మరికొంత మంది ని నిర్బంధించి, తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి, పోలీసులు విచారించారు.


 విదేశాలకు వెళ్లకుండా వారిపై ఆంక్షలు విధించారు. 


గత ఏడాది రాష్ట్ర ప్రెస్ క్లబ్ ను మూసేశారు. 


"మాకు 2019కి ముందు కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ, ఇంత దారుణంగా లేవు. 


ఒక పద్ధతి ప్రకారం జర్నలిస్టులను అణచి వేస్తున్నారు. 


స్థానిక పత్రికల్లో ఒక్కటంటే ఒక్క కీలకమైన కథనం రాయడానికి వీలులేని వాతావరణాన్ని కల్పించారు.


 మొదటి పేజీలు ప్రభుత్వానికి ప్రచారం చేసే కరపత్రాల్లా కనిపిస్తున్నాయి. 


సెన్సార్షిప్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది" అని కశ్మీరి టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురుధ్ బాసిన్ అన్నారు.


"భారత దేశంలో పత్రికల నోళ్ళు శాశ్వతంగా మూయించడానికి కశ్మీర్ ఒక ప్రయోగ శాలలా తయారైంది. 


ఈ పరిస్థితి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.


 ఇది చాలా ఆందోళన కరమైన పరిస్థితి" అని భాసిన్ వ్యాఖ్యానించారు.


నేటి 'మన తెలంగాణ' లో వచ్చిన కథనం

Monday, February 20, 2023

BJP SWOT Report

 విజ్ఞానవంతులైన భారతదేశ గడ్డమీద పుట్టిన సోదరులారా ఒక్కసారి వాస్తవాలను గమనించండి....

29 రాష్టాలలో కేవలం 8 రాష్టాలలోనే బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది

 #మరోవైపు : -

1) ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 0

2) కేరళలో 140  సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 0

3) మిజోరాంలో సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 1

4) పంజాబ్‌లో 117 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 2

5) మేఘాలయ 60 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 2

6) తెలంగాణలో 119 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 3

7) తమిళనాడులో 234 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 4

8) ఢిల్లీ లో 70 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 8

9) సిక్కిం లో 32 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 12

10) నాగలాండ్ 60 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 12

11) చత్తీష్ఘడ్ లో 90 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 14

12) ఒరిస్సాలోని 147 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 22

13) గోవాలో 40 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు20

14) ఝార్ఖండ్ లో 81 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 26

15) హర్యానాలో 90 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 40

16) రాజస్థాన్ లో 200 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 70

17) పశ్చిమబెంగాల్ లో 294 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 70

18) మహారాష్ట్ర లో  288 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 105

19) బీహార్ లో 243 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 76

20) అస్సాంలో 126 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 63

21) గుజరాత్  182 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 111

22) హిమాచలప్రదేశ్ లో 68 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 47

23) ఉత్తరప్రదేశ్  లో 403 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 255

24) అరుణాచలప్రదేశ్ 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 49

25) మధ్యప్రదేశ్ లో 230 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 130

26) ఉత్తరాఖాండ్ లో 70 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 47

27) మాణిపూర్ లో 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 37

28)త్రిపుర లో 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 36

29)జమ్మూకాశ్మీర్ లో 89 సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు 25

సంపూర్ణమైన ఆధిక్యంతో పరిపాలించే బీజేపీ రాష్ట్రాలు కేవలం 8 మాత్రమే...

1) గుజరాత్ 

2) హిమాచలప్రదేశ్ 

3) అరుణాచలప్రదేశ్ 

4) మధ్యప్రదేశ్ 

5) మణిపూర్ 

6) ఉత్తరప్రదేశ్ 

7) త్రిపుర 

8) ఉత్తరాఖండ్  ...

అర్థం స్పష్టంగా ఉంది ..

 ప్రాంతీయ పార్టీలతో మమేకమై దాదాపు పది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది....

బీజేపీ యొక్క 

అలలేదు ...

తుఫాను లేదు...

తొక్క లేదు...

వాస్తవానికి,దేశంలోని 66% సీట్లలో బీజేపీ ఓడిపోయింది...

బీజేపీ యొక్క ఈ సత్యాన్ని బహిర్గతం చేయడానికి

వీలైనంత వరకు ఈ పోస్ట్ను పంచుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము....

 ధన్యవాదాలు 

అమ్మకపు ఛానెల్స్ లేదా మీడియా ఈ నిజం చెప్పవు, కాబట్టి ఈ సత్యాన్ని కనీసం పది ప్రదేశాలకు పంపాలని నిర్ణయించుకోండి, తద్వారా ప్రజలు సత్యాన్ని తెలుసుకోవచ్చు...

మన దేశ భవిత కోసం మన దేశ పిల్లల భవిష్యత్తు కోసం....

భారతదేశ గడ్డమీద పుట్టిన ఒక సామాన్యుడు ఆవేదన మిత్రులారా ఆలోచించండి..