70 నెలలు పట్టినా.. లక్ష్యం నుంచి తప్పుకోం : ఒమర్
June 26 2021
శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సాఫీగానే సాగిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. తమ తమ అభిప్రాయాలను అందరూ మోదీ ముందు పెట్టారని తెలిపారు. రాజకీయ ప్రక్రియను ప్రారంభించడం, పరిస్థితులను మెరుగుపరిచే ప్రక్రియకు అంకురార్పణ జరిగిందని ఫరూక్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ... డీలిమిటేషన్ విషయంలో తమ విధానం చాలా స్పష్టంగా ఉందని, అవసరమైనప్పుడు ఫరూక్ అబ్దుల్లా సూచనలు తీసుకుంటారని తెలిపారని అన్నారు. అయితే ఇప్పటి వరకూ మాత్రం డీలిమిటేషన్ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న బీజేపీ ఆలోచన కార్యరూపం దాల్చడానికి 70 సంవత్సరాలు పట్టిందని ఫరూక్ అబ్దుల్లా కూడా అన్నారని, తమకు 70 నెలలు, 70 వారాలు పట్టినా తాము కూడా తామనుకున్న లక్ష్యం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలయెన్స్ హోదాలో తమను సమావేశానికి పిలవలేదని, అలా పిలిస్తే ఒక్కరు మాత్రమే వెళ్లేవారని అన్నారు. అదేవిధంగా గుప్‌కార్ అలయెన్స్ విధానానికి విరుద్ధంగా తామేమీ అక్కడ అభిప్రాయాలను చెప్పలేదని ఒమర్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment