Friday, June 25, 2021

బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు

 బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు

Jun 26 2021


భోపాల్ (మధ్యప్రదేశ్): ముంబై ఉగ్ర దాడుల్లో మరణించిన మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు సేకరించారని కర్కరేపై ప్ర‌జ్ఞా ఠాకూర్‌ ఆరోపణలు చేశారు.భోపాల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్ర‌జ్ఞా ఠాకూర్‌ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.2008 వ సంవత్సరంలో మాలేగావ్ పేలుడు కేసులో తనను అరెస్టు చేసినపుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని ఆమె చెప్పారు. ‘‘ప్రజలు హేమంత్ కర్కరేను దేశభక్తుడు అని పిలుస్తారు, కాని నిజమైన దేశభక్తులు అయిన వారు అతన్ని దేశభక్తుడిగా పిలవరు’’ అని భోపాల్ ఎంపీ ఠాకూర్ అన్నారు.

No comments:

Post a Comment