Friday, May 21, 2021

మాతో మాట్లాడలేదు.. అవమానంగా భావిస్తున్నాను: మమత

 మాతో మాట్లాడలేదు.. అవమానంగా భావిస్తున్నాను: మమత

May 20, 2021, 14:22 IST

Feel Humiliated PM Modi Did Not Let Us Speak Says Mamata Banerjee - Sakshi

కోల్‌కతా: కోవిడ్‌ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా న్యాయాధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. తమతో మాట్లాడలేదని.. దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత.



సమావేశం అనంతరం దీదీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు.. కానీ మాతో మాట్లాడలేదు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది అన్నారు. ఇది చాలా సాధారణ సమావేశంగా అనిపించింది’’ అన్నారు.


‘‘ప్రధాని ప్రవర్తించిన తీరు మమ్మల్ని అవమానించినట్లుగా అనిపించింది. ఆయన టీకాల గురించి కానీ, రెమ్‌డెసివర్‌, బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గురించి మాట్లాడలేదు. వ్యాక్సిన్‌ల కోసం డిమాండ్‌ చేయాలని భావించాం. కానీ మాకు మాట్లాడే అవకాశమే రాలేదు. గతంలో మాదిరిగానే ప్రధాని ఈ సారి కూడా కేసులు తగ్గుతున్నాయన్నారు. ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నారు. మేం చెప్పేది వినలేదు’’ అంటూ దీదీ మండిపడ్డారు


పశ్చిమ బెంగాల్‌తో సహా మరో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలు పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియాలను ఆందోళన జిల్లాలుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.

Thursday, May 20, 2021

రామరాజ్యాన్నేలుతున్న ఓ నగ్న చక్రవర్తీ.. శవవాహిని గంగను చూడయ్యా!

 May 17 2021 


రామరాజ్యాన్నేలుతున్న ఓ నగ్న చక్రవర్తీ.. శవవాహిని గంగను చూడయ్యా!

ప్రధాని లక్ష్యంగా గుజరాతీ మహిళ కవితాస్త్రం 

గంగానదిలో శవాలపై కన్నీటి అక్షరాలు


అహ్మబాద్‌, మే 16: దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుండటం.. ప్రజలు పిట్టలా రాలుతుండటంపై.. గంగానదీ ప్రవాహంలో శవాల కుప్పలు కొట్టుకొస్తుండటంపై ఆ కవయిత్రి తన కన్నీటినే సిరాగా చేసుకొని ఆవేదననంతా అక్షరబద్ధం చేశారు. దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కలం ఝళిపించారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీయే కారణమని చెబుతూ ఆయన్ను ‘‘రామరాజ్యాన్నేలుతున్న నగ్న చక్రవర్తి’’గా అభివర్ణించారు! పవిత్రమైన గంగానది శవాల కుప్పతొట్టిగా మారిందని గుర్తుచేస్తూ ‘ఓ ప్రభూ.. మీ ఆదర్శ రాజ్యంలో గంగానది ఘోషను వింటున్నారా?’ అని మోదీని ఆమె ప్రశ్నించారు. ఆ కవయిత్రి.. మోదీ పుట్టిన గడ్డ గుజరాత్‌ వాస్తవ్యురాలు.. పైగా ‘రానున్న కాలంలో గుజరాత్‌ కవితాజగత్తుకు ప్రతిరూపం’ అని ఒకప్పుడు సాక్షాత్తు బీజేపీ శ్రేణులు అభివర్ణించిన 51 ఏళ్ల పారుల్‌ ఖక్కర్‌! ‘శవవాహిని గంగ’ శీర్షికతో గుజరాతీ భాషలో ఆమె 14 పంక్తులతో కూడిన కవితను రాశారు. దీన్ని ఈనెల 11న సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేశారు. అయితే దేశంలోని ఔత్సాహిక కవులు.. ఆమె కవితను అస్సామీ, హిందీ, ఇంగ్లిషు, తమిళం, భోజ్‌పూరి, మలయాళం, బెంగాలీ భాషల్లో అనువదించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ‘ఓ ప్రభూ.. ప్రతి ఇంట్లోనూ యముడు భీకర నృత్యం చేస్తున్నాడు. మా గాజులే కాదు.. గుండెలూ ముక్కలవుతున్నాయి’ వంటి ఆవేదనా పూరితమైన లైన్లు కవితలో ఉన్నాయి. ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో మీడియా, విపక్షాలు.. మౌనపాత్ర పోషిస్తున్నాయని చురకలంటించారు. కాగా ప్రసిద్ధ రచయిత మృణాల్‌ పాండే, నవనిర్మాణ్‌ ఆందోళన్‌ అధ్యక్షుడు మనిషి జానీ ఈ కవితను ప్రశంసించారు. బీజేపీ శ్రేణులు మాత్రం ఖక్కర్‌పై భగ్గుమన్నాయి.


Mamata Banerjee "one nation, all humiliation"

 'She Hijacked PM Meet, Shameful': Mamata Banerjee's Ex-Aide

Mamata Banerjee's former aide Suvendu Adhikari said that while Bengal's Covid numbers "are miserable", the Chief Minister wanted to play politics.

'She Hijacked PM Meet, Shameful': Mamata Banerjee's Ex-Aide

Suvendu Adhikari said Mamata Banerjee had "once again shown her total disinterest in administration".

Kolkata: 

Mamata Banerjee's comments today on "one nation, all humiliation", accusing Prime Minister Narendra Modi of insulting Chief Ministers at a meeting on Covid, provoked an instant backlash from the BJP, including her former aide Suvendu Adhikari.

The Bengal Chief Minister had "once again shown her total disinterest in administration" and politicized the PM's meeting with District Magistrates, said Suvendu Adhikari, using the word "shameful" for his former mentor.

"To state clearly, PM Modi has held numerous meetings with Chief Ministers in the last few months, how many did Mamata Banerjee attend? ZERO. Now, she hijacks a PM-DM meet to say she was denied a chance to speak. Shameful!" - the BJP MLA said in tweets.

"Cooperative federalism is the firm commitment of PM Modi unlike Chief Minister Mamata Banerjee, who only believes in confrontational federalism." He added scathingly that while Bengal's Covid numbers "are miserable", the Chief Minister wanted to play politics. 

Mamata Banerjee had earlier alleged that the Prime Minister did not allow any Chief Minister to speak at his meeting today with district officials.

"This was not a one-way communication... it was one way humiliation... One nation, all humiliation," said the Chief Minister, who has been a part of several meetings on Covid and has skipped some too.

"Is the Prime Minister so insecure that he didn't want to listen to the Chief Ministers? Why is he so scared? If he didn't want to hear the Chief Ministers why call us? He let some District Magistrates speak and insulted the Chief Ministers," she said.

The Prime Minister, she said, never asked about the availability of beds, vaccine or oxygen or about the status of the black fungus infection in Covid patients. "We are embarrassed, ashamed," she said.

Describing PM Modi as "arrogant" and "casual", she said: "So many states were represented. No one was allowed to speak. What do they think? Are we bonded labourers or puppets? Only they matter? They are completely demolishing the federal structure."

Union Minister Ravi Shankar Prasad hit out at the Chief Minister saying she tried to derail the meeting. "Mamata Banerjee behaved in an unbecoming manner. She did not attend so many meetings. Today she tried to disturb the meeting. If PM wants to know what good work district officials are doing in some parts of the country, then what is wrong with it," Mr Prasad said. 

"What happened is unfortunate, shameful and condemnable," said the senior BJP leader.

Promoted
Listen to the latest songs, only on JioSaavn.com

The ruling party said since 2015, Ms Banerjee had missed many important meetings with the PM, like those on the restructuring of the planning commission, the land bill and "One Nation, One Election".

55CommentsMs Banerjee's collision with the BJP has been a near-daily affair since she came to power in Bengal for a third straight term in an election preceded by one of the most acrimonious campaigns in recent times.

Mohan Bhagwat's Criticism Shows The New Modi-RSS Equation

 Mohan Bhagwat's Criticism Shows The New Modi-RSS Equation


Ashutosh

OpinionUpdated: May 18, 2021 9:39 am IST

by TaboolaSponsored LinksSponsored

Avoid Spelling Errors With This Helpful Browser Extension (Grammarly)

2 and 3 BHK Apartments @ Ameenpur, Starting from Rs. 4450/sq.ft (Limited Offer) (Spring Is In The Air - Ameenpur)


65

"Is it true that the RSS is not happy with the overall handling of the Corona crisis?" I asked a senior RSS functionary. His laconic reply: "But what can it do?" His answer sums up the state of affairs in the RSS. It is in a state of utter helplessness. The RSS leadership which, with lot of fanfare, decided to project Narendra Modi as the BJP's Prime Ministerial candidate in 2013 now finds itself feeling dejected.


RSS chief Mohan Bhagwat's recent statement can be taken in that context. At an event meant to generate "positivity", he said, "We are facing this situation because, whether it was the government, administration or public, everyone dropped their guard after the first wave despite indications from doctors". He added, "We will not be scared. We shall stand like a rock." Then he quoted from religious scriptures and talked about Samudra Manthan (churning of the ocean) and how the churning produces nectar and poison. In his own style, he gave weight to the accusations of the Opposition that the Modi Government ignored the advice of the scientific community that a second wave of Corona would hit the country and it would be more lethal than the earlier one, but the Modi Government chose to ignore them, made no plan to contain the spread of the virus and that their priority was winning elections rather than saving lives.


The same day, another RSS leader, Ram Madhav, who till recently was serving as General Secretary of the BJP, and has now gone back to his original organisation, wrote a column for The Indian Express. If one reads between the lines, Madhav was critical of the government functioning. He wrote, "Initially, the government looked like 'a deer in the headlights,' as one commentator put it. But it has come out of that and is engaged full throttle in handling the challenge. A little more transparency, a little more engagement with the public by the political leadership and a little more openness to constructive criticism and enlightened expert opinion from outside the government would further help the government's efforts. After all, the lives of millions of people are at stake." Obliquely, he blamed the Modi government for the mess and spelt out the reasons including the lack of transparency. In the RSS, every word is uttered after much internal debate and discussion. Therefore, the words of Bhagwat and Madhav cannot be taken lightly or wished away as off-the-cuff remarks.


A BJP leader told me that that the top RSS leadership believes that the government has landed itself in a mess and this allows it to make a point that it has wanted to for some time: that the concept of collective leadership has been hijacked by the extreme centralization of the decision-making process so that even senior ministers are not consulted on crucial issues; only two people decide all matters. Those who were active in the organisation when Atal Bihari Vajpayee was Prime Minister feel that despite similar murmurs then, the government was at least open to suggestions, in particular from its ideological friends.


In 2014, Modi needed the RSS to win the election and become Prime Minister. And the RSS leadership felt that in Modi, they had found a perfect replacement to Advani, the original Hindu Hriday Samrat. Nobody could question his Hindutva. Since 2007, he had been busy branding himself as the Vikas Purush. Throughout the campaign, he did not utter a word which could be construed as 'communal'. The RSS was ecstatic with his thumping victory, but forgot that during his regime in Gujarat, the RSS and its subsidiary organisations were reduced to non-entities. In Gujarat, it was either Modi or no one. If they thought that Modi at the Centre would be a different person, they were grossly mistaken.


Modi has undoubtedly ensured the fulfilment of the Hindutva agenda after becoming Prime Minister. He has ideologically enhanced its reach many times over. Today, Hindutva is the hegemonic ideology. The RSS is no longer considered untouchable as it was in the past. But Modi has also ensured that it is he who gets all credit, not the RSS or its chief. Even within the Sangh Parivar, it is Modi, not Bhagwat who is the presiding deity.


The RSS works on the concept of 'follow the leader'; within the Sangh Parivar, the Sarsanghchalak is supreme, others have to follow him blindly. But Mohan Bhagwat, as the chief of the Parivar, falls short of that. Even K C Sudarshan, who was the RSS chief when Vajpayee was Prime Minister, carried a lot more weight. It was difficult for even Vajpayee to ignore him. Today, it's not the same. Bhagwat has systematically been cut to size; he is no longer the supreme commander, he is one of many leaders of the Sangh Parivar. With the appointment of Dattatreya Hosabale as the Sar Karywah (General Secretary), the Number Two post in the RSS, Bhagwat has lost more authority within the organisation. It is for the first time that a leader who had not worked within the core of the ideological function of RSS has been appointed to that position. Hosabale spent more time in the Akhil Bhartiya Vidyarthi Parishad, the student wing of the RSS. He is considered close to Modi. And there are many who believe that with his appointment, Modi controls the RSS and Bhagwat is only a figure-head. It is not surprising that Hosabale has a different take than Bhagwat. Late last month, Hosabale said, "It is possible that destructive and anti-Bharat forces in the society can take advantage of these circumstances to create an atmosphere of negativity and mistrust in the country."


At some other time, the RSS chief's statement would have been taken as a warning signal by the government. Today, it carries no weight. And it makes no difference to those who are at the helm. Earlier, the ideology was the driving force, the RSS leadership was the engine, the moral force of the Sangh Parivar; now, it has been replaced by power politics. And politics is the guiding principle. This is the truth the RSS must contend with.


(Ashutosh is Author and Editor, satyahindi.com) 


65

Comments

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. The facts and opinions appearing in the article do not reflect the views of NDTV and NDTV does not assume any responsibility or liability for the same.

Sunday, May 2, 2021

Is Modi's Image Falling Down?

 మోదీ గ్రాఫ్‌ పడిపోతోందా?



May 3 2021 @ 02:33AMహోంజాతీయం


ప్రజలను ఆకట్టుకోలేకపోతున్న ప్రసంగాలు!

భావోద్వేగాల కన్నా సమస్యలకే ప్రజల ప్రాధాన్యం

ఆరెస్సెస్‌ వర్గాల్లోనూ ఇవే అభిప్రాయాలు!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో స్పష్టం

ఎక్కడా ఆశించిన స్థాయిలో రాణించని బీజేపీ

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై అంచనాలు

మమత నేతృత్వంలో ప్రాంతీయ కూటమి ఏర్పాటు!

భాగస్వామిగా కాంగ్రెస్‌ చేరక తప్పని పరిస్థితి




న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవతరించే సమయం ఆసన్నమవుతోందా? ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్‌ పడిపోతోందా? అంటే.. అవుననే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ భావజాలంతో మొత్తం దేశ ప్రజల మనోభావాలను ఆకర్షించి, మధ్యతరగతినీ ఆకట్టుకున్న మోదీ ప్రభావం క్రమంగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మోదీ మాటలు, చేతలు, హావభావాలు ప్రజలపై ముద్రవేసే రోజులు పోయాయని ఆరెస్సెస్‌ వర్గాలు సైతం భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అన్నిరకాల ఆయుధాలు వాడినా బీజేపీ విఫలం కావడం, ఇతర రాష్ట్రాల్లో కూడా మోదీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం ఇందుకు కారణమని అంటున్నారు. నిజానికి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సంధించిన అస్త్రాలు, పన్నిన వ్యూహాలతో ఆ పార్టీ అఖండ విజయం సాధించే అవకాశాలుండేవని, కానీ.. కేవలం ప్రతిపక్షాల స్థానాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మమతా బెనర్జీకి బీజేపీ ఏమాత్రం నష్టం చేకూర్చలేకపోయిందని భావిస్తున్నాయి. 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీకి వచ్చిన సీట్లకూ, 2021లో వచ్చిన సీట్లకూ పెద్ద తేడా లేదని, కాంగ్రెస్‌, వామపక్షాలు దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో


వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోగలిగిందని ఈ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో కూడా బీజేపీ అన్నాడీఎంకేతో చేతులు కలిపినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేరళలో 2016లో బీజేపీ ఒక స్థానంలో పాగా వేయగా.. ఇప్పుడు అది కూడా పోయింది. కాగా, అసోంలో గత ఎన్నికల్లో 86 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి ఏకంగా 11 సీట్లు కోల్పోయింది.




సంఘటితం కాని హిందూ ఓటర్లు..!


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. బీజేపీ ఆశించినట్లుగా హిందూ ఓటర్లు సంఘటితం కానట్లు, ప్రజలు భావోద్వేగాల కన్నా తమ సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈనేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్షాలు గతంలో కంటే సంఘటితంగా వ్యవహరించి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం 300 కాగా.. ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి 329 సీట్లు ఉన్నాయి. మిగిలిన 216 సీట్లు ప్రతిపక్షాలకు ఉన్నాయి. వీటిలో బీజేడీ(12 సీట్లు), బీఎస్పీ(10) మాత్రం తటస్థంగా ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లోంచే ఎక్కువ మంది సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. దీంతో.. రాజ్యసభలో కూడా బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావచ్చని అంటున్నారు. 




కేంద్ర వ్యవస్థలు మాట వినవా!


భవిష్యత్తులో 3 కారణాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఒకటి.. హిందుత్వ ఓటర్లు సంఘటితమయ్యే అవకాశాలు లేకపోగా మైనారిటీల ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం కావడం. రెండోది.. మోదీ ఆకర్షణ క్రమంగా తగ్గిపోయి, ఆయన ఉపన్యాసాలు జనానికి విసుగు కల్పించడం. మూడోది.. మోదీ ప్రభావం తగ్గిపోవడం వల్ల బీజేపీలో లుకలుకలు బయలుదేరడం, వివిధ కేంద్ర సంస్థలు, వ్యవస్థలు మోదీ, అమిత్‌ షా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే అవకాశాలు తగ్గిపోవడం. అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్దుబాటు చర్యలు తీసుకుంటారా, ప్రతిపక్షాలు సంఘటితమై, బలమైన జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచగలరా అన్న అంశాలపై భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ వర్గాల అంచనా.






మమత కేంద్రంగా ప్రత్యామ్నాయ వేదిక!


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం నేపథ్యంలోజాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అది కూడా మమతా బెనర్జీ నాయకత్వంలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మమతా బెనర్జీ దాదాపు 15 పార్టీలకు లేఖ రాశారు. వీటిలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, ఆప్‌, బీజేడీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాది, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ తదితర పార్టీలున్నాయి. ఇప్పటికే డీఎంకే, ఆర్‌జేడీ, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాది పార్టీ.. బెంగాల్‌ ఎన్నికల్లో మమతకు అండదండగా నిలిచాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశాలుంటాయని, కాంగ్రెస్‌ సహా మెజారిటీ పార్టీలు ఈ సంఘటనకు మద్దతు ఇవ్వవచ్చని తెలుస్తోంది. రాహుల్‌గాంధీ ఎంత ప్రచారం చేసినా ఐదు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం కనిపించనందున.. కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు లేవని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీయే వాస్తవాలకు అనుగుణంగా జాతీయ ప్రత్యామ్నాయంలో ఒక భాగస్వామిగా మారక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.






























West Bengal Elections

 దీదీ హ్యాట్రిక్‌ మోదీకి చెక్‌!


May 3 2021 @ 02:44AMహోంజాతీయం


పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌ అపూర్వ విజయం

గత రెండు ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో గెలుపు

మమత పార్టీకి మూడింట రెండొంతుల స్థానాలు

సర్వశక్తులూ ఒడ్డినా బీజేపీకి దక్కని విజయం

అసెంబ్లీలో 3 నుంచి 75కు పెరిగిన ఆ పార్టీ బలం



ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు మినహా అధికార పార్టీలనే ప్రజలు ఆదరించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనబెట్టి గెలుపు తీరాలకు చేర్చారు. ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేశారు. ఎన్నికల చరిత్రలోనే హైటెన్షన్‌తో హోరాహోరీగా ప్రచారం జరిగిన పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెలువడే సరికి.. వాటిలో, ఏకంగా 213 సీట్లలో తృణమూల్‌ ఘన విజయం సాధించింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది. ఇతర రాష్ట్రాల తరహాలో ముస్లిముల ఓట్లు చీలిపోకుండా అడ్డుకోవడంలో మమత విజయం సాధించారని, ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిములంతా గుండుగుత్తగా తృణమూల్‌కే ఓటేశారని విశ్లేషిస్తున్నారు. కాకపోతే, తృణమూల్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారితో నువ్వానేనా అన్నట్లుగా నందిగ్రామ్‌లో బరిలోకి దిగిన మాత్రం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. 




చివరి రౌండ్‌ వరకూ ఇక్కడ ఉత్కంఠగా జరిగిన కౌంటింగ్‌లో చివరకు తన మాజీ బాస్‌పై సువేందు విజయ బావుటా ఎగురవేశారు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 77 స్థానాలను కైవసం చేసుకుని ఉనికిని బలంగా చాటింది. కానీ, హైటెన్షన్‌ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. అంతేనా, రెండేళ్ల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. బెంగాల్లోని 18 ఎంపీ సీట్లను బీజేపీ, 22 ఎంపీ సీట్లను తృణమూల్‌ గెలుచుకున్నాయి. అంటే, దాదాపు 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పట్లో బీజేపీ పాగా వేసింది. కానీ, రెండేళ్లలోనే దాదాపు 46 స్థానాల్లో కమలం ప్రభ తగ్గిపోయినట్లు చెబుతున్నారు. ఇక, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌.. రెండున్నర దశాబ్దాలపాటు అప్రతిహతంగా చక్రం తిప్పిన వామపక్షాలు బెంగాల్లో నామరూపాల్లేకుండాపోయాయి. వామపక్షాలు కనీసం ఖాతా కూడా తెరవలేదు. గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌.. 33 స్థానాల్లో గెలిచిన వామపక్షాలు ఇప్పుడు ‘శూన్యం’గా మిగిలాయి. ఇక, తమిళనాట వారసుడొచ్చాడు. కొన్ని దశాబ్దాలపాటు తమిళనాడును శాసించిన కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు, ద్రవిడ రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ జట్టు కట్టడంపైనా ఆసక్తి నెలకొంది. మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలే మళ్లీ అధికారాన్ని దక్కించుకున్నా.. తమిళనాట మాత్రం అన్నాడీఎంకేకు ఎదురు దెబ్బ తగిలింది. 




రాష్ట్ర అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా.. డీఎంకే కూటమి 157 సీట్లలో ఘన విజయం సాధించింది. అన్నాడీఎంకే కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ ఖాతా తెరవని బీజేపీ.. తమిళనాట ఈసారి ఐదు స్థానాల్లో విజయం సాధించడం విశేషం. ఇక, ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ తెరపైకి వచ్చిన కమలహాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం చతికిలబడింది. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కమలహాసన్‌ స్వయంగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, సంప్రదాయానికి భిన్నంగా కేరళ ఓటేసింది. వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించని ఆ రాష్ట్రం.. ఇప్పుడు ఎల్డీఎ్‌ఫను మళ్లీ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదలను; దేశంలోనే తొలిసారిగా కేరళలో అడుగుపెట్టి విలయం సృష్టించిన కరోనాను సమర్థంగా నిభాయించిన విజయన్‌ను విజయ తీరాలకు చేర్చింది. కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా.. ఎల్డీఎఫ్‌ 99 స్థానాలను సాధించింది. అధికారంపై ఆశలు పెట్టుకున్న యూడీఎఫ్‌ మాత్రం గత ఎన్నికల ఫలితాల (41)తోనే సరిపెట్టుకుంది. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ.. ఈసారి దానిని కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు, అసోంలో అధికార ఎన్డీయే కూటమికే ప్రజలు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో సాధించిన 59 సీట్లనే బీజేపీ ఇప్పుడు కూడా దక్కించుకుంది. అసోం గణపరిషత్‌ మాత్రం అప్పట్లో సాధించిన 11 స్థానాల్లో ఒకదానిని కోల్పోయింది. కాకపోతే, కాంగ్రెస్‌ ఐదు సీట్లను పెంచుకుని 32 స్థానాల్లో విజయం సాధించింది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజయ తీరాలకు చేరింది. యూపీఏ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. అయితే, స్థానిక పరిస్థితులకుతోడు సెంచరీకి చేరువవుతున్న పెట్రో ధరలు; వాటి కారణంగా ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై ప్రజలు తమ నిరసనను ఓటు రూపంలో వ్యక్తం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికితోడు బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలనూ తిరస్కరించారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఫలితాలకు ఇవే కారణమని వివరిస్తున్నారు. చివరిగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం మరోసారి ఫలించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఆయన వ్యూహాలు అందించిన డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించాయి. బెంగాల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ దాటదన్న ఆయన అంచనా కూడా నిజమైంది. అలాగే, కరోనా విలయంలో సమర్థంగా పని చేసిన ముఖ్యమంత్రులను ప్రజలు ఆదరించారు. మహారాష్ట్రతో పోటీ పడి కేసులు నమోదైనా.. మరణాల రేటు దేశంలోనే అత్యల్పంగా ఉన్న కేరళలో విజయన్‌ విజయానికీ ఇదే కారణమని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మమత విజయాలకు కారణాల్లో ఇది ఒకటిగా వివరిస్తున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో.. అక్కడ చివరి మూడు దశలను ఒకేసారి నిర్వహించి ఉంటే.. బీజేపీకి మరింత మంచి ఫలితాలు వచ్చి ఉండేవని విశ్లేషకులు అంటున్నారు.