అనూహ్య మార్పుల వత్సరం - కేంద్ర సర్కారు చొరవ
అనూహ్య మార్పుల వత్సరం
దేశీయంగా ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల్ని అందించి 2019 సంవత్సరం వెళ్లిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయేలా ఏమేం అందించిందో, ఎక్కడ పొరపొట్లకు తావిచ్చిందో ఓసారి అవలోకన చేసుకుందాం. అసలు అసాధ్యం అనుకున్న ఎన్నో న్యాయ, రాజ్యాంగపరమైన మార్పులు ఈ ఏడాదిలో సుసాధ్యమై చరిత్రలో నమోదయ్యాయి. భాజపా తీసుకున్న చాలా నిర్ణయాలు దేశాన్ని నిబిడాశ్చర్యంలో ముంచెత్తినవే. వాటిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తప్ప చాలావరకు సజావుగానే ప్రజల్లోకి వెళ్లాయనే చెప్పాలి.
అత్యంత వివాదాస్పదమైన ముమ్మారు తలాక్ అంశంలో వచ్చిన తీర్పుపై అక్కడక్కడ కొన్ని అసంతృప్తి గళాలు వినిపించినా, ముస్లిం సమాజం నుంచి భారీస్థాయిలో ప్రతిస్పందన వ్యక్తం కాలేదు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లోని నేతలు, మతపరమైన అంశాల జోలికి వెళ్లకూడదని, వాటి గురించి మాట్లాడొద్దనే భావనతో ఉండేవారు. భాజపా ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసింది. మహిళాసాధికారత, మానవత్వాలకు విరుద్ధంగా మూసధోరణిలో ఉన్నాయంటూ సదరు చట్టాలకు వ్యతిరేకంగా అడుగులేసింది. పార్లమెంటు ఉభయసభల్లో తాను తలపెట్టిన మార్పులకు ఆమోదం పొందింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నించే విషయంలో ప్రతిపక్షాల వాదనలకు విలువ దక్కలేదు. అలాంటివారి జాతీయవాదమే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపించింది. విమర్శల్ని తోసిరాజంటూ, ప్రతి వివాదాస్పద అంశాన్నీ జాతీయ సమగ్రత, భద్రతతో ముడిపెట్టేసి విమర్శలకు చోటులేకుండా చేసేశారు.
అధికరణ 370 రద్దు ఈ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం. ఇతరత్రా ఏ ప్రభుత్వమూ సాహసించలేని కార్యమనే చెప్పొచ్చు. అధికరణ రద్దుకు ముందు కఠినమైన ప్రణాళికను చాలా జాగ్రత్తగా అమలు చేశారు. తదనంతర పరిణామాలు, ప్రతిస్పందనల్నీ చక్కగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. జమ్మూకశ్మీర్ వీధుల్లో ప్రభుత్వం ఊహించిన దానిలో కనీసం అయిదు శాతమైనా ఆందోళన కనిపించని స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో తొలి కొన్ని వారాల్లో పౌరుల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. ఫోన్లు, ల్యాండ్‌లైన్, అంతర్జాలం అనుసంధానతను పూర్తిగా నిలిపేసి, ప్రజల మధ్య అనుసంధానత లేకుండా చేశారు. జనాల్ని పోగేసి, భారీ ఆందోళనలకు తెరతీస్తారనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు, ప్రధాన స్రవంతి పక్షాల రాజకీయ నేతలందరినీ నిర్బంధంలో ఉంచారు. అధికరణ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం మొత్తం రాజకీయ రంగాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ మీడియా తీవ్రస్థాయిలో విమర్శించినా, ఆ ప్రభావాన్ని నీరుగార్చేలా ప్రతి వాదనలూ పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ను దోషిగా చూపించడంతో భారత్ పని తేలికైంది.
హిందూ, ముస్లిముల మధ్య అత్యంత పురాతన వివాదమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు అంశమూ కచ్చితమైన ప్రణాళికతో కూడిన పద్ధతిలో పరిష్కారమైంది. ఆ ప్రణాళికను అమలు చేయడానికి ముందే ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేసే క్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ముస్లిములు సౌహార్ద భావనతో రామమందిర నిర్మాణం కోసం భూమిని హిందువులకు అప్పగించాలంటూ చాలామంది ముస్లిం మేధావులు అనేక వారాలకు ముందే, బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన మార్పులు చేసే సందర్భాల్లో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తంగా ఉండటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. సీఏఏకు ముందు చేపట్టిన మార్పులు, నిర్దిష్టంగా దేశంలోని ఒక వర్గానికి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో పెద్దగా ఆందోళనలు చెలరేగలేదు. పౌరసత్వ సవరణ చట్టం, 2019లో మార్పుల్ని తీసుకురావడం ద్వారా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2014, డిసెంబర్ 31కన్నా ముందు భారత్‌లోకి అడుగుపెట్టిన వారికి పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. ఈసారి మాత్రం ప్రభుత్వానికి ఊహించని రీతిలో ప్రతిస్పందన ఎదురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగి, 20 మంది పౌరులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
సీఏఏ విషయంలో ఉభయ సభల్లో ఆమోదం పొందిన తరవాత కేంద్ర హోంమంత్రి టీవీ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా మతపరమైన పీడనను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులు తమ భద్రత కోసం భారత్‌వైపు చూడొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు దేశ లౌకికవాద స్ఫూర్తిని కదిలించాయని చెప్పొచ్చు. ఆ ప్రకటన ముస్లిములకు తలుపులు మూసేసినట్లుగా ఉందనే భావన నెలకొంది. మొత్తంగా తాజా పరిణామాలు ప్రజల తీర్పునకు విరుద్ధంగా వెళ్లొద్దనే పాఠాన్ని నేర్పాయి.

No comments:
Post a Comment