Sunday, December 29, 2019

అనూహ్య మార్పుల వత్సరం - కేంద్ర సర్కారు చొరవ

అనూహ్య మార్పుల వత్సరం - కేంద్ర సర్కారు చొరవ

అనూహ్య మార్పుల వత్సరం
దేశీయంగా ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల్ని అందించి 2019 సంవత్సరం వెళ్లిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయేలా ఏమేం అందించిందో, ఎక్కడ పొరపొట్లకు తావిచ్చిందో ఓసారి అవలోకన చేసుకుందాం. అసలు అసాధ్యం అనుకున్న ఎన్నో న్యాయ, రాజ్యాంగపరమైన మార్పులు ఈ ఏడాదిలో సుసాధ్యమై చరిత్రలో నమోదయ్యాయి. భాజపా తీసుకున్న చాలా నిర్ణయాలు దేశాన్ని నిబిడాశ్చర్యంలో ముంచెత్తినవే. వాటిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తప్ప చాలావరకు సజావుగానే ప్రజల్లోకి వెళ్లాయనే చెప్పాలి.

అత్యంత వివాదాస్పదమైన ముమ్మారు తలాక్‌ అంశంలో వచ్చిన తీర్పుపై అక్కడక్కడ కొన్ని అసంతృప్తి గళాలు వినిపించినా, ముస్లిం సమాజం నుంచి భారీస్థాయిలో ప్రతిస్పందన వ్యక్తం కాలేదు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లోని నేతలు, మతపరమైన అంశాల జోలికి వెళ్లకూడదని, వాటి గురించి మాట్లాడొద్దనే భావనతో ఉండేవారు. భాజపా ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసింది. మహిళాసాధికారత, మానవత్వాలకు విరుద్ధంగా మూసధోరణిలో ఉన్నాయంటూ సదరు చట్టాలకు వ్యతిరేకంగా అడుగులేసింది. పార్లమెంటు ఉభయసభల్లో తాను తలపెట్టిన మార్పులకు ఆమోదం పొందింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నించే విషయంలో ప్రతిపక్షాల వాదనలకు విలువ దక్కలేదు. అలాంటివారి జాతీయవాదమే ప్రశ్నార్థకంగా మారిన    పరిస్థితి కనిపించింది. విమర్శల్ని తోసిరాజంటూ, ప్రతి వివాదాస్పద అంశాన్నీ జాతీయ సమగ్రత, భద్రతతో ముడిపెట్టేసి విమర్శలకు చోటులేకుండా చేసేశారు.

అధికరణ 370 రద్దు ఈ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం. ఇతరత్రా ఏ ప్రభుత్వమూ సాహసించలేని కార్యమనే చెప్పొచ్చు. అధికరణ రద్దుకు ముందు కఠినమైన ప్రణాళికను చాలా జాగ్రత్తగా అమలు చేశారు. తదనంతర పరిణామాలు, ప్రతిస్పందనల్నీ చక్కగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. జమ్మూకశ్మీర్‌ వీధుల్లో ప్రభుత్వం ఊహించిన దానిలో కనీసం అయిదు శాతమైనా ఆందోళన కనిపించని స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో తొలి కొన్ని వారాల్లో పౌరుల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. ఫోన్లు, ల్యాండ్‌లైన్‌, అంతర్జాలం అనుసంధానతను పూర్తిగా నిలిపేసి, ప్రజల మధ్య అనుసంధానత లేకుండా చేశారు. జనాల్ని పోగేసి, భారీ ఆందోళనలకు తెరతీస్తారనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు, ప్రధాన స్రవంతి పక్షాల రాజకీయ నేతలందరినీ నిర్బంధంలో ఉంచారు. అధికరణ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం మొత్తం రాజకీయ రంగాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ మీడియా తీవ్రస్థాయిలో విమర్శించినా, ఆ ప్రభావాన్ని నీరుగార్చేలా ప్రతి వాదనలూ పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ను దోషిగా చూపించడంతో భారత్‌ పని తేలికైంది.

హిందూ, ముస్లిముల మధ్య అత్యంత పురాతన వివాదమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు అంశమూ కచ్చితమైన ప్రణాళికతో కూడిన పద్ధతిలో పరిష్కారమైంది. ఆ ప్రణాళికను అమలు చేయడానికి ముందే ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేసే క్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ముస్లిములు సౌహార్ద భావనతో రామమందిర నిర్మాణం కోసం భూమిని హిందువులకు అప్పగించాలంటూ చాలామంది ముస్లిం మేధావులు అనేక వారాలకు ముందే, బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన మార్పులు చేసే సందర్భాల్లో ప్రభుత్వం ముందుగానే  అప్రమత్తంగా ఉండటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. సీఏఏకు ముందు చేపట్టిన మార్పులు, నిర్దిష్టంగా దేశంలోని ఒక వర్గానికి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో పెద్దగా ఆందోళనలు చెలరేగలేదు. పౌరసత్వ సవరణ చట్టం, 2019లో మార్పుల్ని తీసుకురావడం ద్వారా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి 2014, డిసెంబర్‌ 31కన్నా ముందు భారత్‌లోకి అడుగుపెట్టిన వారికి పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. ఈసారి మాత్రం ప్రభుత్వానికి ఊహించని రీతిలో ప్రతిస్పందన ఎదురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగి, 20 మంది పౌరులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

సీఏఏ విషయంలో ఉభయ సభల్లో ఆమోదం పొందిన తరవాత కేంద్ర హోంమంత్రి టీవీ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా మతపరమైన పీడనను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులు తమ భద్రత కోసం భారత్‌వైపు చూడొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు దేశ లౌకికవాద స్ఫూర్తిని కదిలించాయని చెప్పొచ్చు. ఆ ప్రకటన ముస్లిములకు తలుపులు మూసేసినట్లుగా ఉందనే భావన నెలకొంది. మొత్తంగా తాజా పరిణామాలు ప్రజల  తీర్పునకు విరుద్ధంగా వెళ్లొద్దనే పాఠాన్ని నేర్పాయి.

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర - India

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
దృఢసంకల్పంతో విశిష్ట విధానాలు

భారత విదేశాంగ విధానానికి 2019 సంవత్సరం కొత్త దారులు తెరచింది. ఈ సంవత్సరం భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలో శక్తిమంతమైన రాజ్యాల సరసన నిలపడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేసింది.  ఈ బృహత్తర కృషి విజయవంతంగా సాగడానికి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆరితేరిన, రాటుతేలిన ఎస్‌.జయశంకర్‌ను విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆయన 2015-18 మధ్య విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా, చైనాలమధ్య స్పర్థలు తారస్థాయికి చేరిన సమయంలో భారతదేశానికి గరిష్ఠ ప్రయోజనాలను సాధించిపెట్టే నేర్పు, అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. అంతర్జాతీయ సంబంధాల్లో చురుకైన పాత్ర పోషించడానికి జయశంకర్‌ సారథ్యంలో భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే దీనికి మొదటి సవాలు చైనా నుంచి ఎదురైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం సాధించకుండా మోకాలడ్డుతున్న చైనా, 2019 ఆగస్టులో భారత్‌-పాకిస్థాన్‌ సమస్యను మళ్ళీ లేవనెత్తింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా తనకున్న హోదాను భారత్‌కు వ్యతిరేకంగా ప్రయోగించింది. భారత్‌-పాక్‌ సమస్య గురించి భద్రతా మండలి చివరిసారి చర్చించినది- 1971 డిసెంబరులో. చైనా ఇప్పుడు దాన్ని తిరగదోడటంతో కశ్మీర్‌ సమస్యపై భారత్‌, పాక్‌లు మళ్ళీ దౌత్యపరంగా ఘర్షణపడటం అనివార్యమైంది. అక్టోబరులో భారత్‌-చైనాల మధ్య చెన్నైలో అనధికారిక శిఖరాగ్ర సమావేశం జరిగినా, చైనా బహుముఖ విన్యాసాల వల్ల ఆ సభ ఏమీ ఒరగబెట్టలేకపోయింది. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక సంభాషణలకు పునాది వేయలేకపోయింది.

పాక్‌కు పగ్గాలు
ఫిబ్రవరిలో పుల్వామాలో భారత భద్రతా దళాలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి రెండు దేశాల సంబంధాలను పాతాళానికి చేర్చింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల ఉగ్రవాద శిబిరాలపై భారతీయ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాంతో భారత్‌తో దౌత్య సంబంధాలను ఆగస్టులో పాక్‌ ఏకపక్షంగా తగ్గించుకుంది. సెప్టెంబరు నుంచి వివిధ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత్‌ మీద తీవ్ర దుష్ప్రచారం మొదలుపెట్టింది. అలాగని రెండు దేశాల మధ్య వైమనస్యం తప్ప సామరస్యం లేదని భావించనక్కర్లేదు. పాకిస్థాన్‌లో సిక్కు మతస్థులకు పరమపవిత్రమైన స్థలానికి భారతీయులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి వీలుగా నవంబరులో కర్తార్‌పూర్‌ నడవాను ప్రారంభించారు. రెండు దేశాల ప్రజల మధ్య సౌహార్దం నెలకొనడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. భారతదేశం పొరుగున నిరుడు ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. వీటి మధ్య పొరుగు దేశాలతో సంబంధాలను నిలబెట్టుకుంటూనే వాటిని మరింత పటిష్ఠపరచుకోవడంలో భారత్‌ సఫలమైంది. పాకిస్థాన్‌ పెడసర ధోరణి వల్ల భారతదేశం 2014 నుంచి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) వ్యవహారాలకు ప్రాధాన్యం తగ్గించసాగింది. దానికి బదులు బంగాళాఖాత సమీప దేశాలతో ఏర్పడిన ‘బిమ్‌స్టెక్‌’ను పటిష్ఠపరచడానికి గట్టిగా కృషి చేసింది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బంగ్లాదేశ్‌,   భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, మియన్మార్‌ దేశాల నాయకులు అతిథులుగా రావడం మన కృషి ఫలించిందనడానికి నిదర్శనం. రెండోసారి ప్రధాని పదవి చేపట్టగానే నరేంద్ర మోదీ తొలి పర్యటనకు మాల్దీవులను ఎంచుకోవడం, శ్రీలంక కొత్త అధ్యక్షుడి తొలి పర్యటన భారత్‌లోనే కావడం ‘బిమ్‌స్టెక్‌’ దేశాల మధ్య పెరుగుతున్న మైత్రీబంధానికి ప్రతీకలు. పొరుగు దేశాలకు ప్రాధాన్యమిచ్చే విదేశాంగ విధానాన్ని భారత్‌ అనుసరించడం వల్లనే ఇది సాధ్యపడింది.

‘తూర్పు దిశగా చొరవ’ విధానం కింద బంగ్లాదేశ్‌, మియన్మార్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భారత్‌ సఫలమైనా, ఈశాన్య భారతంలో పెరుగుతున్న అలజడులు ముల్లులా పొడుస్తున్నాయి. అవి ‘తూర్పు దిశగా’ కార్యాచరణకు అడ్డుపడేలా ఉన్నాయి. డిసెంబరు మధ్యలో గువహటిలో జరగాల్సిన భారత్‌-జపాన్‌ శిఖరాగ్ర సభ వాయిదా పడటం దీనికి ఓ ఉదాహరణ. ఆర్‌సీఈపీలో చేరరాదని భారతదేశం నిర్ణయించడం ఈ ఏడాది సంభవించిన మరో ముఖ్య పరిణామం. ఇది కూడా ‘తూర్పు దిశగా’ కార్యాచరణకు విఘాతమే. చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆగ్నేయాసియా దేశాల సంఘం కలిసి ఏర్పాటు చేసుకోదలచిన ఆర్థిక కూటమి-ఆర్‌సీఈపీ కూటమి దేశాల్లో దాదాపు సగం ప్రపంచ జనాభా నివసిస్తోంది. ఈ దేశాలన్నీ కలిసి 39 శాతం ప్రపంచ జీడీపీని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంతటి కీలకమైన కూటమిలో భాగస్వామి కాకపోతే భారత్‌ అపార ఆర్థిక అవకాశాలను వదులుకోవలసి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల మన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవడమూ కష్టం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీ, ఆర్‌సీఈపీకి దీటైన ఆర్థిక సహకార కూటమి ఏదైనా భారత్‌ ముంగిట ఉన్నదా అంటే అదీ లేదు. ప్రపంచీకరణ వెనకపట్టు పడుతున్నందువల్ల దేశాలు కొన్ని బృందాలుగా ఏర్పడి పరస్పరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న రోజులివి. ఈ సంక్లిష్ట సందర్భంలో భారత్‌ ఏకాకిగా మిగలడం శ్రేయస్కరం కానే కాదు.

ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ కూటమి స్పష్టమైన రూపు ధరిస్తే భారత్‌ ప్రయోజనాలు చాలావరకు నెరవేరతాయి. అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలతో ఈ కూటమి రూపుదాల్చవలసి ఉంది. తన సార్వభౌమత్వాన్ని పదిలపరచుకుంటూనే ఇండో-పసిఫిక్‌ కూటమిలో కొనసాగాలని భారత్‌ యోచిస్తోంది. హిందూ మహాసముద్రంలోని చాగోస్‌ దీవుల నుంచి బ్రిటిష్‌ వలస పాలన యంత్రాంగం ఆరు నెలల్లో వైదొలగాలని కోరుతూ గత మే నెలలో మారిషస్‌ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ బలపరచింది. ఈ ద్వీప సముదాయంలోని డీగో గార్సియా దీవిని బ్రిటన్‌ గతంలో అమెరికాకు అప్పగించగా, వాషింగ్టన్‌ అక్కడ ఒక వైమానిక స్థావరాన్ని నెలకొల్పింది. ఇండో-పసిఫిక్‌ కూటమిలో గల్ఫ్‌ దేశాలు, అరేబియా సముద్రంలోని ద్వీపదేశాలు, ఆఫ్రికా తీర దేశాలను కూడా కలుపుకొని పోవాలని భారత్‌ గట్టిగా ప్రతిపాదించింది. ఇండో-పసిఫిక్‌ కూటమి పరిధిని ఈ విధంగా విస్తరించదలచింది. చెన్నై నుంచి రష్యా దూరప్రాచ్య రేవు వ్లాదీవోస్తోక్‌కు సముద్ర రవాణా మార్గాన్ని ఏర్పరచబోతున్నట్లు సెప్టెంబరులో కీలక ప్రకటన వెలువడింది. తద్వారా భారత్‌ ఇండో-పసిఫిక్‌ కూటమిలో రష్యానూ భాగస్వామిని చేయడానికి అడుగులు వేసింది.

సుహృద్భావమే గీటురాయి
ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
ఈ సంవత్సరంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ అంశాలవారీగా సంబంధాలు నెరపింది. కొన్నింటిపై ఏకాభిప్రాయం, మరికొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు ఉండవచ్చు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కాకుండా దేనికదే అన్నట్లు వ్యవహారం నడిపింది. భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం బలపడింది. డిసెంబరులో రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల (2+2) సమావేశంలో ఇది సుస్పష్టమైంది. భారతదేశంలో ఆయుధ విడిభాగాల తయారీకి రష్యా తోడ్పడనుంది. దీనికోసం సంయుక్త పరిశ్రమలు నెలకొల్పాలని అంగీకారం కుదిరింది. రష్యా దూరప్రాచ్యంలో వ్యాపార అభివృద్ధికి భారత్‌ 100 కోట్ల డాలర్ల రుణ సహాయం అందించనుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, నిపుణులు పనుల కోసం తాత్కాలిక ప్రాతిపదికపై అక్కడికి వెళ్లే సౌలభ్యం ఏర్పడుతుంది. భారత్‌-రష్యాల చిరకాల వ్యూహబంధమూ బలపడుతుంది. రక్షణ రంగంలో ఫ్రాన్స్‌తో సహకారం ఈ ఏడాది మరింత ఇనుమడించింది. దీనితోపాటు హిందూ మహాసముద్రంలో భద్రతా పరమైన భాగస్వామ్యమూ బలపడింది. భారత్‌-ఫ్రాన్స్‌ సహకార వృద్ధి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా విస్తృత ప్రభావం ప్రసరిస్తుంది. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా భారత్‌ ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, సోవియట్‌ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడినా, నేడు చైనా నుంచి ఎదురవుతున్న సవాలు వల్ల అది కూడా కనుమరుగవుతోంది. ప్రపంచం క్రమంగా బహుళ ధ్రువత్వం వైపు పురోగమిస్తోంది. ఆసియా కేంద్రిత బహుళ ధ్రువ ప్రపంచమది. ఈ వేదికపై ప్రధాన పాత్రధారిగా ఎదగడమే లక్ష్యంగా భారత్‌ విధాన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది.

న్యాయపోరాటంలో విజయం

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉరిశిక్ష నిలుపుచేసేలా అంతర్జాతీయ న్యాయస్థానంలో సానుకూల తీర్పు రాబట్టడం- ఈ ఏడాది భారత్‌ సాధించిన ఘన విజయాల్లో ఒకటి. 49 ఏళ్ల కుల్‌భూషణ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ 2016లో పాకిస్థాన్‌ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించింది. గూఢచర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారనే అభియోగాలను ఆయన మీద మోపింది. ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్‌ అదే సంవత్సరం మే ఎనిమిదిన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్‌భూషణ్‌ అసలు పాకిస్థాన్‌కే వెళ్ళలేదని,    ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయనను పాకిస్థాన్‌ అపహరించిందని ఆరోపించింది. ఈ కేసులో 2019 జులై 17న అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పాక్‌ విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేసింది. తీర్పును పునస్సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పారు. దీంతో అంతర్జాతీయ వేదికపై పాక్‌కు చుక్కెదురైంది. కుల్‌భూషణ్‌ అరెస్టు, అనంతర విచారణల్లో పాకిస్థాన్‌ అన్యాయంగా వ్యవహరించిందని, భారత రాయబారులు ఆయనను కలవకుండా పదేపదే నిలువరించిందని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుపట్టింది.

నిజాం నిధుల కేసులోనూ గెలుపు

ప్రపంచశక్తిగా ప్రత్యేక ముద్ర
నిజాం నిధుల కేసులోనూ ఈ ఏడాది పాకిస్థాన్‌కు బ్రిటన్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంకులో ఈ నిధులున్నాయి. 1948లో అప్పటి నిజాం ఆర్థిక, విదేశాంగ మంత్రి మొయిన్‌ నవాజ్‌ జంగ్‌- కొత్తగా ఏర్పాటైన పాకిస్థాన్‌ తరఫున బ్రిటన్‌లో హైకమిషనర్‌గా ఉన్న హబీబ్‌ ఇబ్రహీం రహీంతుల్లా ఖాతాలోకి రూ.8.82 కోట్లకు పైగా సొమ్మును బదలాయించారు. అనంతరం ఈ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు పాక్‌ నిరాకరించడంతో- 1954లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ బ్రిటన్‌ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ నిధుల విలువ రూ.306.50 కోట్లు. నిజాం వారసులు ప్రిన్స్‌ ముఖర్రం జా, ఆయన సోదరుడు ముఖఫం జా, భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో తీర్పు భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆ ఖాతాలో జమ అయిన నిధులు ఆయుధాల సరఫరాకోసం చేసిన చెల్లింపులేనని, అవి తమకే చెందుతాయని పాక్‌ చేస్తున్న వాదనలను బ్రిటన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఏడాది అక్టోబరులో వెలువరించిన తీర్పులో బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిన డబ్బుకు, ఆయుధాల సరఫరాకు సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలేవీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో బ్రిటన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో కీలకమైంది.

- అశోక ముఖర్జీ
(రచయిత- ఐక్యరాజ్య సమితిలో మాజీ భారత రాయబారి)

Tuesday, December 17, 2019

"Come What May...": Amit Shah Refuses To Back Down On Citizenship Act

"Come What May...": Amit Shah Refuses To Back Down On Citizenship Act
Union Home Minister Amit Shah assured protesters that nobody's nationality will be lost because of the amended Citizenship Act.
All IndiaWritten by Neeta SharmaUpdated: December 17, 2019 19:39 IST
by TaboolaSponsored LinksSponsored
Everyone In Hyderabad Is Talking About This High Speed WiFi-Booster (Super Boost WiFi)
Dr. Aquaguard, Water Purifiers - Get to Know The Best Purifier For Your Home. (Eureka Forbes)

Amit Shah said that helping persecuted migrants was the sole objective of the law.


60
New Delhi: Union Home Minister Amit Shah today refused to back down in the face of nationwide protests against the amended Citizenship Act, saying that the centre will do everything in its power to provide citizenship to migrants from persecuted communities in neighbouring countries.
"Come what may, the Modi government will ensure that these refugees get Indian citizenship and live as Indians with honour," Amit Shah said at a rally in Delhi's Dwarka, even as fresh protests against the law broke out against the controversial law in Seelampur.

The amended law aims to provide citizenship to non-Muslim migrants from Pakistan, Afghanistan and Bangladesh who came to India until December 31, 2014. While rights activists and opposition parties allege that it discriminates on communal lines, stakeholders in the Northeast claim that the move will throw open the floodgates for illegal migrants into the region.

Violent protests that began in the Northeast against the law eventually shifted to the national capital, culminating in a police crackdown on the Jamia Millia Islamia University that sparked further agitations across the country.

Amit Shah tried to assuage the apprehensions of protesters, claiming that nobody's nationality would be lost because of the amended Citizenship Act. "I want to tell our students as well as Muslim brothers and sisters that there's nothing to fear. Nobody is going to lose Indian citizenship. The legislation is on the website for everybody to read. We believe in sabka saath, sabka vikas and injustice will not be done to anybody," he said, accusing the opposition Congress of trying to mislead the people.

The Home Minister maintained that the sole purpose of the law was to give citizenship to those who faced persecution in Pakistan, Bangladesh and Afghanistan. "Although these people were supposed to be given protection by Pakistan under the Nehru-Liaqat Pact, it did not happen. Where can they seek refuge -- the Hindus, Sikhs and other minorities -- if not India?" he asked, telling opposition politicians to take a first-hand look at their living conditions.

Addressing a rally in Jharkhand earlier today, Prime Minister Narendra Modi had challenged the opposition parties to either openly announce that they are "ready to grant Indian citizenship to every Pakistani" or take steps to restore Jammu and Kashmir's special status.

Friday, December 6, 2019

హైదరాబాద్‌లో ముగిసింది.. మరి ఉన్నావ్‌లో ఎప్పుడు?

హైదరాబాద్‌లో ముగిసింది.. మరి ఉన్నావ్‌లో ఎప్పుడు?
06-12-2019 20:00:40

ఉన్నావ్: నేరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆ జిల్లా నిండా కీచకులే. వారానికొక దుర్యోదన, దుశ్శాసన పర్వం వెలుగులోకి వస్తుంది. అయినా ఎవరూ జోక్యం చేసుకోరు. కాదని కాళ్లు దువ్వితే నేరుగా కాటికే పంపిస్తారు. అంత డేంజర్ జిల్లా అది. అత్యాచారాలకు ఉత్తరప్రదేశ్ బిందువు అయితే.. దాని కేంద్ర బిందువు ఉన్నావ్. నేరాలు, ఘోరాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని జిల్లా ఉన్నావ్. ప్రజా ప్రతినిధుల నుంచి వారికి కాపలా కాసే చెంచాలవరకు నిస్సహాయ మహిళలపై విరుచుకుపడుతుంటారిక్కడ. కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు అనేవి ఇక్కడ దైనందిక జీవితాలలో కామన్.

పోలీసులు, చట్టాలు, ప్రభుత్వం ఉన్నా.. బలవంతులను కట్టడి చేయలేకపోతున్నాయి. సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత కఠినంగా వ్యవహరించినా ఫలితం శూన్యం. అంత డేంజరస్ జిల్లా ఉన్నావ్. అత్యాచారానికి పాల్పడడం, పోలీసుల సాయంతో బాధితులను బెదిరించి లొంగదీసుకోవడం అక్కడ కామన్. కాదని తెగించి కోర్టు మెట్లు ఎక్కితే వారిని లేపేయడం అక్కడ కల్చర్. ఈ ఏడాది ఇప్పటి వరకు 271 కిడ్నాప్‌లు నమోదుకాగా, 84 అత్యాచారాలు, 177 లైంగింక దాడులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా స్థానిక పంచాయతీల్లో సెటిల్ అయిన ఘటనల సంఖ్య చాలా ఎక్కువ.

తాజాగా పెళ్లిపేరుతో నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిపై ఓ యువతి కేసు పెట్టింది. అంతే.. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు అదను చూసి వేటు వేశాడు. విచారణ కోసం రాయబరేలి కోర్టుకు వెళుతున్న యువతిపై తనవాళ్లతో కలిసి దాడి చేశాడు. నిలువునా నిప్పంటించాడు. 90 శాతానికిపైగా కాలిపోయిన శరీరంతో సుమారు కిలోమీటరు పరుగెత్తినా.. సాయం చేసేవాళ్లు కరువయ్యారు. అయితే మీడియా కారణంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలిని హుటాహుటిన విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే హైదరాబాద్‌లో దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయిన నేపథ్యంలో వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలని యూపీలో గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.


Unnao Woman, Set On Fire By Men Accused Of Raping Her, Dies
The woman, who had suffered 90 per cent burns after she was set on fire, died of a cardiac arrest at the Safdarjung Hospital at 11:40 pm, where she had been air-lifted to from Uttar Pradesh last evening.
All IndiaEdited by Vaibhav TiwariUpdated: December 07, 2019 00:52 IST
by TaboolaSponsored LinksSponsored
From IPS to ICU, his journey is as inspiring as it is heartbreaking (impactguru.com)
The Best Beaches In Southern Thailand (CNN International with Mastercard)
Unnao Woman, Set On Fire By Men Accused Of Raping Her, Dies
The woman had told the police she was thrashed and stabbed before being set on fire (File)

READ INOTHER LANGUAGES

New Delhi: A 23-year-old woman, who was set on fire by men accused of raping her in Uttar Pradesh's Unnao, has died at a hospital in Delhi.
The woman, who had suffered 90 per cent burns after she was set on fire on Thursday, died of a cardiac arrest at the Safdarjung Hospital at 11:40 pm, where she had been air-lifted to from Uttar Pradesh last evening.

"She suffered cardiac arrest at 11:10 pm and we tried to resuscitate her, but she could not survive and at 11:40 pm she died," said Dr Shalabh Kumar, Head of Department (Burns and Plastic), Safdarjung Hospital.

The woman had told the police she was thrashed and stabbed before being set on fire by five men near her village in Unnao, including two she had accused of raping her and their fathers. She was on her way to a court hearing in her rape complaint when the men surrounded her near a railway station.

The woman, in her burnt state, was conscious all the way to the hospital, where she gave a statement to the police identifying all five attackers.

"At 4 am I was going to a local railway station to catch a train to Rae Bareli. Five people (she named them) were waiting for me. They surrounded me and first hit me on the leg with a stick and also stabbed me in the neck with a knife. After that they poured petrol on me and set me on fire," the woman told the police from her hospital bed in Unnao.


With 86 Rapes, 185 Sex assaults In 2019, Unnao Becomes UP's "Rape Capital": Report

"When I started shouting, a crowd collected and the police was called," she had said.

The police however say a medical report has not confirmed the stab injury.

Her alleged rapist Shivam Trivedi, who was among the attackers, had been released on bail in the case five days ago. His co-accused Shubham Trivedi, who had been missing, also participated in the attack.

All five attackers were arrested from their homes.

The circumstances in which the woman's rapist was released on bail are being questioned. So is the role of the police, who filed an FIR on her rape complaint in March, four months after she was allegedly gang-raped by Shivam Trivedi and his neighbor Subham Trivedi.