షరతులతోనే కశ్మీర్ విలీనం!
22-08-2019 00:41:48
ఇటీవల ఆగస్టు 11, 2019తేదీన ఆంధ్రజ్యోతిలో కృతి రాసిన వ్యాసాన్ని చదివాను. ఆయన బొంకులు నిజం కాలేవన్నారు. అది ఆయన వ్యాసానికే అన్వయిస్తుంది. హరిసింగ్ తన సంస్థానాన్ని బేషరతుగా విలీనం చేస్తూ సంతకం చేశారన్నారు. ఇది నిజం కాదు. ఆయన కొన్ని షరతులు విధించి తన సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేశారు. గతంలోనే ఆయన రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. భారత దేశ స్వాతంత్ర్య చట్టం అమలులోకి రాగానే ఆయన సర్వ స్వతంత్రుడయ్యాడు. పై శాఖలు ఆయన చేతిలోకి వెళ్ళి పోయాయి. 1947 అక్టోబర్‌లో పాక్ దళాలు దాడి చేసినప్పుడు ఆ శాఖలన్నీ తిరిగి మౌంట్ బాటన్ నాయకత్వంలోనున్న భారత అధినివేశ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ లేఖ రాశాడు. మిగతా పరిపాలనా శాఖలపై తనకుగల ఆధిపత్యాన్ని వదులుకోలేదు. తన స్వయం ప్రతిపత్తిని వదులుకోలేదు. ఆయన రాసిన Instrument of Accession లేఖ కశ్మీరు సమస్యకు కీలకం.
సంపూర్ణ స్వాతంత్ర్య ప్రతిపత్తిని నిలబెట్టుకోవడం కొరకు చివరి వరకు కృషి చేసిన హరిసింగ్ ప్రజాస్వామ్య వ్యవస్థల కొరకు పోరాడుతున్న షేక్ అబ్దుల్లా మద్దతుకొరకు తన దివాన్ రామచంద్ర కక్ ద్వారా ప్రయత్నించాడు. అబ్దుల్లా దీనికంగీకరించలేదు. కాని సంస్థాన స్వయం ప్రతిపత్తికి అంగీకరించాడు. కనుక 1948 మార్చిలో హరిసింగ్ అబ్దుల్లాను ప్రధానమంత్రిగా నియమించడమే కాకుండా స్వయంప్రతిపత్తి కల కశ్మీర్‌కి ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని నిర్మించేందుకు అనువుగా శాసన సభను ఏర్పాటు చేశాడు. ఈ శాసన సభ రచించిన కశ్మీర్ రాజ్యాంగాన్నే భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. దాని ఫలితమే 370 అధికరణ.
అంబేడ్కర్ రాజ్యాంగ సభ చైర్మన్ కాదు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్. న్యాయ శాఖా మంత్రిగా రాజ్యాంగ రచనా కమిటీకి మాత్రం అంబేడ్కర్ చైర్మన్. ఆయన 370అధికరణను తిరస్కరించలేదు. నెహ్రూ, పటేల్, అంబేడ్కర్, గోపాలస్వామి అయ్యంగార్, వి.పి.మీనన్లు సుదీర్ఘ సంప్రదింపులు జరిపి ఈ అధికరణను రూపొందించారు.
గోపాలస్వామి అయ్యంగారు నెహ్రూ మిత్రుడు కాదు, హరిసింగ్ మిత్రుడు. హరిసింగ్ లేఖను అందుకొన్నది మౌంట్ బాటన్. దానికి సమాధానం ఇచ్చింది కూడా ఆయనే. నెహ్రూ హరిసింగ్‌కి ఎటువంటి లేఖ ఈ సందర్భంలో రాయలేదు. ఐక్యరాజ్య సమితి భారత్‌లో కశ్మీర్ విలీనం న్యాయబద్ధమైనదని, చట్టబద్ధమైనదని చెప్పలేదు. ప్రజాభిప్రాయ సేకరణను అనుసరించి దాని భవిష్యత్తు తేల్చాలని నిర్ణయించింది. అందు చేతనే అది ఇప్పటికీ ఐరాస ఎజెండాలో నలుగుతూనే ఉంది.
శ్రీ కృతి వంటి బి.జె.పి పెద్దలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాజరిక పాలన మీదే విశ్వాసం. అందుకనే శివాజి, కృష్ణదేవరాయలు వంటివారి పదజాలాన్నే ఆధునిక నాయకులకు కూడా ఆపాదిస్తూ ఉంటారు. మంత్రివర్గ నిర్ణయం, శాసన సభా తీర్మానం వంటి పదాలు వాడలేరు.
యస్.వి.కె. ప్రసాద్

No comments:
Post a Comment