వెంకయ్యగారూ! మీకిది తగునా?
22-08-2019 00:41:16
‘దేశ ప్రజల సంక్షేమానికై అమలుజేసే అనేక కీలక కేంద్ర చట్టాలను 370 అధికరణం మూలంగా జమ్మూ కశ్మీర్‌లో అమలు చేయలేకపోతున్నామని’ వెంకయ్య నాయుడు తన వ్యాసంలో వాపోయారు. కానీ, మానవాభివృద్ధి సూచికల్లోని అన్ని విషయాల్లో దేశ సగటుకంటే జమ్మూకశ్మీర్ ముందున్నదనేది వాస్తవం. అక్కడ ఆగిపోయిన అభివృద్ధి ఏమిటి? అభివృద్ధి అంటే మనుషుల అభివృద్ధి తప్ప కార్పొరేట్ల, ధనవంతుల అభివృద్ధి కాదు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల సంఖ్య 22శాతం ఉంటే అది కశ్మీర్‌లో 10శాతమే. ఇలాగే విద్యలో, వైద్యంలో, ఇతర సూచికల్లోనూ ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉంది.
జమ్మూకశ్మీర్‌పై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి వ్యాసం 18వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. వ్యక్తిగత అభిప్రాయాలెలా ఉన్నా, రాజ్యాంగాన్ని ‘తొత్తడం చేసి’ కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాన్ని రాజ్యాంగ పరిరక్షక పదవుల్లో ఉన్న ఆయన సమర్థించ బూనటం, ఆ సమర్థనలోనూ అవాస్తవాలూ, వక్రీకరణలూ చోటుచేసుకోవటం విచారకరం.
‘నా దృష్టిలో 370 అధికరణం రద్దు అనేది దేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షించే దిశలో సరైన ముందడుగు’ అని వెంకయ్య అన్నారు. అయితే ఈ చర్య ఏవిధంగా దేశ సమైక్యత, సమగ్రతలను రక్షిస్తుందో ఆయన వివరించలేకపోయారు. మనందరిదీ భారతదేశమే. మనమంతా భారతీయులమే. అయితే, అందరమూ ఒక జాతిగా మాత్రం లేము. అనేక జాతుల సమూహంగా మనం ఉన్నాం. ఈ వాస్తవాలను, ఈ వైవిధ్యాన్ని, భిన్నత్వాలను ఐక్యతవైపు నడిపించగలిగే శక్తి ఏమిటి? ఈ ప్రశ్న ఇప్పటిదే కాదు. స్వాతంత్ర్యానంతర భారతదేశం ఎలా ఉండాలి అనేది జాతీయోద్యమ కాలంలోనూ, స్వతంత్ర భారతం అవతరించాక, రాజ్యాంగ రూపకల్పన సమయంలోనూ ముందుకొచ్చిన ప్రశ్నే. దీనికి సమాధానంగానే రాజ్యాంగ రూపకల్పన జరిగింది. ఫెడరల్, యూనిటరీ లక్షణాలతో మన రాజ్య వ్యవస్థ ఏర్పడింది. అనేక ప్రాంతాలకు, రాష్ట్రాలకు వారి, వారి ఆర్ధిక సామాజిక సాంస్కృతిక అసమానతలను బట్టి కొన్ని ప్రత్యేక రాయితీలు, హక్కులు, అధికారాలు రాజ్యాంగంలో ఇవ్వబడ్డాయి. అనంతర కాలంలో రాష్ట్రాలకు మరిన్ని హక్కులు, అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగ సవరణలూ జరిగాయి. తర్వాతి కాలం మొత్తంగా చూస్తే రాష్ట్రాల హక్కులను, అధికారాలను క్రమంగా కుదించటం, కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను లాగేసుకుని సర్వాధికారాలూ కేంద్రం చేతిలో కేంద్రీకరించబడటం అనేది ఒక ట్రెండ్‌గా సాగింది. దీనికి వ్యతిరేకంగా ఎన్‌టిఆర్, జ్యోతిబాసు తదితరుల నాయకత్వంలో ‘రాష్ట్రాల హక్కులు, అధికారాల’పైన పెద్ద పోరాటమే జరిగింది. తర్వాత సర్కారియా కమిషన్ ఏర్పడి రాష్ట్రాల అధికారాలపై అనేక సిఫార్సులు చేసింది. అయినా రాష్ట్ర అధికారాలను కేంద్రం లాగేసుకునే ‘ట్రెండ్’ మాత్రం ఆగలేదు.
రాజ్యాంగం వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేకతల్లో జమ్మూకశ్మీర్‌కు ఇవ్వబడిన ‘స్వయంప్రతిపత్తి’ దానికనుగుణంగా రూపొందిన 370 అధికరణం కూడా ఒకటి. ఏదైనా ఒక అంశాన్ని దాని చారిత్రక నేపథ్యంలో చూడకుండా ఆవేశకావేశాలతో హ్రస్వదృష్టితో చూడటం అన్యాయమవుతుంది. ‘భారతీయులందరూ సమానులే ఎవరికీ ప్రత్యేక చట్టాలు ఉండకూడదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులుండకూడదు’ అని వాదించే వారికి కనీస ‘కామన్‌సెన్స్’ ఉండాలి కదా? ఈ ప్రమాదకరమైన ధోరణి ఎక్కడికి దారి తీయబోతోందో అర్థం కావాలి కదా?
మన దేశంలో అనేక రాష్ట్రాలకు, భిన్న తరగతుల ప్రజలకు ప్రత్యేక హక్కులు, రాయితీలు ఇవ్వబడ్డాయి. ఏ ప్రత్యేకతల లేక వెనకబాటుతనం వల్ల అవి కల్పించబడ్డాయో ఆ లోపాలను అధిగమించేవరకూ అవి అలాగే కొనసాగటం అవసరం. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలో గిరిజనులు కాకుండా ఇతరులు భూములు కొనకూడదు. రాజ్యాంగంలో 370 ఆర్టికల్ మాత్రమే లేదు. 371 కూడా ఉంది. ఈ ఆర్టికల్ 371ఎ నుండి 371ఐ వరకూ వివిధ రాష్ట్రాలలో స్థానికేతరులు భూమి కొనుగోలు చేయటం దగ్గరనుంచీ స్థానికేతరులు ఉద్యోగాలు పొందటం వరకూ వివిధ రూపాల్లో నిషేధాలు విధించాయి. ఇవన్నీ తప్పంటామా? ఈ రాయితీలన్నీ తక్షణమే రద్దు చేయాలని ఎవరైనా చెప్పగలరా?
తెలంగాణలో మొదట ముల్కీపేరుతో, తరువాత 371డి కింద స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించే జోనల్ వ్యవస్థ వరకూ ఉన్నాయి. తాజాగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే జీవో ఇచ్చారు. అలాగే ఆంధ్రాలో అన్ని పార్టీలూ కోరుతున్న ‘ఆంధ్రాకు ప్రత్యేక హోదా’ అనేది ఒక రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక హక్కు కాదా? కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దును సమర్ధించిన జగన్ పార్టీకి, టిడిపీకి ఈ డిమాండ్లు చేసే నైతిక అర్హత ఉంటుందా? వివిధ రాష్ట్రాలకు అదనపు హక్కులు కోరటం సంగతి అటుంచండి. ఉన్న హక్కులు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దక్షిణాది రాజధాని పేరుతో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ ఆర్థిక పరిస్థితేమిటి? 370ఆర్టికల్ రద్దును ఉత్సాహంగా సమర్థించిన కేసీఆర్ అపుడేం మాట్లాడగలరు?
‘దేశ ప్రజల సంక్షేమానికై అమలుజేసే అనేక కీలక కేంద్ర చట్టాలను 370 అధికరణం మూలంగా జమ్మూ కశ్మీర్‌లో అమలు చేయలేకపోతున్నామని’ ఆ వ్యాసంలో వెంకయ్య వాపోయారు. పలు చట్టాలను ప్రస్తావించారు.. కానీ, మానవాభివృద్ధి సూచికల్లోని అన్ని విషయాల్లో దేశ సగటుకంటే జమ్మూకశ్మీర్ ముందున్నదనేది వాస్తవం? అక్కడ ఆగిపోయిన అభివృద్ధి ఏమిటి? ఆ రాష్ట్రంలో 1950లో ఏర్పడిన షేక్ అబ్దుల్లా ప్రభుత్వం భూసంస్కరణలు అమలుజేసింది. కౌలుదార్లందరికీ భూమిహక్కులనిచ్చింది. 23ఎకరాలకంటే మించిన భూస్వాముల భూమినంతటినీ స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచింది. రాజులకు రాజభరణాలను అపుడే రద్దుజేసింది. కౌలుదారులకు చట్టం ద్వారా పూర్తి ‘భూ యాజమాన్య హక్కు’ను కల్పించింది.
అభివృద్ధి అంటే మనుషుల అభివృద్ది తప్ప కార్పొరేట్ల, ధనవంతుల అభివృద్ధి కాదు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల సంఖ్య 22శాతం ఉంటే అది కశ్మీర్‌లో 10శాతమే. దేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు 23శాతం ఉంటే అక్కడ కేవలం 2శాతం మందే ఉన్నారు. పుట్టిన ప్రతిబిడ్డా బతకటం దేశంలో 68శాతం ఉంటే ఆ రాష్ట్రంలో అది 73శాతంగా ఉంది. ఇలాగే విద్యలో, వైద్యంలో, ఇతర సూచికల్లోనూ ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కానీ మీరు వాదిస్తున్నదేమిటి? 370 ఆర్టికల్‌ని రద్దు చేయటం ద్వారా కశ్మీర్ అభివృద్ది అవుతుందని? ఇది నిజమా? కానే కాదు. ఇపుడున్న ప్రజల అభివృద్ధిని నాశనం చేసి కార్పొరేట్ శక్తులను అభివృద్ధి చేయటం మీ లక్ష్యం.
‘విలీన సందర్బంలో ఈ ఆర్టికల్ లేదు...షేక్ అబ్దుల్లా వత్తిడిమేరకు తరువాత 370 అధికరణం చేర్చారు’ అని వెంకయ్య అన్నారు. ఇంకొంతమందైతే ‘నెహ్రూ వల్ల ఇది జరిగింది. పటేల్ అయి ఉంటే ఇలా జరిగేది కాదని’ వాదిస్తున్నారు. ఇవేవీ వాస్తవాలు కావు. కశ్మీర్ విలీన సందర్భంలోనే వారికి ప్రత్యేక రాజ్యాంగం హక్కు అంగీకరించబడింది. మన రాజ్యాంగంలో ఈ అధికరణ చేర్పుగురించి సంపూర్ణ చర్చ, అందరి ఆమోదం తర్వాతనే చేర్చబడింది. 1949 మే 15,16తేదీల్లో పటేల్ ఇంట్లోనే ఈసమస్య చర్చించిన ముఖ్య సమావేశం జరిగింది. పటేల్‌తోపాటు, నెహ్రూ, షేక్ అబ్దుల్లా కూడా దీనిలో పాల్గొన్నారు. అలాగే అంబేడ్కర్ 370 ఆర్టికల్‌ను వ్యతిరేకించారనీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన మాతో ఇలా చెప్పాడంటూ వేరేవాళ్ల రచనను వెంకయ్యనాయుడు ఉటంకిస్తున్నారు. దేని ఆధారంగా చెబుతున్నారు. అంబేడ్కర్ రచనల నుండా?, రాజ్యాంగ సభలో ఆయన అభిప్రాయాల రికార్డుల నుండా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే... వాస్తవంగా అంబేడ్కర్ అలా చెప్పలేదుగాబట్టే. ప్రముఖులను, వారి పలుకుబడిని ఇలా అడ్డదారుల్లో దుర్వినియోగం చేయటం తగని పని.
‘370 అధికరణ కశ్మీర్ ప్రజలను మిగతా భారత ప్రజలతో సన్నిహితంజేసే బదులుగా అగాధాన్ని మరింత విస్తరింపజేసింది’ అన్నది వెంకయ్య నాయుడి విశ్లేషణలో ఒక ముఖ్యమైన పొరపాటు. అగాధం పెరిగిన మాట నిజమేగానీ, దానికి కారణం 370అధికరణ మాత్రం కాదు. దానిని బలహీన పర్చటం, ఒకటొక్కటిగా కశ్మీర్ అధికారాలన్నింటినీ కేంద్రం లాగేసుకుని ఆ ప్రజలను ‘పరాయివారి’గా ద్వేషించటం అసలు కారణం. వెంకయ్య ఒక చోట ‘ఈ అధికరణం చచ్చుబడిపోయిందనే’ నిజం చెప్పారు. అయితే, అలా చచ్చుబడేయించిందెవరో చెప్పలేదు. అలాగే ఆ చచ్చుబడేయించటమే ఆయన చెప్పిన అగాధానికి అసలు కారణమనేదీ గ్రహించలేదు. కశ్మీర్‌కు ఇవ్వబడిన ‘స్వయం ప్రతిపత్తి’లోని అనేక అంశాలను తొలగిస్తూ 1954 నుండి ఇప్పటివరకూ 42సార్లు జీవోలు ఇచ్చారు. దీనివల్ల కశ్మీరీల్లో, ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. బలప్రయోగంతో ఈ సమస్యను పరిష్కరించాలని నెహ్రూ మొదలుకొని అన్ని ప్రభుత్వాలూ ప్రయత్నించాయి. ఈ తప్పుడు వైఖరే కశ్మీర్ సమస్యను రాచపుండు చేసింది. మరోవైపు పాకిస్థాన్ ఈ అసంతృప్తిని వాడుకుంది. తన మిటిటెంట్లను జొప్పించి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించింది. స్థానికంగా అనేక ముస్లిం ఫండమెంటలిస్టు సంస్థలు పెరిగాయి. ముస్లిం జనాబా అధికంగా ఉన్నా కూడా.. విభజన సమయంలో పాకిస్థాన్‌లో విలీనం కావటానికి వ్యతిరేకించి ఇండియాతో కలవాలని కశ్మీర్ ప్రజలు కోరుకున్నారు. దురదృష్టమేమంటే ఆ భారతీయ ప్రేమికుల దేశభక్తి మన పాలకులకు అర్ధం కాకపోవటం లేదా అర్ధం చేసుకోవటానికి ఇష్టం లేకపోవటంవల్ల ఈ అనర్ధమంతా జరిగింది. తత్ఫలితంగా భారతీయులంటే కశ్మీరీలు ద్వేషించే పరిస్థితి పరిణమించింది.
‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత దానికి రాష్ట్రహోదా లభిస్తుందనే విశ్వాసం కూడా నాకున్నది’ అని వెంకయ్య రాశారు. అది జరగాలంటే ‘మేము సాధారణంగా జీవించగలమనే విశ్వాసం’ ఆ రాష్ట్ర ప్రజలకు ఏర్పడాలి. కానీ ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మొత్తం రాష్ట్రం దిగ్బంధించబడింది. కోటికిపైగా ఫోన్‌లైన్లు కట్ చేయబడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆపివేయబడింది. ఇంటర్‌నెట్ సౌకర్యం తీసేసారు. స్కూళ్లు, ఆఫీసులు, షాపులు అన్నీబంద్ పెట్టారు. పత్రికలు, టీవీలు ఏవార్తా మాద్యమాలూ అక్కడ లేవు. అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు జైళ్లలో ఉన్నారు. ఇంకా 4వేల మందికి పైగా జైళ్లకు పంపబడ్డారు. కశ్మీర్ రాష్ట్రమే ఒక జైలుగా మార్చబడింది. ఇది సాధారణ పరిస్థితిని సాధించే మార్గం కానేకాదు. కశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని చేసే గౌరవప్రదమైన రాజకీయ పరిష్కారమే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది.
తమ్మినేని వీరభద్రం
సిపిఐ (ఎం), తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

No comments:
Post a Comment