Saturday, May 14, 2022

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Published: Thu, 12 May 2022 11:20:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mayawati నోట Azam Khan ప్రస్తావన.. BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లఖ్‌నవూ: Samajwadi party సీనియర్ నేత Azam Khan తొందరలోనే Bahujan Samaj Party లో చేరనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా BSP సుప్రెమో Mayawati చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని కొందరు అంటున్నారు. ప్రత్యర్థులపై నిరంతరం ద్వేషపూరిత, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని.. ఎమ్మెల్యే అజాంఖాన్ విషయంలో జరిగిందిదే అంటూ గురువారం మాయావతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇదే తరుణంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీతో పోల్చి విమర్శలు గుప్పించారు. ఎస్పీని కాదనుకుంటే బీజేపీ వైపు అజాంఖాన్ వెళ్లే ప్రసక్తి లేదు. అయితే కాంగ్రెస్ గూడికి వెళ్లొచ్చనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

‘‘Bharatiya Janata Party అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పాలన Congress పాలనకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, ముస్లింలపై దౌర్జన్యాలు చేస్తూ భయాందోళనలకు గురి చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీ ప్రభుత్వం కూడా తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషం వెల్లగక్కుతోంది. తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యే అజాంఖాన్‌లో రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచారు. ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఆక్రమణల పేరుతో భయాందోళనలు సృష్టిస్తూ దురుద్దేశపూరిత వైఖరి అవలంబిస్తూ వలసదారులను శ్రామికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై విస్తృత చర్చ జరగాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

26 నెలల నుంచి జైలులో ఉన్న Azam Khan ను SP అధినేత Akhilesh Yadav ఒకేసారి కలిశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాకుండా తన జైలు జీవితంలో పార్టీ నుంచి ఎలాంటి మద్దతు తనకు అందలేదని అజాంఖాన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. జైలులో సైతం కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలను కలుస్తున్న ఆయన.. ఎస్పీ నేతలను మాత్రం కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే ఎస్పీ నుంచి బయటికి రావడానికి అజాంఖాన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయని అనుకుంటున్నారు.

Tuesday, May 3, 2022

Rahul Gandhi in Night Club.

 Published: Wed, 04 May 2022 03:01:37 IST

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌!

twitter-iconwatsapp-iconfb-icon

 సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌


విందులో ఆయన పక్కనే చైనా దౌత్యవేత్త.. పెళ్లికని వచ్చి వివాదంలో చిక్కుకున్న నేత

దేశం సంక్షోభంలో ఉండగా ప్రధాని మోదీ విదేశాలకు ఎలా వెళ్లారని కాంగ్రెస్‌ ట్వీట్‌ 

కౌంటర్‌గా రాహుల్‌ నైట్‌క్లబ్‌ వీడియో లీక్‌.. బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం


న్యూఢిల్లీ, మే 3: నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. కాఠ్‌మాండూలోని పాపులర్‌ నైట్‌ క్లబ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఆ పార్టీలో రాహుల్‌గాంధీ పక్కనే నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా పనిచేస్తున్న యువతి కూడా ఉండటం రాజకీయ దుమారాన్ని సృష్టించింది. బీజేపీ నేత కపిల్‌ శర్మ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఎవరో గుర్తు పట్టండి’ అంటూ నిప్పు రాజేశారు. అది సోషల్‌ మీడియాలోనే కాకుండా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మీడియా మిత్రురాలు సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ ఐదు రోజుల పర్యటనపై నేపాల్‌ వచ్చినట్లు అక్కడి పత్రికలు రాశాయి. సుమ్నిమా ఉదాస్‌ కొన్నాళ్లు సీఎన్‌ఎన్‌ ఢిల్లీ విలేకరిగా పని చేశారు. ఆమె తండ్రి మయన్మార్‌లో నేపాల్‌ రాయబారి.

వివాహం ఏర్పాట్లలో భాగంగా రాహుల్‌గాంధీకి, ఇతర మిత్రులకు మారియట్‌ హోటల్లో బస ఏర్పాటు చేశారు. కపిల్‌ శర్మ షేర్‌ చేసిన ఈ వీడియోలో నైట్‌క్లబ్‌లో జోరుగా సంగీతం వినిపిస్తుండగా, రాహుల్‌గాంధీ మరో ముగ్గురు వ్యక్తులు ఒక టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. మిగతా వ్యక్తులు డ్రింక్స్‌ తాగుతుండగా రాహుల్‌ మాత్రం పక్కనున్న యువతితో మాట్లాడుతూ, ఫోన్‌ చూస్తూ కనిపించారు. రాహుల్‌ వ్యక్తిగత జీవితంతో తమకు పని లేదని, ఆయన చైనా ఏజెంట్లతో కూర్చున్నపుడు ప్రశ్నించక తప్పదని కపిల్‌ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాహుల్‌గాంధీ విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ విమర్శించారు. 2008లో ముంబై మీద ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌లో ఉన్నారని ఆరోపించారు.


కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మత ఘర్షణలు జరుగుతుంటే ఆ పార్టీని నడిపించాల్సిన రాహుల్‌ విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నారని బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోశారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ గట్టిగానే బదులిచ్చింది. మిత్రదేశం నేపాల్‌లో స్నేహితుడి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి రాహుల్‌గాంధీ వెళ్లడం నేరమేమీ కాదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీయే 2015లో ప్రత్యేక విమానంలో నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో పిలవని పేరంటానికి వెళ్లి, కేక్‌ కట్‌ చేసి మరీ వచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. బీజేపీ నేత తేజ్‌పాల్‌ బగ్గా మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్‌ నిజాయితీకి చప్పట్లు కొట్టాలి. సోమవారం రాత్రి పది గంటలకు రాహుల్‌గాంధీ నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో ఎంజాయ్‌ చేస్తుంటే ఆ పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ దేశం సంక్షోభంలో ఉంటే సాహెబ్‌(ప్రధాని) విదేశాలకు ఎలా వెళ్తారని ట్వీట్ల మీద ట్వీట్లు వేసి నిలదీసింది’’ అన్నారు.


నిజానికి సోమవారం రాత్రి కాంగ్రెస్‌ పెట్టిన ఈ ట్వీటే బీజేపీని రాహుల్‌గాంధీ మీద వ్యక్తిగత దాడికి దిగేట్లు చేసిందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పప్పు కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. పార్ట్‌ టైం రాజకీయ డ్రామాలో చేస్తున్న ప్రకటనలు కూడా అర్థ రహితంగా ఉంటున్నాయని, మత్తులో మునిగి తేలుతున్న వ్యక్తులే అలాంటి ప్రకటనలు చేస్తారని ఎద్దేవా చేశారు.

Tuesday, April 26, 2022

కాంగ్రెస్‌... కిం కర్తవ్యం?

 కాంగ్రెస్‌... కిం కర్తవ్యం?

ఇండియాగేట్

Published: Wed, 27 Apr 2022 03:59:01


1.

ప్రశాంత్ కిషోర్  వెనుక కొన్ని శక్తులు ఆయనను కాంగ్రెస్‌లో చేరమని ప్రోద్బలం చేశాయా? 

2.

జనంలో రాజకీయ కదలిక రావాలంటే జనాన్ని ఆవహింపచేసే ఒక సిద్ధాంతం అవసరం. 

3.

భారతీయ జనతా పార్టీకి ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నది. పద్ధతి ప్రకారం అది తన సిద్ధాంతాన్ని జనంలో ఆవహింపచేస్తున్నది. 

4. 

కాంగ్రెస్ వారసత్వాన్నీ, సిద్ధాంతాన్నీ, ఆ పార్టీ నేతలను చరిత్ర పుటల్లోంచి తొలగించి తన సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి పకడ్బందీగా పనిచేస్తోంది. 

5.

కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అయిన దళితులు, ఆదివాసీలను తన వైపుకు తిప్పుకునేందుకు, ఓబీసీలను ఆకర్షించేందుకు బిజెపి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోంది. 

6.

 అంబేడ్కర్, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు వంటి నేతల్ని బిజెపి స్వీకరించి జనంలో వారి గురించి చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ నిశ్చేష్టగా చూస్తున్నది. 

7.

 తన మార్కు దేశభక్తిని బిజెపి జనంలోకి ప్రవేశపెడుతున్నా, దేశభక్తి గురించి మాట్లాడే సమర్థమైన నేతలు ఎవరూ కాంగ్రెస్‌లో లేరు, 

8.

కాంగ్రెస్ సమకాలీనత్వాన్ని కోల్పోతున్నది. వామపక్ష పార్టీల్లాగా గతంలో జీవిస్తోంది. 


కొద్దిరోజుల క్రితం నుంచీ దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ వార్తల్లో ఉంటున్నది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మంతనాలు జరపడం ఆ పార్టీ పట్ల జనం ఆసక్తిని ఏర్పర్చింది. ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరతాడని, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఆ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయన్న చర్చ సాగింది. కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ మూలంగా రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందిన దాఖలాలు ఉన్నందువల్లే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మెరుగుపడుతుందనే ఆశ ఆ పార్టీ వాదుల్లో తొణికిసలాడింది. చివరకు ప్రశాంత్ కిషోర్ అనుకున్న హోదాను కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అనడంతో ఆయన ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించారు.



VDO.AI


అసలు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంకాగాంధీతో సహా హేమాహేమీలందరూ పది రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటల్ని ఆసక్తిగా వినడమే ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. సీనియర్ నేతలతో పాటు ముఖ్యమంత్రుల్ని కూడా సోనియా పిలిపించి ప్రశాంత్ కిషోర్ చెప్పింది వినమని చెప్పారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమైన తర్వాత దిక్కుతోచని స్థితిలో పార్టీ నేతలు ఆయన మాటలు వినేందుకు ముందుకు వచ్చారు. తలలు పండిన నేతలు సైతం 45 సంవత్సరాల యువకుడి ప్రజంటేషన్ చూసి తలలూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు చెప్పినవేవీ వారికి తెలియనివి కావు. పార్టీ అధిష్ఠానం ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ సంబంధాలు కోల్పోయిందని, దేశంలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసి కూడా ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. తనను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసే స్వేచ్ఛ ఇస్తే, నేతలు తన మాటలు వినేలా చేస్తే పార్టీని ఎన్నికల బరిలో బలంగా నిలుపుతానని ఆయన మాట ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అలా చేయగలరా లేదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. తన సంస్థ ఐపాక్‌తో సంబంధాలు తెంచుకుంటానని, ఆ సంస్థ టీఆర్ఎస్ వంటి ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు. సంస్థ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఎవరి సాయంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పనిచేయించడం ఆయనకు సాధ్యమవుతుందా? ఉన్నట్లుండి బయటనుంచి ఒక వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం తానే నడిపిస్తానంటే, మిగతా నేతలు ఎక్కడికి వెళ్లాలి? ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాడు. మోదీలాగా అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చే నేతా కాదు. పార్టీలో అధికారాలు అనుభవిస్తూ కేవలం వ్యూహరచనల ద్వారానే ఎన్నికల్లో గెలిపించడం సాధ్యమవుతుందా? నాయకత్వం లేకపోవడమే కాంగ్రెస్ లోటు. ఆ లోటు ప్రశాంత్ కిషోర్ పూరించగలరా? నిజానికి కాంగ్రెస్‌కు సరైన సలహాలు ఇచ్చే పని ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరకుండానే చేయవచ్చు. గతంలో నరేంద్రమోదీ, జగన్మోహన్ రెడ్డి, నితీశ్‌ కుమార్, మమతా బెనర్జీ, ఇప్పుడు కేసిఆర్‌లకు పనిచేసినట్లే కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చే బాధ్యతను నిర్వహించవచ్చు. ఎవరూ ఎవరికి ఉచితంగా సలహాలనివ్వరు. దానికి ఎంతో కొంత బిల్లు ఉండనే ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మానుకుని కాంగ్రెస్‌లో చేరేందుకే ఆయన ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు? అందులో ఎజెండా ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందువల్ల అందులో చేరి ఆ పార్టీని తన నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమవుతుందని భావించారా? లేక ఆయన వెనుక కొన్ని శక్తులు ఆయనను కాంగ్రెస్‌లో చేరమని ప్రోద్బలం చేశాయా? ప్రశాంత్ కిషోర్‌ను చేర్చుకుని తమ అస్తిత్వాన్ని కోల్పోవడం ఇష్టం లేకే పార్టీ నేతలందరూ ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు సాధికారిక కమిటీలో చేరి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్‌కు అవకాశం ఉన్నది. కాని నలుగురిలో ఒకడుగా ఉండి ప్రాధాన్యత కోల్పోవడం ఆయనకూ ఇష్టం లేదు. బహుశా కన్యాశుల్కంలో గిరీశంలా ఆయన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అని అనుకుని ఉంటారు!

ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బిజెపితో రెండు యుద్దాలు చేసి ఓడిపోయింది. పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఎన్నికలోనూ పార్టీ దెబ్బతింటూ వస్తోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2.32 శాతం మాత్రమే సంపాదించింది. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించే పరిస్థితులు ఉన్నప్పటికీ గెలిపించగల నాయకత్వం లేదని రుజువు చేసుకుంది. పంజాబ్‌లో ఆఖరి రోజుల్లో ముఖ్యమంత్రిని తొలగించి, ఆచరణ సాధ్యం కాని ప్రయోగాలు చేసి కుప్పకూలిపోయింది. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పంజాబ్‌లో డిపాజిట్ కోల్పోయారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. 2014లో కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. 2013కు ముందు 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో ఉండేది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీకి ఢిల్లీలో కేవలం 5 శాతం ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా ఉనికే కోల్పోయింది. ప్రశాంత్ కిషోర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ తల రాతని మార్చగలగిన శక్తి ఉండదు. కాంగ్రెస్ ఇప్పటికీ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో కొంత బలంగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఏమి చేయాలో ఆ పార్టీ తీవ్రంగా చర్చించవలిసి ఉన్నది. క్రింది స్థాయి నుంచి పార్టీలో జవజీవాలు కల్పించాల్సి ఉన్నది. గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయాల్సి ఉన్నది. దళితులు, వెనుకబడిన వర్గాలు మళ్లీ కాంగ్రెస్ పట్టులోకి వచ్చేందుకు ఏమిచేయగలమా అని ఆ పార్టీ నేతలు ఆలోచించాల్సి ఉన్నది.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనంలో కదలిక తేగలిగిన పరిస్థితిలో ఉన్నదా లేదా, తెచ్చేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆ పార్టీ నేతలే చర్చించుకోవాలి. జనంలో కదలిక రావాలంటే జనాన్ని ఆవహింపచేసే ఒక సిద్ధాంతం అవసరం. భారతీయ జనతా పార్టీకి ఎవరు కాదన్నా, ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నది. పద్ధతి ప్రకారం అది తన సిద్ధాంతాన్ని జనంలో ఆవహింపచేస్తున్నది. కాంగ్రెస్ వారసత్వాన్నీ, సిద్ధాంతాన్నీ, ఆ పార్టీ నేతలను చరిత్ర పుటల్లోంచి తొలగించి తన సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి పకడ్బందీగా పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అయిన దళితులు, ఆదివాసీలను తన వైపుకు తిప్పుకునేందుకు, ఓబీసీలను ఆకర్షించేందుకు బిజెపి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ పలుకుబడిగల వివిధ వర్గాల నేతలు బిజెపిలో చేరేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీతో కలిసి పనిచేసే శక్తులు కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని పటిష్ఠం చేసుకుని దాన్ని జనంలో ఉధృతంగా ప్రవేశపెట్టనంతవరకూ ఆ పార్టీకి ఊపు వచ్చే అవకాశాలు లేవు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సిద్ధాంత కర్త కాదు. అసలు ఆయనకు ఒక సిద్ధాంతం అంటూ ఉన్నదని కూడా చెప్పలేము. నరేంద్రమోదీకైనా, జగన్మోహన్ రెడ్డికైనా. కేసిఆర్‌కైనా ఆయన అప్పటి రాజకీయ పరిస్థితులను అనుసరించి సలహాలు ఇవ్వగలరేమో కాని వారి భావజాలాన్ని మార్చలేరు. తెలంగాణలో కేసిఆర్‌కు మించిన రాజకీయజ్ఞానం ఆయనకు ఉన్నదని కూడా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. బహుశా తన పథకాలు, విధానాలను జనంలోకి బాగా తీసుకువెళ్లేందుకు, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో ఒక నెట్‌వర్క్ కోసం ప్రశాంత్ కిషోర్‌ను ఆయన సంప్రదించి ఉంటారు. అసలు ఒక సిద్ధాంతానికి కట్టుబడని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుని ఏం ప్రయోజనం పొందగలదు? బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించి జనంలోకి తీసుకువెళ్లగలిగిన నేతలు ఆ పార్టీకి అవసరం.

విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీ తాను ఏమిచేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది. అంబేడ్కర్, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు వంటి నేతల్ని బిజెపి స్వీకరించి జనంలో వారి గురించి చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ నిశ్చేష్టగా చూస్తున్నది. స్వాతంత్ర్య అమృతోత్సవాలను కేంద్రం, బిజెపి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా, స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. పైగా తమ పార్టీయే స్వాతంత్ర్యాన్ని తెచ్చిందని చెప్పుకుంటుంది. తన మార్కు దేశభక్తిని బిజెపి జనంలోకి ప్రవేశపెడుతున్నా, దేశభక్తి గురించి మాట్లాడే సమర్థమైన నేతలు ఎవరూ కాంగ్రెస్‌లో లేరు, వారసత్వ బలహీనతలనుంచీ, వంధిమాగధత్వం నుంచీ, కోటరీల ద్వారా రాజకీయాలు చేసే స్వార్థపర నేతలనుంచీ, ఒకర్నొకరు వెన్నుపొట్లు పొడుచుకునే సంస్కృతి నుంచీ, పైరవీ కారులనుంచీ, దళారులనుంచీ కాంగ్రెస్ తనను తాను వదుల్చుకోలేకపోతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ సమకాలీనత్వాన్ని కోల్పోతున్నది. వామపక్ష పార్టీల్లాగా గతంలో జీవిస్తోంది. పూర్తిగా తనను ప్రక్షాళనం చేసుకొని, కాయకల్ప చికిత్స జరిపించుకుని జనంలోకి వెళ్లగలిగే నేతల్ని, కార్యకర్తల్ని తయారు చేసుకున్నప్పుడే కాంగ్రెస్ జీవించగలదు. అప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్‌ అవసరమూ ఆ పార్టీకి ఉండదు.కాంగ్రెస్‌... కిం కర్తవ్యం?

Wednesday, March 16, 2022

కుహనా లౌకికవాదాన్ని వదలండి... కాంగ్రెస్‌కు శివసేన హితవు...

 కుహనా లౌకికవాదాన్ని వదలండి... కాంగ్రెస్‌కు శివసేన హితవు...

Mar 16 2022 @ 12:37PMహోంజాతీయం

ముంబై : భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని, కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని కాంగ్రెస్ పార్టీకి శివసేన హితవు పలికింది. ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలోని మహావికాస్ అగాడీ కూటమిలో భాగస్వాములే. ఈ కూటమిలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా ఉంది. 


శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సూచనలు చేసింది. కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని, బీజేపీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించాలని సలహా ఇచ్చింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాల ద్వారా, హిజాబ్ వివాదం ద్వారా బీజేపీ సృష్టించిన భావాలను తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని తెలిపింది. బీజేపీ సైబర్ ఆర్మీ బూటకపు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించింది. ఇటువంటి కథనాలను బీజేపీ నేతలు బెంగాల్, మహారాష్ట్రలలో కూడా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కానీ అవి పని చేయడం లేదని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారని తెలిపింది. బీజేపీ మద్దతుగల వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోనే కశ్మీరు నుంచి పండిట్లు వెళ్ళిపోయారని కాంగ్రెస్ చెప్పాలని తెలిపింది. బీజేపీకి సన్నిహితుడైన జగ్‌మోహన్ దాల్మియా అప్పట్లో జమ్మూ-కశ్మీరుకు గవర్నర్‌గా ఉండేవారని చెప్పాలని సలహా ఇచ్చింది.

ఈ బూటకపు కథనాలపై కాంగ్రెస్ పోరాడలేకపోతోందని పేర్కొంది. పాతబడిన, సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కొనడం సాధ్యం కాదని తెలిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలపై కూడా ఈ సంపాదకీయం విరుచుకుపడింది. కేవలం గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్‌ను నడపగలదని, ఈ నేతలు నిష్ప్రయోజకులని తెలిపింది. ఇదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ పునరుద్ధరణ తప్పనిసరి అని తెలిపింది. 


Monday, March 14, 2022

29 రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం 10 అసెంబ్లీలలో మాత్రమే BJPకి స్పష్టమైన మెజారిటీ ఉంది

 29 రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం 10 అసెంబ్లీలలో మాత్రమే BJPకి స్పష్టమైన మెజారిటీ ఉంది

 

 మరోవైపు:-

 సిక్కింలో 0 సీట్లు

 మిజోరంలో 0 సీట్లు

 తమిళనాడులో 0 సీట్లు.

 ఆంధ్రప్రదేశ్‌లో 0 సీట్లు.

 వారికి ఉన్న సీట్లు:

 కేరళలో 140కి 1

 పంజాబ్‌లో 117కి 3

 బెంగాల్‌లో 294లో 3

 తెలంగాణలో 119కి 5

 ఢిల్లీలో 70కి 8

 ఒరిస్సాలో 147కి 10

 నాగాలాండ్‌లో 60కి 12


 బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సీటు పరిస్థితి

 మేఘాలయలో 60కి 2

 బీహార్‌లో 243కి 53

 J&Kలో 87కి 25

 గోవాలోని 40 సీట్లలో 13.


 దేశంలోని మొత్తం 4139 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 1516 సీట్లు ఉండగా అందులో 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఎంపీ, రాజస్థాన్ వంటి 6 రాష్ట్రాలకు చెందినవి.

 *అర్థం స్పష్టంగా ఉంది ... BJP యొక్క అల లేదా తుఫాను లేదు. * వాస్తవానికి, అది దేశంలోని 66% సీట్లలో ఓడిపోయింది.

 ఈ సత్యాన్ని బట్టబయలు చేయడానికి ఈ పోస్ట్‌ని వీలైనంత వరకు షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము.  ధన్యవాదాలు.


 ఈ నిజాన్ని పెద్దగా అమ్ముడుపోతున్న ఏ ఛానెల్ లేదా మీడియా చెప్పదు.


M S J C వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ సయ్యద్ గుడివాడ కృష్ణా జిల్లా

Monday, February 21, 2022

కాంగ్రెస్‌ లేకుండా కూటమి కుదరదు - శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

 కాంగ్రెస్‌ లేకుండా కూటమి కుదరదు - శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌


Feb 22 2022 @ 01:34AMహోంజాతీయం


మమతకూ ఇదే విషయం స్పష్టం చేశాం

కేసీఆర్‌ అందర్నీ కలుపుకొని పోగలరు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్య


నాగపూర్‌, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రె్‌సకు కొత్త కూటమిలో చోటు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన నాగపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివారం నాటి కేసీఆర్‌-ఉద్ధవ్‌ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్‌ లేని కూటమి అనే మాట రాలేదని చెప్పారు.


‘‘కాంగ్రెస్‌ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. మమత రాజకీయ కూటమి గురించి ప్రస్తావించినపుడు కూడా కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్లాలని శివసేన చెప్పింది’’ అని గుర్తు చేశారు. అదే సమయంలో కేసీఆర్‌ అందర్నీ కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఉన్న నేత అని రౌత్‌ కొనియాడారు. ‘‘ఆయన చాలా కష్టపడతారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది’’ అని చెప్పారు.


ఆ ప్రయత్నాలు ఫలించవు: ఫడణవీస్‌


కేసీఆర్‌ కూటమి ప్రయత్నాలు ఫలించబోవని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. బీజేపీని ఢీకొనేందుకు 2019 ఎన్నికల ముందూ ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీ సాధారణమేనన్నారు



Monday, February 14, 2022

కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

 కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌లకు ప్రజాస్వామ్యమంటే కుటుంబ పాలనే

Feb 15 2022 @ 01:30AMహోంజాతీయం


ప్రతిపక్షాలు ఏకమవడం సహజం.. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేశారుప్రజలు తిప్పికొట్టారు.. రాష్ట్రాల పట్ల వివక్ష అన్నది పసలేని విమర్శరాష్ట్రాల అభివృద్ధికి ఏం చేయాలో తెలుసు.. రైతులకు ఎమ్మెస్పీ కొనసాగుతుంది‘దైనిక్‌ జాగరణ్‌’ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పార్టీలు బీజేపీతో పోటీ పడలేవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి అన్ని అడ్డంకులను ఛేదిస్తుందని, కుల, మత జాతి వ్యత్యాసాలకు అతీతంగా ప్రజలు తమకు ఓటు వేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.  ప్రతిపక్షాలు ఏకం కావడం సహజమని, కానీ.. ఓటర్లు వాస్తవాలను గమనిస్తారని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజాస్వామ్యమంటే ప్రజల ప్రభుత్వం కాదని, తమ కుటుంబ పాలన అన్నది వారి ఉద్దేశమని ఆరోపించారు. తమ స్వప్నాలు సాకారం కావాలని కోరుకుంటున్న యువత వారిని విశ్వసించబోరని తెలిపారు. గత ఎన్నికలకు ముందు కూడా వారు ఇలాంటి ప్రయత్నాలు చేశారని, మోదీ సర్కారు దిగిపోతుందని ప్రచారం చేశారని, కానీ.. ప్రజలు వారిని తిప్పికొట్టారని అన్నారు. సోమవారం ‘దైనిక్‌ జాగరణ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల తాము వివక్షతో వ్యవహరిస్తున్నామన్న విమర్శల్లో పస లేదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందబోదని, అందుకే సాధ్యమైనంత మేరకు రాష్ట్రాలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాల అభివృద్ధికి తానేమి చేయాలో తనకు తెలుసునన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద ఇప్పటివరకు 90 శాతం గ్రామాలకు రహదారులు ఏర్పడ్డాయని తెలిపారు.  

నిజాయితీపరులకు తక్కువ పన్ను..నిజాయితీతో పన్ను చెల్లించేవారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే నిజాయితీపరులు ఎంతో తక్కువ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 13,000 పన్ను చెల్లించేవారని ఇప్పుడు వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదని అన్నారు.  రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు చెల్లించాల్సిన పన్ను రూ.66 వేలకు తగ్గిపోయిందని చెప్పారు.  ధరలు కూడా తాము అధికారంలోకి రాకముందు కంటే ఇప్పుడు ఎంతో తగ్గిపోయాయన్నారు. అప్పుడు ద్రవ్యోల్బణం పది శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయిందన్నారు. అతి తక్కువ ధరలకు 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేస్తే రూ.19 వేల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. విమాన ప్రయాణ చార్జీలు తగ్గాయని, ఇంటర్నెట్‌ కూడా ఎంతో చౌకగా లభిస్తోందన్నారు. గతంలో ఒక్క జీబీకి రూ.250 ఖర్చయ్యేదని, కానీ ఇప్పుడు రూ.7 మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగానికి తాము ఎంత చేశామో రె ౖతులకు తెలుసునని, అందువల్ల ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో రైతులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు రైతుల వ్య యానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్ద తు ధర చెల్లిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. భూసార ఆరోగ్య కార్డు సహా అనేక పథకాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు.

ముస్లిం మహిళల మద్దతు మాకే: మోదీలఖ్‌నవ్‌/అక్బర్‌పూర్‌/జలంధర్‌: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బీజేపీకే మద్దతిస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒకప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి వెళ్లగొట్టేవారని, దీంతో వారు, వారి తల్లిదండ్రులు ఎంత వేదనకు గురయ్యేవారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఏ క్షణంలో ట్రిపుల్‌ తలాక్‌కు గురి కావాల్సి వస్తుందోనన్న భయంతో మహిళలు బతకాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. దీనికి వ్యతిరేకంగా తాము తెచ్చిన చట్టం ద్వారా.. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ముస్లిం సోదరీమణులకు లభించిందన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాన్పూర్‌ దెహాత్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. గతంలో ముస్లిం ఆడబిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే ఆకతాయిల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు చేయడంతో ఈ సమస్య తొలగిపోయిందని, ఆడబిడ్డల్లో ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇక సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రాన్ని తమ కుటుంబసభ్యులు దోచుకునేందుకు ప్రాంతాల వారీగా అప్పగించేదని మోదీ ఆరోపించారు. గోవాలో హిందువుల ఓట్లను చీల్చేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తోందని ఆ పార్టీ నేత చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. హిందువుల ఓట్లు ఏకపక్షం కాకుండా చూసేందుకు గోవాలో తాము ఎంజీపీతో జత కట్టామన్న తృణమూల్‌ ఎంపీ మహౌత్‌ మోయిత్రా వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్‌లోనూ ప్రధాని సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్‌లో వచ్చేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని మోదీ ధీమా వ్యక్తం చేశారు.