Saturday, May 14, 2022

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Published: Thu, 12 May 2022 11:20:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mayawati నోట Azam Khan ప్రస్తావన.. BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లఖ్‌నవూ: Samajwadi party సీనియర్ నేత Azam Khan తొందరలోనే Bahujan Samaj Party లో చేరనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా BSP సుప్రెమో Mayawati చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని కొందరు అంటున్నారు. ప్రత్యర్థులపై నిరంతరం ద్వేషపూరిత, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని.. ఎమ్మెల్యే అజాంఖాన్ విషయంలో జరిగిందిదే అంటూ గురువారం మాయావతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇదే తరుణంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీతో పోల్చి విమర్శలు గుప్పించారు. ఎస్పీని కాదనుకుంటే బీజేపీ వైపు అజాంఖాన్ వెళ్లే ప్రసక్తి లేదు. అయితే కాంగ్రెస్ గూడికి వెళ్లొచ్చనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

‘‘Bharatiya Janata Party అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పాలన Congress పాలనకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, ముస్లింలపై దౌర్జన్యాలు చేస్తూ భయాందోళనలకు గురి చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీ ప్రభుత్వం కూడా తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషం వెల్లగక్కుతోంది. తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యే అజాంఖాన్‌లో రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచారు. ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఆక్రమణల పేరుతో భయాందోళనలు సృష్టిస్తూ దురుద్దేశపూరిత వైఖరి అవలంబిస్తూ వలసదారులను శ్రామికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై విస్తృత చర్చ జరగాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

26 నెలల నుంచి జైలులో ఉన్న Azam Khan ను SP అధినేత Akhilesh Yadav ఒకేసారి కలిశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాకుండా తన జైలు జీవితంలో పార్టీ నుంచి ఎలాంటి మద్దతు తనకు అందలేదని అజాంఖాన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. జైలులో సైతం కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలను కలుస్తున్న ఆయన.. ఎస్పీ నేతలను మాత్రం కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే ఎస్పీ నుంచి బయటికి రావడానికి అజాంఖాన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment