కాంగ్రెస్ లేకుండా కూటమి కుదరదు - శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Feb 22 2022 @ 01:34AMహోంజాతీయం
మమతకూ ఇదే విషయం స్పష్టం చేశాం
కేసీఆర్ అందర్నీ కలుపుకొని పోగలరు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్య
నాగపూర్, ఫిబ్రవరి 21: కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రె్‌సకు కొత్త కూటమిలో చోటు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన నాగపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివారం నాటి కేసీఆర్-ఉద్ధవ్ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్ లేని కూటమి అనే మాట రాలేదని చెప్పారు.
‘‘కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. మమత రాజకీయ కూటమి గురించి ప్రస్తావించినపుడు కూడా కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్లాలని శివసేన చెప్పింది’’ అని గుర్తు చేశారు. అదే సమయంలో కేసీఆర్ అందర్నీ కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఉన్న నేత అని రౌత్ కొనియాడారు. ‘‘ఆయన చాలా కష్టపడతారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది’’ అని చెప్పారు.
ఆ ప్రయత్నాలు ఫలించవు: ఫడణవీస్
కేసీఆర్ కూటమి ప్రయత్నాలు ఫలించబోవని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. బీజేపీని ఢీకొనేందుకు 2019 ఎన్నికల ముందూ ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీ సాధారణమేనన్నారు
No comments:
Post a Comment