Monday, June 10, 2024

PRSEN - పరస్పర అపనమ్మకాల సుడిలో ప్రజాస్వామ్యం!

 పరస్పర అపనమ్మకాల సుడిలో ప్రజాస్వామ్యం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:37 AM

గమనించాలి గానీ రాజకీయ సందర్భాలు కూడా అనేక రాజకీయేతర గుణపాఠాలు నేర్పిస్తుంటాయి. గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలను, వాటి ఫలితాలను గమనిస్తే ఆ గుణపాఠాలకు కొదవేమీ లేదు. ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారా అభివృద్ధి కోరుకుంటున్నారా. ఈ ప్రశ్నలకు ఏ ప్రభుత్వం దగ్గరయినా సమాధానం ఉందా?

ప్రభుత్వాలు ప్రజలకు ఏ ఏ ఉపకారాలు చేయదలుచుకుంటున్నాయి. ప్రజలు ప్రభుత్వాల నుంచి ఎటువంటి లబ్ధి ఆశిస్తున్నారు. ప్రజల ఆశలకూ ప్రభుత్వాల పందేరాలకూ నడుమ సమన్వయం ఉన్నట్టా లేనట్టా. ప్రజలు ఆశిస్తున్న లబ్ధులనే ప్రభుత్వాలు అందిస్తున్నాయా. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేక ఇంకా ఇంకా కావాలి అంటున్నారా. ప్రజలు సంతృప్తి చెందుతున్నట్టయితే అధికార పీఠాన్నెక్కే రాజకీయ పార్టీల మార్పిడి తరచూ ఎందుకు జరుగుతోంది. అలా కాదనుకుంటే ప్రజలు సంతృప్తి చెందడంలేదు అనే మర్మాన్ని అధికారంలో ఉన్న పార్టీలు ఎందుకు గ్రహించలేకపోతున్నాయి.

ఈ ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానాలున్నాయా? రెండు సందర్భాలలోనూ లేవనే గత ఇరవై ఏళ్ల ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారనడానికి గత రెండు దశాబ్దాల ఎన్నికలలో ఉదాహరణలు లేవు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు.

మరింత ఉదాహరణలతో చెప్పాల్సి వస్తే అభివృద్ధికీ, ఆత్యాధునిక ఆలోచనా విధా నానికీ మారుపేరనుకున్న చంద్రబాబును దించి ప్రజలు ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డికి పట్టం కట్టారు. అభివృద్ధినీ సంక్షేమాన్నీ సమపాళ్లలో అందించానని తాననుకున్న కేసీఆర్‌‍నూ ప్రజలు ఇంకో సందర్భంలో మట్టి కరిపించారు. మళ్లీ అదే అభివృద్ధికి కొండగుర్తు అనుకునే చంద్రబాబును కాదని జగన్‌‍కు ఆంధ్ర ప్రజలు లాండ్ స్లయిడ్ ఫలితాన్నిచ్చారు. మరో మలుపులో సంక్షేమమే ఆరుప్రాణాలుగా పాలన సాగించాననుకున్న జగన్‌‍ను తోసిరాజని అదే ప్రజలు మళ్లీ తామే తిరస్కరించిన చంద్రబాబును గద్దెనెక్కించారు. ‘‘మరీ 23 వచ్చేంత చెడు చేసామా మేం ప్రజలకు!’’ అని చంద్రబాబే అవాక్కయే సందర్భం, ‘‘నేను కోట్లాదిమందికి అందించిన వేల కోట్ల రూపాయల లబ్ధి ఏమయింది ఎటుపోయింది?’’ అని జగన్ స్వయంగా గద్గదపడే సందర్భం... రెండూ ఆంధ్ర ప్రజల చమత్కారాలే!

అవినీతికి అసలు సిసలు అర్థం అని ముద్రపడ్డ నితిష్‌కు మళ్లీ అదే ప్రజలు అందలమిచ్చారు. దేశాన్ని ప్రగతి సూచీలో అగ్రస్థానంలో ఉంచామన్న చెప్పన్ ఇంచ్ ఛాతీని అబ్ కీ బార్ తీన్ సౌకీ ఇస్ పార్ అని గేటు మూసేసారు. రాముడే దేశాన్ని మా చేతిలో పెడతాడనుకున్న వారికీ ఏకంగా అయోధ్యే చేయిచ్చింది. గుడి మెట్ల కింద నలిగిపోయిన గుడిసెలూ చిరువ్యాపారాలూ డొక్కాడడానికి చెమటలు కక్కే రెక్కలూ అభివృద్ధి కంటే తమ సంక్షేమమే ముఖ్యం అనుకుని ఉంటాయి. రాముడికన్నా ఆత్మారాముడే ముఖ్యం అనుకోవడంలో తప్పేంలేదు కదా. ఓడి గెలిచారో గెలిచి ఓడారో అర్థం కాని అయోమయంలోకి ఎన్డీఏనూ, ఇండియా కూటమినీ ప్రజలు విజయవంతంగా నెట్టేసారు.

ఇంత అభివృద్ధి చేసినా నన్ను ప్రజలు ఎందుకు కాదన్నారు అని గతంలో చంద్రబాబు సమాధానాల కోసం వెతుక్కున్నాడు. ఇంత సంక్షేమం అందించినా నాకెందుకిలా అయింది అని జగన్ ఇంకా కోమాలోంచి తేరుకోలేదు, బహుశా తేరుకోవడానికి చాలా కాలం పట్టొచ్చు. అభివృద్ధీ సంక్షేమం రెండూ చేసాను కదా నన్నెందుకు ప్రజలు కాదన్నారు అని కేసీఆర్ ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మరోవైపు ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటూనే దానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సామూహిక ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించడం, నిరసించడం ఏనాడో మానేసారన్నది నిజం. వ్యక్తిగత లబ్ధులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నదీ నిజమే. అయితే వ్యక్తిగత లబ్ధులను ఇచ్చే ప్రభుత్వాల పట్ల ప్రజలకు సానుకూలత లేనే లేదన్నదీ వాస్తవమే. ‘‘పాలకులేమన్నా వాళ్ల జేబుల్లోంచి ఇస్తున్నారా, మాది మాకే ఇస్తున్నార’’న్న భావన కూడా ప్రజల మెదళ్లలో బలంగా పీఠం వేసుకుంది. పైగా నాకు పదివేలిస్తున్నాడూ అంటే కచ్చితంగా వాడు పది లక్షలు తినే ఉంటాడన్న విశ్వాసమూ ప్రజలకు బలంగానే ఉంది. ఈ భావనే ప్రభుత్వాలను సంక్షేమం నిలబెట్టలేకపోవడానికి ప్రధాన కారణం. అభివృద్ధి వల్ల సమూహాలకే తప్ప వ్యక్తిగత ప్రయోజనం లేదు, వ్యక్తిగత ప్రయోజనం కూర్చే సంక్షేమం ఎవడబ్బసొమ్మూ కాదన్న అభిప్రాయాలే ప్రధానంగా ఈ ప్రభుత్వాల మార్పిడికి కారణం. ఈ ప్రహేళికను అర్థం చేసుకుని అటు సంక్షేమాన్నీ ఇటు అభివృద్ధినీ కూడా కొన్ని ప్రభుత్వాలు పట్టించుకున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ ప్రభుత్వాల పట్ల కూడా కనికరం చూపడం లేదు.

మాకు అభివృద్ధి వద్దని కానీ సంక్షేమం వద్దని కానీ ప్రజలు కరాఖండిగా చెప్పలేరు. ఏ ప్రభుత్వాలు వచ్చినా తమ సంక్షేమం తమకు దక్కుతుందనే నమ్మకం ప్రజలలో బలపడిపోయింది. అభివృద్ధి తమ సమస్య కాదనీ అది ప్రభుత్వాలే చూసుకుంటాయనీ నమ్మి కూడా ప్రజలు బలంగా దాన్ని పట్టించుకోవడం లేదు. చేపల్ని పట్టడం నేర్పాలి ఉచితంగా చేపల్నివ్వడం చేటు అనే సత్యాన్ని ఎప్పుడో పెడచెవిన పెట్టాం. ఉచితాల పద్మవ్యూహం నుంచి ఏ ప్రభుత్వమూ ఏ రాజకీయ పార్టీ అయినా అర్జునుడు కాలేని అభిమన్యుడే. రెండు రెండ్లు నాలుగనే లోకంలో అప్పట్లో చంద్రబాబు ఓడిపోకూడదు. ఇప్పట్లో కేసీఆర్ ఓడిపోకూడదు. కానీ వాస్తవం వేరేగా వుంది కదా.

ప్రజలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తేలిపోయింది. తమను ఫలానా రకంగా అర్థం చేసుకోండి అని ప్రజలు కూడా ప్రభుత్వాలకు తాత్పర్యాలను వివరించడంలోనూ సఫలం కాలేదని తేలిపోయింది. ఇటువంటి సందర్భాల్లోనే ఒక ప్రశ్న అందరినీ తొలుస్తూంటుంది. ప్రజలు మేధావులు, ఎవర్ని ఎక్కడ కూచోబెట్టాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు అనే మాట నిజమేనా అని. మరో వైపు ప్రజలను మోసం చేసే నాయకులను చూసాం కానీ నాయకులను మోసం చేసే ప్రజలను చూడలేదు అని వినిపించే విచిత్రమైన వాదన సరైందేనా అనీ అనిపిస్తుంది. ఎవరి సైజును వాళ్లకు తెలియచేయాలన్నా ఎవరినైనా మోసం చేయాలన్నా వాళ్లను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అవసరం. వాళ్ల పట్ల పూర్తి అవగాహన తప్పనిసరి. కానీ ఇక్కడ అటు ప్రభుత్వాలూ ప్రజలను సరిగా అర్థం చేసుకోలేదనీ ఇటు ప్రజలూ ప్రభుత్వాల పట్ల సరైన అవగాహనకు రాలేకపోతున్నారనీ తెలిసిపోతోంది. ఈ ఒకరిని ఒకరు అర్థం చేసుకోని పరిస్థితే గొప్పది అనుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా నష్టం.

మనం వేసే ఓటువల్ల గొప్ప మార్పు జరిగిపోతుంది అనే మాట నిజమే అయితే వాళ్లు మనల్ని ఓటు వేయనివ్వరు అంటాడు ఆస్కార్ వైల్డ్. అసలిక్కడ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య పరస్పర విశ్వాసం లేకపోవడం ప్రధానాంశం. ప్రజలు తమను మరోసారి కూడా గెలిపిస్తారు అని ఏ ప్రభుత్వమూ నమ్మలేకపోతోంది. ఈ ప్రభుత్వం కాక మరో ప్రభుత్వం మరింత మేలు చేస్తుందేమో అన్న గోడదూకుడు అవకాశం ఉండడం చేత ప్రజలూ ప్రస్తుత ప్రభుత్వాలను నమ్మరు. ఈ అపనమ్మకాల గందరగోళంలోనే ప్రజాస్వామ్యం చిక్కుకుపోతోంది. ప్రజలూ పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నిఘంటు అర్థాలను విని నవ్వుకుని ప్రజలూ పాలకులూ ఎప్పుడూ వేర్వేరే, వాళ్లు ఒకళ్లకొకళ్లు ఎప్పటికీ అర్థం కారు అని నిర్ధారించుకునే రోజులొచ్చాయని మన ఎన్నికలు రౌండ్ రౌండ్ కీ రుజువు చేస్తున్నాయి.

ఈ ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకోవడానికి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదు. అర్థం చేసుకుంటున్నాం అనుకుంటూ ప్రతి ప్రయోగంలో ఆకులు పట్టుకుంటూ కాలిన చేతులను చూసుకుని దిగాలు పడడమే మిగిలింది. ఇప్పుడు తీవ్రంగా ప్రయోగాలు జరగాలి. ఏం కావాలి ఏం ఇవ్వాలి అనే విషయంలో మధ్యేమార్గాన్ని సుస్థిరం చేయాలి. రాజకీయేతర వ్యవస్థల నుంచి కొన్ని ప్రయోగశాలలు తయారై పరిష్కారాన్ని కనుగొనాలి. అభివృద్ధా, సంక్షేమమా లేక రెండూనా లేక రెండూ కాదా అనే సందిగ్ధత నుంచి బయటపడడం ప్రజలకూ ప్రభుత్వాలకూ అత్యవసరం. నిజమే రాజకీయ సందర్భాలు రాజకీయేతర గుణపాఠాలను నేర్పిస్తాయి. కానీ ఆ రాజకీయేతర గుణపాఠాలు కూడా రాజకీయాలను సవరించడానికి సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగపడాలి.

ప్రజలూ పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నిఘంటు అర్థాలను విని నవ్వుకుని ప్రజలూ పాలకులూ ఎప్పుడూ వేర్వేరే, వాళ్లు ఒకళ్లకొకళ్లు ఎప్పటికీ అర్థం కారు అని నిర్ధారించుకునే రోజులొచ్చాయని మన ఎన్నికలు రౌండ్ రౌండ్ కీ రుజువు చేస్తున్నాయి. అభివృద్ధా, సంక్షేమమా లేక రెండూనా లేక రెండూ కాదా అనే సందిగ్ధత నుంచి బయటపడడం ప్రజలకూ ప్రభుత్వాలకూ అత్యవసరం.

ప్రసేన్

Updated Date - Jun 11 , 2024 | 05:37 AM

Friday, May 10, 2024

How Mayawati Killed 2 Birds With 1 Stone By Axing Her Political Heir Akash Anand

 How Mayawati Killed 2 Birds With 1 Stone By Axing Her Political Heir Akash Anand

With the removal of Akash Anand, Mayawati has killed the proverbial two birds with one stone - she has crushed all charges of nepotism and also pacified Dalits, who did not appreciate his diatribe against the BJP.

India NewsIndo-Asian News ServiceUpdated: May 08, 2024 3:42 pm IST

How Mayawati Killed 2 Birds With 1 Stone By Axing Her Political Heir Akash Anand

Mayawati decided to sack her nephew and political heir Akash Anand from all posts in the BSP.



Lucknow: Mistakes - minute or monumental - are unacceptable and unpardonable in the Bahujan Samaj Party (BSP), particularly if they have the potential to harm party chief Mayawati's political interests.

In the past, innumerable BSP leaders have been shown the door by Mayawati for making mistakes.


Party supremo Mayawati's decision to axe nephew, Akash Anand from all posts in the BSP on Tuesday night is designed to send a clear message to her voters that when it comes to punishment, she will not differentiate between party workers and family members.


PauseUnmute

Fullscreen


Skip Ad

Akash Anand's removal is all the more significant because the former Uttar Pradesh Chief Minister had designated him as her political successor.


However, whatever criticism Mayawati faced from rivals for promoting nepotism in the BSP by bringing in Akash Anand, has been washed away by her decision to punish him for his 'immaturity'.


Akash Anand's 'immaturity' was evident when at an election rally in Sitapur on April 28 the 29-year-old went hammer and tongs at the BJP, which has often propped up his aunt Mayawati.


In his enthusiasm, he crossed all limits of political propriety. "This BJP government is a bulldozer government and a government of traitors. The party that leaves its youth hungry and enslaves its elderly is a terrorist government. Taliban runs such a government in Afghanistan," he had alleged at the rally.


Akash Anand was promptly booked for violating the Model Code of Conduct and for allegedly using objectionable language at the Sitapur poll rally.


The case was registered under Sections IPC 171C (undue influence at elections), 153B (imputation, assertions prejudicial to national integration) and 188 (disobedience to order duly promulgated by public servant) and Section 125 of the Representation of the People Act.


The impact of his speech was also felt among the BSP cadres and voters, particularly non-Jatav Dalits who are aligned with the BJP now.


They were upset at Akash Anand's speech and this was conveyed to his aunt through some coordinators.


ALSO READ

Regional Parties Could Form Government, Get NDA Or INDIA's Support: KCR

Regional Parties Could Form Government, Get NDA Or INDIA's Support: KCR

PM Modi Advises Uddhav Thackeray, Sharad Pawar To Reunite With Shiv Sena, NCP

PM Modi Advises Uddhav Thackeray, Sharad Pawar To Reunite With Shiv Sena, NCP

Video: Time Running Out, BJP Candidate Seen Sprinting To File Nomination

Video: Time Running Out, BJP Candidate Seen Sprinting To File Nomination

Mayawati moved swiftly to control the damage done by her protege and cancelled all of Akash Anand's rallies and asked him to avoid public appearances.


When public anger did not subside, Mayawati finally removed her political heir from all posts.


With the removal of Akash Anand, Mayawati has killed the proverbial two birds with one stone - she has crushed all charges of nepotism and also pacified Dalits, who did not appreciate his diatribe against the BJP.


"Parties like the Congress, Samajwadi Party and RJD that thrive on nepotism can no longer accuse the BSP of following in their footsteps. The BSP supremo is not dependent on her family and does not promote nepotism, unlike the Gandhis and Yadavs. Behenji (Mayawati) has proved it," said a BSP functionary.


By sacrificing her nephew, Mayawati ensured that she did not burn her bridges with the ruling BJP.


After all, she had formed the government with the BJP's support in Uttar Pradesh thrice (1995, 1997 and 2002).


Mayawati cannot risk her chances of another alliance with the BJP in the future, whether at the Centre or in Uttar Pradesh.


Monday, March 25, 2024

TDP: టీడీపీకి అరుదైన ఘనత.. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరణ..

 TDP: టీడీపీకి అరుదైన ఘనత.. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరణ..

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:23 PM

తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ నేడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చొరవతో అరుదైన రికార్డును సాధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం నిలిచింది. ఈ కూటమిలో బీజేపీ తర్వాతి స్థానం టీడీపీదే కావడం విశేషం. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ టీడీపీనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ మిత్రపక్షాల పొత్తులు ఓ కొలిక్కి రావడంతో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన సైతం దాదాపుగా పూర్తయింది.

దేశవ్యాప్తంగా ఉన్న 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అత్యధికంగా ఐదు విడతల్లో 445 మంది లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధికంగా 17 లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తూ రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీఏ కూటమిలోనే ఉన్న జేడీయూ 16 స్థానాలు, శివసేన షిండేవర్గం 13, పీఎంకే 10, ఎన్సీపీ అజిత్ పవార్ 5, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.


Thursday, January 11, 2024

Vikasit Bharat

 భారత్‌ వికసిస్తోందా... ఏదీ, ఎక్కడ?

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:35 AM


నరేంద్రమోదీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఈ పదేళ్ల పాలనలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడం...


భారత్‌ వికసిస్తోందా... ఏదీ, ఎక్కడ?

నరేంద్రమోదీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఈ పదేళ్ల పాలనలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడం ఈ యాత్ర ముఖ్యోద్దేశం. కేంద్ర మంత్రులు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు. దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) 7 శాతానికి పైగా వృద్ధి రేటుతో దూసుకుపోతోందని, 2047 కల్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఆయన ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో సాధించిందేమిటో పరిశీలిస్తే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల (2047) నాటికి దేశం ఏ స్థితిలో ఉంటుందో స్పష్టంగా అవగతమవుతుంది.


జీడీపీ వృద్ధిరేటును ముందు సంవత్సరంతో పోల్చి ఈ సంవత్సరం ఎంత పెరిగిందో శాతంగా తెలుపుతారు. 2021లో కోవిడ్‌ సందర్భంగా మన జీడీపీ మైనస్‌ 5.8 శాతం నమోదయింది. దీనితో పోల్చి 2022, 2023లలో జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతానికి పైగా చేరిందని ప్రభుత్వం లెక్క కట్టింది. వాస్తవంగా 2004–14 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధిరేటు సగటున 8.1శాతంగా ఉంది. అదే నరేంద్ర మోదీ ప్రభుత్వ కాలంలో అది 5.4శాతం మాత్రమే. పోనీ వీరు చెబుతున్నట్లు సాధించిన అభివృద్ధి సామాన్యుల వద్దకు చేరుతోందా? ఆర్థిక అసమానతలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రభాగాన ఉందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ గత పదేళ్ళ కాలంలో భారతదేశంలోని సంపన్నుల ఆదాయం పదిరెట్లు పెరిగిందని, వారి వార్షికాదాయం నేడు భారతదేశ బడ్జెట్‌ కంటే అధికమని తెలిపింది. జనాభాలో ఒక్క శాతంగా ఉన్న సంపన్నులకు దేశ ఆదాయంలో 73 శాతం పోతుండగా, 67 కోట్ల మంది సామాన్యుల ఆదాయం మాత్రం ఒక్క శాతమే పెరిగింది. వైద్య ఖర్చులకై అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం ద్వారా దేశంలో ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ప్రజలు దారిద్రంలోకి నెట్టబడుతున్నారని ఈ సంస్థ పేర్కొంది.


కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న వృద్ధిరేటు... ఉపాధి అవకాశాలు కల్పిస్తోందా అంటే అవీ సన్నగిల్లుతున్నాయి. మోదీ మహాశయుడు ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలికి పోయింది. నిరుద్యోగిత రేటు పది శాతానికి చేరింది. ఇప్పటికే కులం, ప్రాంతం, మతం, జెండర్‌ అసమానతలతో ఉన్న భారతదేశంలో నేడు ఆర్థిక అసమానతలు కూడా చేరడం ఆందోళనకరంగా ఉందని ప్రొఫెసర్‌ హిమాన్షు (జేఎన్‌యూ) అన్నారు. పోనీ ప్రజల జీవన ప్రమాణాలయినా మెరుగుపడ్డాయా అంటే, దానికి భిన్నంగా పేదరికం పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఆర్భాటంగా ప్రారంభించిన జన్‌ధన్‌ అకౌంట్లలో డబ్బులే లేవు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నిత్యావసర సరుకులన్నీ విపరీతంగా పెరిగాయి. విద్య, వైద్యం విలాస వస్తువులుగా మారిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రజలు పెద్ద ఎత్తున పేదరికంలోకి నెట్టబడుతున్నారు. 74.1 శాతం భారతదేశ పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధిరేటు సాధించడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్న కార్మికులు, రైతుల జీవన ప్రమాణాలైనా మెరుగుపడ్డాయా అంటే అదీ లేదు.


అతి పెద్ద రైల్వే సహా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ నియామకాలను కేంద్ర ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, అత్యంత తక్కువ వేతనాలకు ఈ రోజున కార్మికులు పనిచేయవలసి వస్తోంది. కొత్తగా వస్తున్న ఉపాధి కూడా కాంట్రాక్టు, అసంఘటిత రంగాల్లోనే. వీరికి అత్యధికంగా నెలకు పదిహేను వేలకు మించి ఆదాయమే ఉండటం లేదు. మహిళాభివృద్ధి, బేటీ పడావో అని గొప్ప నినాదాలిస్తున్న మోదీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ, ఆశ, మిడ్‌ డే మీల్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాక, వేతనాలు కూడా అత్యంత తక్కువ. పేదలకు పోషకాహారం, మహిళా, శిశు సంరక్షణ వంటి ముఖ్యమైన అనేక సేవలందిస్తున్న ఈ స్కీం వర్కర్ల సమస్యలు ఎంతగా ఉన్నాయంటే ఆఖరుకు ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ కూడా వీరి సమస్యల పరిష్కారానికై ఆందోళన చేయవలసి వచ్చింది.


ఎన్డీఏ మొదటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్‌ విధానం ఉద్యోగుల పొదుపు సొమ్మును కొంతమంది కార్పొరేట్లు కొల్లగొట్టుకుపోయేలా తయారైంది. దీనిని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కార్మికులకు కొంతైనా మేలు కలిగే 27 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో సంఘం పెట్టుకోవడం, సమ్మె చేయడం వంటి హక్కులను సైతం హరించే కార్మిక వ్యతిరేక అంశాలతో నాలుగు లేబర్‌ కోడ్‌లను మోదీ ప్రభుత్వం చేసింది. మరోపక్క వ్యవసాయరంగంలో పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. కార్పొరేట్‌ సేద్యాన్ని ప్రోత్సహించేలా నల్ల చట్టాలను చేసి, అన్నదాతలు సంవత్సరం పైగా పెద్ద ఎత్తున పోరాడిన దరిమిలా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో అవే కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్రం కొనసాగిస్తోంది.


మోదీ ప్రభుత్వ కాలంలో శ్రామిక మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున వివక్షకు గురవుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం గత ఏడాది దేశంలో 62,946 మంది బాలికలు కనిపించకుండా పోయారు. వీరిలో అత్యధికులు వేశ్యాగృహాలపాలయ్యారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన లెక్కలు. వాస్తవంలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒడిషా రాష్ట్రంలోని సుందర్‌ఘర్‌ ప్రాంతంలో సర్వే నిర్వహించిన ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ 70 గ్రామాలలో పదమూడు వేలమంది అమ్మాయిలు కనపడలేదని తెలిపింది.


నేడు దేశం వికసిత భారత్‌గా కాక, అత్యధిక ప్రజానీకాన్ని అభివృద్ధి ఫలాల నుండి గెంటివేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా దేశం ఎలా ఉంటుందన్నది ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది. ప్రధాని మోదీ పదేళ్ళ పాలనలో అసమానతలు మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయన్నది వాస్తవం. భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతకాలం పబ్బం గడుపుకోగలరేమో గానీ, ఎల్లవేళలా అశేష ప్రజానీకాన్ని మోసపుచ్చలేరు.


ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Monday, October 9, 2023

Kothapaluku: మోదీ తప్పుటడుగు...!

 Kothapaluku: మోదీ తప్పుటడుగు...!

ABN , First Publish Date - 2023-10-08T01:03:59+05:30 IST



Kothapaluku: మోదీ తప్పుటడుగు...!

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో దేశ రాజకీయాల్లో తనకు సమ ఉజ్జీ లేరన్న అభిప్రాయాన్ని ఇన్నాళ్లుగా ప్రధాని మోదీ దేశ ప్రజలలో కలిగించారు. మోదీ భక్తులు నమో నామస్మరణలో తరించేవారు. అలాంటి మోదీ నిజామాబాద్‌ సభలో మాత్రం పప్పులో కాలేశారు. నోరు జారారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో తనను కలిసి అత్యంత వినయంగా శాలువా కప్పి మరీ బీఆర్‌ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకోవలసినదిగా అభ్యర్థించారని చెప్పారు. తన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నానని, అందుకు మీ ఆశీస్సులు కావాలని కోరారని కూడా చెప్పుకొచ్చారు. ‘‘మీరేమైనా రాజులా? వారసులకు సింహాసనాన్ని అప్పగించడానికి’’ అని ఆ సందర్భంగా కేసీఆర్‌ను హెచ్చరించానని కూడా మోదీ చెప్పారు. ‘‘మీకు ఓ రహస్యం చెప్పనా...’’ అంటూ మొదలుపెట్టి ఆయన ఈ విషయాలు చెప్పారు.


ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఆంతరంగిక సంభాషణను ఇలా వెల్లడించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతర్గత సంభాషణలను బహిర్గతం చేయడం వల్ల ప్రధానమంత్రి తన స్థాయి తగ్గించుకున్నారని చెప్పవచ్చు. రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల ఆయనకు గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వారిని అధికారపక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా కలసి అనేక రాజకీయ అంశాలను పంచుకోవడం సహజం. తనను కలసిన ముఖ్యమంత్రులు మనసులోని మాటలను చెప్పుకొంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నరేంద్ర మోదీని కలిసి తన మనసులోని మాటను చెప్పుకునే ఉంటారు. అయితే ప్రధానమంత్రి నోటి నుంచి నాటి అంతర్గత సంభాషణ బహిర్గతం కావడం మాత్రం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి స్థాయికి ఇది తగదని బీజేపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇంతకీ నరేంద్ర మోదీ ఏమి ఆశించి నాటి రహస్యాన్ని చెప్పారోగానీ, ఇలా చేయడం రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు నష్టమే కలిగించింది.


భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ఏదో రహస్య అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం తెలంగాణలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న తరుణంలో ప్రధాని ఇలా మాట్లాడటంతో సదరు ప్రచారానికి ఊతం ఇచ్చినట్టయింది. ఈ పరిణామం అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం చేకూర్చుతుంది కూడా! ఎన్డీయేలో తమను చేర్చుకోవాలని కేసీఆర్‌ నిజంగా అభ్యర్థించి ఉంటే ఆ విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా చెప్పకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైనా చెప్పి ఉంటే అది వేరుగా ఉండేది. అలా కాకుండా ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించడం అనైతికం. తన మాటల చాతుర్యంతో ప్రతిపక్షాలకు మాటల్లేకుండా చేస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు మొదటిసారిగా తప్పులో కాలేశారు.


ప్రధానమంత్రి నోటి నుంచి ఈ రహస్యం వెలువడిన వెంటనే బీఆర్‌ఎస్‌ ప్రతిస్పందించింది. ‘నేను ముఖ్యమంత్రి కావడానికి మోదీ ఆశీస్సులు ఎందుకు? ప్రజల ఆశీర్వాదం కావాలిగానీ!’ అని మంత్రి కేటీఆర్‌ బదులిచ్చారు. ఆయన అంతటితో ఆగకుండా ఎన్డీయేలో చేరడానికి తామేమీ ఆరాటపడలేదని, నిజానికి 2018 ఎన్నికల సమయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తమను కలసి పొత్తు పెట్టుకుందామన్న ప్రతిపాదన తెచ్చారని కేటీఆర్‌ మరో గుట్టు విప్పారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు మంత్రి కేటీఆర్‌ పరస్పరం రహస్యాల గుట్టు విప్పడంతో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఈ ఇరువురి ప్రకటనల వల్ల పొత్తులకోసం అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ కూడా ఉత్సుకత ప్రదర్శించినట్టు స్పష్టమవుతోంది. మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇద్దరు నాయకులు చెప్పిన రహస్యాల వల్ల ఆ పార్టీలకు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‘బీ’ టీమ్‌ అని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఇప్పుడు గుట్టు రట్టు కావడంతో కాంగ్రెస్‌ ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయింది.




నాడు ఇందిర.. నేడు మోదీ...


ప్రధాని మోదీ నోరు జారడం ఇప్పటిదాకా జరగలేదు. టైం బాగోలేనప్పుడు ఇలా జరుగుతుందేమో తెలియదు. నిజామాబాద్‌ సభలో ప్రధాని మోదీ ప్రసంగం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. సొంత పార్టీ వారికి కూడా ఆయన మాటలు రుచించలేదు. నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పిస్తే కేసీఆర్‌ మింగిన అవినీతి సొమ్మును కక్కిస్తానని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. మోదీ ఈ దేశ ప్రధాని. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరడం ఏమిటో అర్థం కావడంలేదు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని లేదా తెలంగాణకు చెందిన, తమ పార్టీకి చెందిన ఫలానా నాయకుడిపైన నమ్మకం ఉంచి అవకాశమివ్వాలని ఆయన కోరకపోవడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. బీజేపీ స్థానంలో ‘నేను–నాకు’ అన్న మాటలే నరేంద్ర మోదీ నోటి వెంట వెలువడ్డాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించేవారు. కాంగ్రెస్‌ పార్టీనే తనపై ఆధారపడేలా ఆమె పరిస్థితులను మార్చుకున్నారు. ఫలితంగా కాలక్రమంలో పార్టీ బలహీనపడి, రాష్ర్టాలలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేకుండా పోయారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకోవడం చూశాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా నరేంద్ర మోదీ అదే సంస్కృతిని తీసుకురావాలనుకుంటున్నారా? అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలి.


ప్రస్తుతానికి బీజేపీలో సమష్ఠి నాయకత్వం లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు బీజేపీపై రాష్ర్టీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు అదుపు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమ అభిప్రాయాలను పట్టించుకోని పరిస్థితి ఉన్నప్పటికీ తాము కోరుకున్న బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా అని సంఘ్‌ నాయకులు సర్ది చెప్పుకొంటున్నారు. ఇక బీజేపీలో నరేంద్ర మోదీ కళ్లలో కళ్లు పెట్టి చూసి మాట్లాడగల నాయకులే లేకుండా పోయారు. కేంద్ర మంత్రులు డమ్మీలుగా మారిపోయారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అన్న నినాదాన్ని కాంగ్రెస్‌ పార్టీలోని ఆమె భక్తులు డీకే బారువా వంటి వారు అందిపుచ్చుకున్నారు.


ఇప్పుడు బీజేపీ అంటే మోదీ – మోదీ అంటే బీజేపీ అని చెప్పుకొనే పరిస్థితి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ‘భారత్‌ అంటే మోదీ – మోదీ అంటే భారత్‌’ అనే నినాదం వినిపిస్తుందేమో తెలియదు. వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఇందిరాగాంధీ భజన పెరిగినప్పుడే ఈ దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీ చేదు అనుభవాలను ప్రజలు ఇంకా మరచిపోలేదు. బీజేపీలో నరేంద్ర మోదీ వటవృక్షంలా పెరిగిపోవడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే. వ్యక్తి ఆరాధనకు తావు ఇవ్వనంత వరకు ఎవరు ఎంత ఎత్తు ఎదిగినా ఫర్వాలేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తి పూజ లేదు. నెహ్రూ సమ ఉజ్జీలైన నాయకులు ఎందరో ఆ పార్టీలో ఉండేవారు. ఇందిరా గాంధీ హయాం వచ్చే సరికి కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు బలహీనపడ్డారు. మొత్తం పార్టీనే ఆమెపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు పొడచూపాయి.


ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని కోరుకోవడంలో తప్పు లేదు. నరేంద్ర మోదీలో నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. పార్టీపరంగా తీసుకొనే నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా మోదీ తీసుకొనే నిర్ణయాల గురించి బీజేపీలో ఇంకెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీజేపీలో నంబర్‌ 2గా చలామణి అవుతున్నప్పటికీ ఆయన కూడా స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలను అమలు చేయడం వరకే అమిత్‌ షా పాత్ర పరిమితం అని అంటారు. ఇటీవలి కాలంలో మోదీ–షాల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలలో స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర నాయకత్వం ఈ రాష్ర్టాలకు ఇతరులను దిగుమతి చేసింది. దీంతో పార్టీని ఏకతాటిపై నడిపేవారు లేకుండా పోయారు. నిర్ణయాలకోసం ఢిల్లీ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందట! దిగుమతి కాబడ్డ నాయకులు కూడా మోదీ వర్గం, షా వర్గంగా విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ‘నాకు అవకాశం ఇవ్వండి’ అని రాష్ర్టాలలో కూడా సరికొత్త రాగం అందుకున్నారని చెబుతున్నారు.


మొత్తం పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతానికి చెక్‌ పెట్టేవారు ఆ పార్టీలో లేరు. అమిత్‌ షా కూడా మోదీని ఎదిరించి నిలువలేని పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ వారసత్వం ఉంటుందని, నియంతృత్వ పోకడలు పెరిగి పోతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ విమర్శలలో నిజం ఉంది కూడా. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా మోదీ నేతృత్వంలో జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. సమష్ఠి నాయకత్వం స్థానంలో అంతా మోదీనే అన్న భావన ఏర్పడింది. అందుకే ప్రధాని మోదీ నోటి వెంట నేను–నాకు, ఒక అవకాశం ఇవ్వండి వంటి పదాలు వెలువడుతూ ఉండవచ్చు. తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వాన్ని ఎందుకు మార్చారో రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు ఎవరూ చెప్పలేకపోతున్నారు.


ఉత్తరాది మోడల్‌నే ఇక్కడా అమలు చేయాలని అనుకోవడం వల్లనే తెలంగాణలో బీజేపీకి ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. సరైన కారణం లేకుండా మునుగోడులో ఉప ఎన్నిక తీసుకురావడం, ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ బలహీనపడటం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాల కారణంగా మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విప్పిన పొత్తుల గుట్టుతో బీజేపీతో పాటు బీఆర్‌ఎస్‌ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. దీనికి తోడు బీజేపీకి 30 సీట్లు వచ్చినా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీఎల్‌ సంతోష్‌ శుక్రవారం నాడు ప్రకటించారు. అంటే బీఆర్‌ఎస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు స్కెచ్‌ వేస్తున్నారన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కేంద్ర నాయకుల ఎత్తుగడలు కర్ణాటకలో వికటించాయి. స్థానిక నాయకత్వం ప్రమేయం లేకుండా గతంలో కాంగ్రెస్‌ వ్యవహరించినట్టుగానే ఇప్పుడు బీజేపీ కూడా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా దక్షిణాదిన బీజేపీ బలపడకపోగా బలహీనపడుతోంది.


మోదీని చూసి రాష్ట్ర ప్రభుత్వాలను ఇక్కడ ఎన్నుకోవాలంటే స్థానిక నాయకుల ముఖాలకు ఇక విలువేం ఉంటుంది? కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టాకే అక్కడ బీజేపీ బలహీనపడింది. తెలంగాణలో ఏమి జరుగుతున్నదో చూస్తున్నారు. బీఎల్‌ సంతోష్‌ను చూసి లేదా ఆయన చెప్పే మాటలను నమ్మి ఇక్కడ ప్రజలు ఓటు వేయరు. తెలంగాణ సమాజం కేసీఆర్‌ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా విడిపోయింది. ఈ పరిస్థితులలో కేసీఆర్‌ వ్యతిరేక శిబిరంలో నమ్మకం కలిగించగలిగే పార్టీకి మాత్రమే ఆదరణ ఉంటుంది. పొత్తుల కోసం బీజేపీ– బీఆర్‌ఎస్‌ తెరవెనుక ప్రయత్నాలు చేశాయనే గుట్టు రట్టు చేసుకోవడం వల్ల ఉభయ పక్షాలకూ నష్టమే జరుగుతుంది తప్ప లాభం కలగదు. నరేంద్ర మోదీలాంటి అపర చాణక్యుడికి ఈ మాత్రం లాజిక్‌ తెలియదా?



వింత... విషాదం!


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం! మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును స్కిల్‌ కేసులో జైలుకు పంపి నెల అవుతోంది. న్యాయం ఆయనతో దోబూచులాడుతోంది. జస్టిస్‌ డిలేడ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌ అని అంటారు. చంద్రబాబుకు న్యాయం దొరకడంలో జాప్యం జరగడం ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని మన న్యాయశాస్త్రమే చెబుతున్నది.


స్కిల్‌ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు చాలాకాలంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ వ్యవహారంలో చంద్రబాబుకు కమీషన్లు ముట్టాయని ఆధారాలు సేకరించలేకపోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కనీస ఆధారాలు లభించకపోయినా చంద్రబాబు నెల రోజులుగా జైలుకే పరిమితం కావడం న్యాయ వ్యవస్థలోని డొల్ల తనాన్ని బయట పెడుతోంది. ఈ కేసులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగడమే కాకుండా తీర్పులు కూడా రిజర్వు అవుతున్నాయి.


చంద్రబాబు మాత్రం జైలు జీవితం గడుపుతున్నారు. డబ్బు చేతులు మారినట్టు కనీస ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబు స్థాయి నాయకుడిని నెల రోజులుగా రిమాండ్‌లో ఉంచడం వింతగా ఉంది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో అరెస్టు కాబడిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిలు దరఖాస్తు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. ‘సిసోడియాపై మోపిన ఆరోపణలను న్యాయ సమీక్షలో రెండే రెండు నిమిషాల్లో కొట్టివేస్తారు. ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలే లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినా మనీశ్‌ సిసోడియా ఎనిమిది నెలలుగా జైల్లో నిర్బంధించబడ్డారు.


ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆయనకు కమీషన్లు ముట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? లేవా? అంటే లేవనే చెప్పాలి. వరుసగా ఒకరి నుంచి ఒకరికి అక్రమంగా లావాదేవీలు జరిగినట్టు సూచించే మనీ ట్రేల్‌ (Money Trail) జరిగినట్టు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలో నిరూపించలేదు. సీఐడీ దర్యాప్తులో కూడా మనీ ట్రేల్‌ జరిగిందని నిరూపించలేకపోయారు. చివరికి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చిన 27 కోట్ల రూపాయల సభ్యత్వ రుసుము మొత్తాన్ని స్కిల్‌ కేసులో ముడుపులతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి కేసులలో మనీ ట్రేల్‌కు సంబంధించి కనీస ఆధారాలు ఉన్నాయా లేవా అని చూడకుండా మెకానికల్‌గా రిమాండ్‌ విధించడం ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కనిపిస్తున్న లోపం.


లిక్కర్‌ కుంభకోణంలో సిసోడియా పాత్రపై ఆధారాలు లేకపోయినా ఎనిమిది నెలలుగా రిమాండ్‌లో ఉంచడం సమర్థనీయమా? చంద్రబాబు విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. కోడి కత్తి కేసులో పెద్ద డ్రామా చోటుచేసుకుందని వెల్లడయ్యాక కూడా నిందితుడు శ్రీనివాసరావును ఐదేళ్లుగా జైల్లోనే నిర్బంధించి ఉంచడం న్యాయ వ్యవస్థకు శోభనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయంలో మనీ ట్రేల్‌ జరిగినట్టు సీబీఐ ప్రాథమిక ఆధారాలు సేకరించగలిగింది. సదరు ఆధారాలు న్యాయ సమీక్షలో నిలుస్తాయా? లేదా? అన్నది వేరే విషయం. కనీస ఆధారాలనైతే సేకరించారు కదా! చంద్రబాబు విషయంలో మనీ ట్రేల్‌ జరిగినట్టు దర్యాప్తు సంస్థ ఇంతవరకు న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించలేదు. అదేమంటే దర్యాప్తు కీలక దశలో ఉందని అంటారు. దర్యాప్తులో ఆధారాలు సేకరించకపోయినా చంద్రబాబును రిమాండ్‌కు పంపడం ఏమిటో అర్థం కాదు. కనీసం రెండు నెలలైనా చంద్రబాబును జైలుకే పరిమితం చేయాలన్నది పాలకుల కోరికట! పాలకుల కోరిక ఫలిస్తుందో లేదో తెలియదుగానీ నిర్దోషి అయినప్పటికీ, చంద్రబాబు అన్యాయంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఈ దుస్థితికి పరిష్కారాన్ని న్యాయ వ్యవస్థ మాత్రమే అన్వేషించాలి. అప్పటివరకు నిర్దోషులు జైళ్లలో, దోషులు బయట ఉంటారు. ఇదొక విషాద పరిణామం!


ఏపీ పరిస్థితికి అద్దం...


ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం! తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలను ‘ఆంధ్రప్రదేశ్‌కు కూడా వెళ్లి పెట్టుబడులు పెట్టండి. జగనన్నకు చెప్పి భూమి ఇప్పిస్తాను’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అందరూ బాగుండాలి కదా అని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సీరియస్‌గా చేశారా? లేక వ్యంగ్యంగా అన్నారో తెలియదు. అయితే కేటీఆర్‌ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ దుస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని పొరుగు రాష్ర్టాల వారు కూడా చెబుతున్నారుగానీ ఘనత వహించిన జగన్మోహన్‌ రెడ్డి గారికి అవేవీ పట్టవు. ప్రత్యర్థులను జైలుకు పంపడం ఎలా? అన్న దానిపైనే ఆయన బిజీగా ఉన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు చూశాకైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కళ్లు తెరుస్తారా?


ఆర్కే


Monday, September 4, 2023

Ranjan Gogoi - CJI - RS Member

Gogoi was nominated to the Rajya Sabha by President Ram Nath Kovind. On 19 March 2020, he took the oath of office as a Member of Parliament in the Rajya Sabha in the presence of the Chairman of Rajya Sabha.



Former CJI Ranjan Gogoi Still Hasn't Asked a Single Question in the Rajya Sabha

He has also not introduced any private member's Bill, and the section of the Rajya Sabha website where you can find audio and video recordings of MPs says "no records found" for Gogoi.


Ex-CJI Ranjan Gogoi as MP: Abysmal Attendance in Parliament, Zero Lawmaking

Newsclick Report | 15 Feb 2023

Law

Politics

India

Contrary to his claims about why he became an MP, the former CJI has not intervened in any issue pertaining to the judiciary or the Northeast.

Gogoi

Former CJI Ranjan Gogoi in Parliament. Photo credit: Rediff.com


New Delhi: Amid notable post-retirement postings awarded to certain retired judges by the government, former Chief Justice of India Ranjan Gogoi has held his position for a considerable time. However, as a Rajya Sabha MP, Gogoi’s performance in Parliament has been rather poor along with a meagre 29% attendance over the last three years, The Print reported. In comparison, the average attendance of MPs is 79%.


Gogoi’s performance comes into question amid the development that three of the four retired judges on the Constitution bench of the Supreme Court that delivered the Ayodhya verdict in 2019 have received plum government posts within months of their retirement, NewsClick has reported. In the latest, the President of India appointed Justice S. Abdul Nazeer as the Governor of Andhra Pradesh just 40 days after the judge’s retirement from the Supreme Court.


Gogoi was the first to retire among the four following the Ayodhya verdict in 2019. Within months, he was nominated as a member of the Rajya Sabha and took the oath of office in March 2020. Afterwards, Justice Ashok Bhushan retired in July 2021, and was appointed the Chairperson of the National Company Law Appellate Tribunal in November 2021.


 


On his controversial appointment to the Upper House, Gogoi had told a news channel, “I have accepted the offer of nomination to the Rajya Sabha because of strong conviction that the legislature and judiciary must, at some point of time, work together for nation-building. My presence in Parliament will be an opportunity to project the views of the judiciary before the legislature and vice-versa.”


In addition, Gogoi also defended his decision to become an MP in his memoir Justice for the Judge, saying that he had accepted the nomination as he wanted to raise issues regarding the Northeastern region, from where he hails.


However, the former CJI has not intervened in any issue pertaining to the judiciary or the Northeast.


In the three years since his nomination, there have been eight Rajya Sabha sessions, and Gogoi has not asked any question in the Parliament, The Print reported. According to the report, Parliament records show that he has also not participated in any discussion or presented any private member’s bill.


The report further says that Gogoi has attended the current budget session for only six of 10 days till February 13. Moreover, during the previous budget session, he was present for just seven of 29 days.


Even though Gogoi’s attendance marginally went up in the past few sessions, he did not make any notable intervention in terms of legislation, the report said.


So far, Gogoi has neither asked any starred or unstarred questions in the Upper House nor has he participated in any debate. The national average of such participation by MPs in the Parliament is 56.9.


Comparing Gogoi’s performance with that of athlete PT Usha, who was nominated in July 2022, the report pointed out that the latter has an average attendance of 91% over three sessions, has asked eight questions and participated in three debates.


In December 2021, Gogoi said in an interview that he had not been attending the Rajya Sabha due to medical advisory amid the Covid-19 pandemic, as per the report.


After his nomination to the Upper House, Gogoi was appointed to the Parliamentary Standing Committee on External Affairs in  July 2020. The next year, he was made a member of the Standing Committee on Communications and IT.


Citing sources, The Print reported that after Gogoi was renominated to the External Affairs committee in September 2022, he skipped all its nine meetings. Even as a part of the committee on communications for eight months, he remained absent from all meetings, as per Rajya Sabha records cited by the report.


The Parliamentary corruption at its peak

 పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

ABN , First Publish Date - 2023-07-26T01:35:49+05:30 IST

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనను తాను అంతం చేసుకుంటున్నదా? ఈ విషయమై అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ...

పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనను తాను అంతం చేసుకుంటున్నదా? ఈ విషయమై అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ ప్రహసనప్రాయమయ్యాయి. వేల కోట్లతో ఓట్లు కొనుక్కోవడాలు, ఉచిత తాయిలాలు, కుల, మత భావోద్వేగాలను దట్టించడం మూలాన అసలు ఎన్నికయిన ప్రజాప్రతినిధులు సరైన వారేనా అన్న అనుమానం మొదటి దశలోనే కలుగుతుంది. ఇక ఎన్నికైన తర్వాత వారు తాము గెలిచిన పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానాలకు కూడా అనేక సంఘటనలు ఆస్కారం కలిగిస్తున్నాయి. పోనీ కనీసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్, చట్టసభలను సవ్యంగా నడిపిస్తారా అంటే అదీ చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మన పార్లమెంటరీ వ్యవస్థలో పెచ్చరిల్లుతున్న దుష్పరిణామాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతం పలుకుతారని తొమ్మిది సంవత్సరాలకు ముందు ఆశించిన వారు ఎందరో ఉన్నారు. అసలు మోదీకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సవ్యంగా సాగడం ఇష్టం లేదా అన్న అనుమానాలకు వారందరూ ఇప్పుడు గురవుతున్నారు.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత నాలుగు రోజులుగా స్తంభించిపోతున్నాయి. కారణమేమిటో మరి చెప్పాలా? మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న దారుణ మారణకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే. పార్లమెంట్ సరిగ్గా సాగాలనే సదుద్దేశం ఉంటే మోదీ మొదటి రోజే మణిపూర్ గురించి సభలోనే ప్రకటన చేసి ఇలాంటి తీవ్రమైన అంశంపై అన్ని పక్షాలూ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని అభ్యర్థించేవారు. 2001లో మణిపూర్‌లో ఇలాంటి కల్లోలమే సంభవించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించారని, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాల్సిందిగా మణిపూర్ ప్రజలను అభ్యర్థించారని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు మీడియాతో మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాన్ని ఖండించారు. అయితే ఆ రాష్ట్రంలో జాతుల ఘర్షణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారో చెప్పలేదు. నిజానికి ఇద్దరు మణిపూర్ మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన సంఘటన వెలుగులోకి రాకపోతే ప్రధాని నోరు విప్పేవారు కాదని మణిపూర్‌లో స్థానిక బిజెపి ఎమ్మెల్యే పాలోయిన్ లాల్ హోకిప్ అన్నారు. ‘79 రోజులుగా ఘోరాలు జరుగుతున్నా మోదీ నోరు విప్పలేదు. ఇలాంటి ఘటనలను ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు ఒక్కసారైనా ఖండించకపోయినా దారుణమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా తాము అక్కడ జరుగుతున్న దారుణాలను గురించి వివరించేందుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరామని, కాని ఆయన ప్రాధాన్యాలు వేరని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంతా చూస్తుంటే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగే హంతక ముఠాలతో కుమ్మక్కైనట్లు కనపడుతోందని, ఒక జాతి జాతినే నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు 17వ లోక్‌సభ 1952 తర్వాత అతి తక్కువ రోజులు సమావేశం అయిన చట్టసభగా చరిత్ర పుటల్లో రికార్డు కానున్నదని పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటి వరకూ కేవలం 230 రోజులే సభ సమావేశమైంది. అంటే ఏడాదికి 58 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశమవుతోంది, ప్రస్తుత పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే మున్ముందు కూడా సభ సవ్యంగా జరిగే అవకాశాలు కనపడడం లేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా సవ్యంగా సాగలేదు. లోక్‌సభ 34 శాతం, రాజ్యసభ 24 శాతం మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయి. అసలు ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించారు. అయిదు మంత్రిత్వ శాఖలకు సంబంధించి రూ.11 లక్షల కోట్ల వ్యయం, వివిధ మంత్రిత్వ శాఖల రూ.42 లక్షల కోట్ల వ్యయం ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందాయి. రెండో విడత బడ్జెట్ సెషన్ కార్యకలాపాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. చివరిలో ఉభయ సభల సభాపతులు ఆనవాయితీగా ఏర్పాటు చేసే తేనేటి విందును కూడా ప్రతిపక్ష నేతలు బహిష్కరించారంటే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎంత తీవ్ర అగాధం ఏర్పడిందో అర్థమవుతుంది. ఇదే సెషన్ చివరిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, ఆయనను పార్లమెంట్ నుంచి బహిష్కరించడం, ఇల్లు ఖాళీ చేయమని నోటీసు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి 2022 శీతాకాల సమావేశాలు కూడా ఉభయ సభలు షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు వర్షాకాల సమావేశాల్లో ఒకేసారి 24 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి నాలుగురోజుల ముందే వాయిదా వేశారు. మొదటి రెండు వారాలు ఉభయ సభల్లో ఏ చర్చా జరగలేదు. చివరకు సస్పెన్షన్లను ఎత్తి వేసి ధరల పెరుగుదలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.



సాధారణంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏమి డిమాండ్ చేస్తాయి? ఆ సమయంలో దేశంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘటనపై చర్చ జరగాలనో, పార్లమెంటరీ కమిటీనో డిమాండ్ చేస్తాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని అడగడం సహజం. గతంలో ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేతలూ ఇదే విధంగా డిమాండ్ చేశారు కదా! అదే విధంగా మణిపూర్ లాంటి ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి సభలో మాట్లాడాలని డిమాండ్ చేయడం కూడా సముచితమే. ఇలాంటి వాటిని ముందే ఊహించి ప్రతిపక్షాలతో మాట్లాడి, పరిష్కార మార్గాలు కనుక్కుని సభ సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని ప్రభుత్వమే సంఘర్షణాయుత వైఖరిని అవలంబిస్తే ఎవరేమి చేయగలరు? మణిపూర్‌పై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మోదీ మాత్రం సభలో మాట్లాడకూడదని, గందరగోళంలోనే బిల్లులు ఆమోదించాలని బిజెపి వ్యూహకర్తలు ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. రాజుకంటే మొండివాడు బలవంతుడని అంటారు. కాని రాజే మొండివాడైతే ఏం చేయగలం?


ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించడాన్ని మోదీ సర్కార్ ఏనాడో మరచిపోయింది. ఇప్పుడు కనీసం చర్చలకు కూడా అవకాశం కల్పించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ మాట పక్కన పెడితే కీలకమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు నివేదించే పద్ధతిని కూడా మోదీ ప్రభుత్వం విస్మరించినట్లు కనపడుతోంది. మోదీ హయాంలో 16వ లోక్‌సభలో కేవలం 25 శాతం బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదిస్తే, ప్రస్తుత 17వ లోక్‌సభలో 15 శాతం బిల్లులను కూడా నివేదించలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ లోక్‌సభలో ఇంతవరకు కేవలం 14 బిల్లులను మాత్రమే కమిటీలకు పంపారు. అంతకు ముందు 60 నుంచి 70 శాతానికి పైగా బిల్లులను పార్లమెంట్‌లో స్థాయీ సంఘాలే చర్చించి సభ ఆమోదానికి పంపేవి. స్థాయీ సంఘాలకు విలువ లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలుగుతాయో, ప్రభుత్వ నిధులు పూర్తిగా ఖర్చవుతున్నాయో లేదో సమీక్షించే అవకాశం కూడా లేకపోయింది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును చర్చించే సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు.


రాజ్యాంగంలోని 93వ అధికరణ ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించాల్సి ఉన్నది. 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన సమస్యలు తలెత్తినప్పుడు అన్ని విషయాలను పక్కన పెట్టి చర్చించేందుకు వీలు కల్పించే లోక్‌సభలో వాయిదా తీర్మానాల క్రింద కానీ రాజ్యసభలో 267వ నిబంధన క్రింద కానీ ఇచ్చిన నోటీసులను పూర్తిగా పక్కన పెడుతున్నారు.


2014లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయిన రోజు పార్లమెంట్ ద్వారం ముందు మోకరిల్లి సభలో అడుగుపెట్టిన మోదీ ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా రాజదండంతో ప్రవేశించారు. అయితే ఈ తొమ్మిదేళ్లలో పార్లమెంట్ సమావేశాల విషయంలో ఆయన వ్యవహరించిన వైఖరికీ, ఆయన ప్రదర్శించిన దృశ్యాలకూ ఎంతో వ్యత్యాసం కనపడుతున్నది. దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో పర్యటిస్తూ అనేక ప్రసంగాలు చేసే మోదీ కీలకమైన అంశాలపై కనీసం పార్లమెంట్‌లో కూడా ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు? తొమ్మిది సంవత్సరాలుగా విలేఖరుల సమావేశం పెట్టకపోయినా పర్వాలేదేమో కాని ఒక దేశాధినేతగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనం పాటించడంలో ఆయన ఉద్దేశమేమిటి? పెద్ద నోట్ల రద్దు సమయంలో సామాన్య జనం మైళ్ల పొడవున క్యూల్లో నిల్చోవాల్సి వచ్చినా, కొవిడ్ మహమ్మారి సందర్భంగా వేలాది వలస కూలీలు దిక్కులేని చావులు చచ్చినా, ఏడాది పొడవునా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనల్లో వందలాది రైతులు మరణించినా, బిజెపి ఎంపియే తమను లైంగికంగా వేధించారని మహిళా ఛాంపియన్ మల్లయోధులు నెలల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించినా మోదీ మౌనం పాటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మణిపూర్‌లో జరుగుతున్న కల్లోలం మరో ఎత్తు. జాతిపర ఊచకోతకు గురై దాదాపు 50వేల మందికి పైగా ఇంకా శరణార్థుల శిబిరాల్లో తలదాచుకున్నారు. వేలాది మంది మిజోరంకు పారిపోయారు ఈ దేశానికి ఒక నిర్ణయాత్మక నాయకత్వం అందించాల్సిన మోదీ ప్రధానమంత్రే కాదు పార్లమెంట్ నేత కూడా. పార్లమెంట్‌కు అవసరమైన సమాధానాలు చెప్పి, అది సవ్యంగా నడిచేలా చూసే బాధ్యత కూడా ఆయనదే.


ఎ. కృష్ణారావు


(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)