Friday, July 5, 2019

శ్రీలంక కన్నా వెనకబడిన భారత్‌

శ్రీలంక కన్నా వెనకబడిన భారత్‌
Jul 05, 2019, 20:59 IST
 India Remains Lower Middle Income Nation - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని, దీన్ని ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామని మన నాయకులు గొప్పగా చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక వర్గీకరణలో మాత్రం మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. భారత్‌ ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ దేశంగా కొనసాగుతుండడం విచారకరం. మన దిగువనున్న శ్రీలంక మాత్రం దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందం నుంచి 2019–2020 ఆర్థిక సంవత్సరానికి ఎగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలో చేరింది. 1999వ ఆర్థిక సంవత్సరంలో దిగువ–మధ్య ఆదాయ గ్రూపులో చేరిన ఆదేశం రెండు దశాబ్దాల్లోనే ఈ ఘనత సాధించింది.

భారత దేశం దిగువ ఆదాయ దేశాల బృందం నుంచి 2009లో దిగువ–మధ్య ఆదాయ దేశాల బృందంలోకి అడుగుపెట్టింది. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ అదే కేటగిరీ దేశాల జాబితాలో కొనసాగుతున్నట్లు జూలై ఒకటవ తేదీన ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడయింది. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా జూలై ఒకటవ తేదీనే వివిధ దేశాల ఆదాయ క్యాటగిరీలా జాబితాను విడుదల చేస్తుంది. జాతీయ ఆదాయం తలకు సగటున ఎంత వస్తున్నదో డాలర్లలో ‘అట్లాస్‌ పద్ధతి’ ద్వారా లెక్కించి దేశాలకు కేటగిరీలను నిర్ణయిస్తుంది.

1. దిగువ కేటగిరీ: ఏడాదికి 1,025 డాలర్లు ఒకరికి సగటున వస్తే, అంటే 70,069 రూపాయలు వస్తే ఆ దేశాన్ని దిగువ కేటగిరీ దేశంగా పరిగణిస్తారు.
2. దిగువ–మధ్య కేటగిరీ: 1,026 నుంచి 3,995 రూపాయలు మధ్యన, అంటే 70,137 రూపాయల నుంచి 2, 73,098 రూపాయలు ఆదాయం సగటున ఉంటే దాన్ని దిగువ–మధ్య కేటగిరీగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌ ఇదే కేటగిరీలో కొనసాగుతోంది.
3. ఎగువ–మధ్య కేటగిరీ: ఈ 3,996 డాలర్ల నుంచి 12,375 డాలర్లు, అంటే 2,73,167 రూపాయల నుంచి 8,45,955 రూపాయల వరకు తలసరి ఆదాయం రావడం.
4. ఇక ఎగువ కేటగిరీ అంటే 12,376 డాలర్లు, 8,46,023 రూపాయలకన్నా ఎక్కువ ఆదాయం తలసరి రావడం.






Friday, June 21, 2019

ప్రభవిస్తున్న ‘ఏకపక్ష’ భారత్ !

ప్రభవిస్తున్న ‘ఏకపక్ష’ భారత్ !
21-06-2019 03:47:07

17వ లోక్ సభ ‘ప్రతిపక్షం లేని’ పార్లమెంటులా కన్పిస్తోంది. నిరంకుశ పాలకుని నేతృత్వంలోని ఒక ఆధిపత్య పార్టీ సకల వ్యవహారాలను నిర్దేశించనున్నది. కేబినెట్ మంత్రుల ఎంపికలో ప్రధాని మోదీ తీరుతెన్నులు, పార్లమెంటరీ వ్యవస్థపై అధ్యక్ష తరహా పాలనా నమూనాను రుద్దడానికి ఆయన సంకల్పించినట్టు ఇప్పటికే స్పష్టం చేసాయి. మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఒక తీవ్ర సంస్థాగత సంక్షోభానికి, బహుశా, అదొక సూచన!

కొత్త లోక్‌సభ కొలువుదీరిన వేళ... పాలక పక్షం వారి ‘జై శ్రీరామ్’ నినాద ఘోషలో కొత్త శాసన నిర్మాతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాజ్యాంగ విధిని నిర్వహించిన ప్రతిపక్ష ఎంపీ ఒకరు, విచార మగ్నుడై సెంట్రల్ హాల్‌లోకి నెమ్మదిగా ప్రవేశిస్తూ ‘మోదీ ప్రభుత్వానికి ప్రజలు పదేళ్ళ పాటు అధికారాన్ని కట్టబెట్టినట్టుగా కన్పిస్తోంద’ని నిట్టూర్చారు. ఆ ఎంపీ వ్యాకులత విస్మయకరమైన విషయమేమీ కాదు. ప్రతిపక్ష సభ్యులు కూర్చుండే స్థానాలు ఖాళీగా కన్పిస్తున్నాయి. గత సభలో అక్కడ కూర్చున్న పాత కాపులు చాలా మంది కానరావడం లేదు. నిండుదనం, ఒక విధంగా వెలవెలబోయింది. మన గణతంత్ర రాజ్యపు వర్తమాన అస్తిత్వాన్ని 17వ లోక్‌సభ ప్రతిబింబిస్తున్నట్టయితే, మనం ఒక ఏక ధ్రువ భారత దేశంలోకి ప్రవేశిస్తున్నామని చెప్పక తప్పదు. జాతి జీవనంలోని విలక్షణ వైవిధ్యాలన్నీ క్రమక్రమంగా వెనక్కి తగ్గుతూ కాషాయీకరణ పొందిన రాజ్య వ్యవస్థకు దారి నిస్తున్నాయి మరి.

ప్రతిపక్షాలు ఇంత అధ్వాన్నంగా, అస్తవ్యస్తంగా, నిరుత్సాహంగా, బహుశా, భారత పార్లమెంటు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ కన్పించ లేదనడం సత్యదూరం కాదు. 1984లో సైతం (రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కంటే అత్యధిక మెజారిటీని సాధించింది) ప్రతి పక్షాలు ఇప్పటిలా జావకారిపోలేదు. అప్పుడు కనీసం పార్లమెంటు లోపలా, వెలుపలా అతిరథ మహారథులైన విపక్ష నాయకులు పలువురు వున్నారు. అటల్ బిహారి వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ, జార్జి ఫెర్నాండెజ్, చంద్రశేఖర్ మొదలైన వారు ప్రజల సమస్యలపై ఆవేశపూరితంగా, అర్థవంతంగా తమ గొంతు విప్పేవారు. పాలకుల్లో కదలిక తెచ్చేవారు. బీజేపీ కూడా ప్రజా జీవనంలో చాలా ఉత్సాహంగా పాల్గొనేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎల్ల వేళలా దానికి బాసటగా ఉండేది. వామపక్షాల మహాచురుకైన క్రియాశీలత కించిత్ కూడా తగ్గని కాలమది. ఎన్‌టి రామారావు, రామకృష్ణ హెగ్డే లాంటి ప్రాంతీయ అధినేతలు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను చావు దెబ్బ దీయడం విస్మరించలేని చరిత్ర. అంతకు ముందు నెహ్రూ, ఇందిర రోజుల్లో కూడా గొప్ప ప్రతిపక్ష నాయకులు పలువురు వుండేవారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా సహేతుక వాదనలు చేసి ప్రజలనే కాక పాలకులను కూడా ఒప్పించే వారు.

మరి నేటి ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి? మహా శోచనీయం. వాటి అవస్థలకు అంతులేదు. పాలక బీజేపీని అవి ఎందుకు సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయి? అనిశ్చితి, అరాచకత్వంలోకి కాంగ్రెస్ పార్టీ కొట్టుకు పోతున్నట్టుగా కన్పిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పరిత్యజించాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పార్టీలో ఒక శూన్యాన్ని సృష్టించింది. అంతర్గత గందరగోళం మరింత తీవ్రమవకుండా ఆ శూన్యం భర్తీ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులలో దేశవ్యాప్తంగా సుపరిచితులు, సుప్రసిద్ధులైన నేతలు ఎవరూ లేరు. పార్లమెంటరీ వ్యవహారాలలో అంతగా అనుభవం లేనివారే ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నారు. రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ అయితే వున్నారు. ఆయన సభ్యత్వ కాలం ముగియనుండడంతో పెద్దల సభలో కాంగ్రెస్ పెద్ద దిక్కును కోల్పోనున్నది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌లో నెలకొనివున్న అయోమయం ఆ పార్టీలో అంతర్గతంగా నెలకొనివున్న నిర్ణయ రాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది.

మరి ఇతర ప్రతిపక్షాల పరిస్థితీ ఇంతకంటే మెరుగ్గా లేదు. అవీ దుర్భల, అనిశ్చిత భవిష్యత్తునే ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు రాజకీయ ఆందోళనలు, ఉద్యమాలలో అగ్రగాములుగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు లోక్‌సభలో మూడు స్థానాలకే పరిమితమయ్యాయి. పార్లమెంటులో మూడో అతి పెద్ద పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్ళతో సతమతమైపోతోంది. తన కంచుకోట బెంగాల్‌లో ఆ జాతీయ పార్టీ పలు స్థానాలను గెలుచుకోవడం తృణమూల్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. ఆ దిగ్భ్రాంతి నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. బెంగాల్ లో బీజేపీ పురోగతిపై తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కలవరపడుతున్నారు. తన ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడిన రీతిగా ఆమె రాజకీయ ప్రతిస్పందనలు ఉంటున్నాయి. ఒక పటిష్ఠ ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందక ముందే బహుజన్ సమాజ్ పార్టీ –- సమాజ్ వాదీ పార్టీ కూటమి కథ మళ్ళీ మొదటికి చేరింది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ కేంద్రంలోని అధికార పార్టీతో సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి.

17వ లోక్ సభ ‘ప్రతిపక్షం లేని’ (అపోజిషన్ -ముక్త్) పార్లమెంటులా కన్పిస్తోంది. నిరంకుశ పాలకుని నేతృత్వంలోని ఒక ఆధిపత్య పార్టీ సకల వ్యవహారాలను నిర్దేశించనున్నది. కేబినెట్ మంత్రుల ఎంపికలో ప్రధాని మోదీ తీరు తెన్నులు, పార్లమెంటరీ వ్యవస్థపై అధ్యక్ష తరహా పాలనా నమూనాను రుద్దడానికి ఆయన సంకల్పించినట్టు ఇప్పటికే స్పష్టం చేసాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేయగల సమర్థ నాయకుడు ఒక్కడైనా ప్రభుత్వంలో గానీ, ప్రభుత్వం వెలుపల గానీ ఉన్నట్లు కన్పించడం లేదు. మోదీ నిర్ణయాలను ప్రశ్నించగల ధైర్యసాహసాలు ఏ కేబినెట్ మంత్రికీ లేవు. ప్రధాని ఆదేశాన్ని మౌనంగా పాటించవలసిందే. కేంద్ర కేబినెట్‌లో అధికారికంగా ‘ద్వితీయ’ స్థానంలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు వివిధ కీలక కేబినెట్ కమిటీలలో స్థానం కల్పించకపోయినా ప్రశ్నించిన వారు ఎవరూ లేకపోవడమే అందుకు నిదర్శనం. తాము అడిగిన మంత్రిత్వ శాఖలను కేటాయించలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్ కుమార్ (యునైటెడ్ జనతా దళ్), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) లాంటి మిత్రపక్షాల నాయకులు కూడా మౌనంగా ఉండిపోక తప్పని పరిస్థితి.

ఇలా ‘ప్రతిపక్షం లేని’ పార్లమెంటు అనేది మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఒక తీవ్ర సంస్థాగత సంక్షోభానికి, బహుశా, ఒక సూచన! మరి ప్రశస్త పాలనకు దోహదం చేసే ప్రజాస్వామిక నిరోధ సమతౌల్యాలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా ఎలా ఉంటాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో మూల స్తంభమైన మీడియా, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను నిశితంగా విమర్శించడంలో ఘోరంగా విఫలమయిందని 2019 సార్వత్రక ఎన్నికల ప్రచారం స్పష్టంగా వెల్లడించింది. చాలా పత్రికలు, ఛానెల్స్ పిరికితనంతో వ్యవహరించాయి. సత్యాలను ఎలుగెత్తి చాటలేకపోయాయి. తమ విధ్యుక్త ధర్మనిర్వహణను గర్హనీయంగా ఉపేక్షించాయి. రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరిస్తున్న వ్యవస్థగా న్యాయవ్యవస్థను ప్రజలు అమితంగా గౌరవించేవారు. అయితే ఇటీవల న్యాయవ్యవస్థ నిష్కాపట్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ న్యాయమూర్తులు చాలా అనౌచిత్యంగా వ్యవహరించడమే అందుకు కారణం.

విధాన నిర్ణయాలన్నీ ‘సర్వోన్నత నాయకుడే’ తీసుకోవడం పరిపాటి అయింది. అధికారాలన్నీ ఆయనవే. ఆయనదే తుది మాట. ఇటువంటి పాలనా నమూనా హానికర ప్రభావాలు 16వ లోక్ సభ హయాంలోనే ప్రజల అనుభవంలోకి వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను, ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడం; ఆధార్ లాంటి కీలక బిల్లులకు ద్రవ్య బిల్లులుగా పార్లమెంటు ఆమోదాన్ని పొందడం రాజ్యాంగ విహితం ఎంత మాత్రం కాదు. సీనియర్ మంత్రులకు కూడా, తాము నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించిన నిర్ణయాలు ముందుగానే తెలియకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నోట్ల రద్దు లాంటి వివేకరహిత నిర్ణయాలు ప్రజలను ఎనలేని అవస్థలకు గురి చేసినప్పటికీ, వాటికి వ్యతిరేకంగా కార్యసాధక ఉద్యమాలను ప్రతిపక్షాలు నిర్మించలేక పోయాయి. మరి ఇటువంటి పరిణామాలు మన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని తీవ్ర ఒత్తిళ్ళకు గురి చేస్తున్నాయనడంలో సందేహమేమీ లేదు.

జర్నలిస్టులపై భౌతిక దాడులు పెరిగిపోయాయి; పలువురు పాత్రికేయులకు జైలుశిక్షలు విధించారు; జమ్మూ-కశ్మీర్ శాసనసభలో ప్రాతినిధ్య జనసంఖ్యలో మార్పులకు రహస్య ప్రయత్నాలు జరుగుతున్నాయి; ఆర్థిక వ్యవస్థ పురోగతి సజావుగా లేదు; స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు సక్రమమైనవి కావు.. మరి ఈ అవకతవకలకు, అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తేదెవరు? నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ తలాక్, భూ స్వాధీన సవరణ బిల్లు మొదలైన వివాదాస్పద అంశాలపై కార్యనిర్వాహక వర్గం చెలాయించిన అపరిమిత అధికారాలను రాజ్యసభలో తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. మోదీ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్లే ఆ ప్రతిఘటనకు ఆస్కారం కలిగింది.

పార్లమెంటరీ ప్రక్రియలను మోదీ సర్కార్ ఉల్లంఘించలేకపోయింది. అయితే వచ్చే ఏడాది రాజ్యసభలో బీజేపీ పూర్తి మెజారిటీ సంపాదించుకోనున్నది. ఉభయ సభల్లోనూ పూర్తి మెజారిటీ ఉన్న ఫలితంగా పాలకులు నిర్భయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఎంతైనా ఉన్నది. మరి ఆ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు సవాల్ ఎక్కడి నుంచి రావాలి? రాజీవ్ గాంధీ పాలనలో ప్రభుత్వం నుంచే అటువంటి సవాల్ వచ్చింది. రక్షణ శాఖ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ధ్వజమెత్తారు. 1987లో ఆయన ప్రభుత్వం నుంచి వైదొలగి, కాంగ్రెస్ నుంచి నిష్క్రమించినప్పుడు రాజీవ్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. 1971లో ఇందిరాగాంధీ చరిత్రాత్మక విజయం సాధించారు. అయితే కొద్దికాలానికే పెచ్చరిల్లిపోయిన అవినీతి, పెరిగిపోతోన్న ధరలకు వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఇందిర అత్యవసర పరిస్థితిని విధించారు. ఇవన్నీ ఆమెకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమైక్యం కావడానికి దోహదం చేశాయి. సార్వత్రక ఎన్నికలలో వరుసగా రెండో సారి ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీ తన అధికార ప్రాభవంలో నిస్సందేహంగా ఇందిరాగాంధీ కంటే శక్తిమంతుడు. పైగా ప్రతిపక్షాలు పూర్తిగా అపఖ్యాతిపాలయివున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నించేదెవరు? ఇందుకు పౌర సమాజమే చొరవ తీసుకోవాలి. ‘జాతి -వ్యతిరేకుడు’ అనే నిందను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు తోడ్పడని ఆర్థిక విధానాలను, రాజ్యాంగంలో మార్పులు చేయడానికి జరిగే ప్రయత్నాలను గట్టిగా ప్రశ్నించి తీరాలి.
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Thursday, June 20, 2019

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం

రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71 మంది మాత్రమే. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు త్వరలో నిర్వహించే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి కొత్తగా మరో నలుగురు సభ్యులు చేరనున్నారు. దీంతో బీజేపీ బలం 75కు, ఎన్‌డీయే బలం 106కు పెరుగుతుంది. కానీ కీలక బిల్లుల ఆమోదానికి ఈ మెజార్టీ సరిపోదు. ‘ఒక దేశం... ఒకే ఎన్నికలు’ ‘ట్రిపుల్‌ తలాక్‌ రద్దు’ తదితర బిల్లులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేలా చూడాలన్నది బీజేపీ వ్యూహం.

పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించిన 370 ఆర్టికల్‌ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బీజేపీ యోచన. ఈ నేపథ్యంలో కీలక బిల్లులు ఆమోదం పొందేలా చూసేందుకు 2020 నాటికి రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ కీలక నేత ఒకరిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే రాజ్యసభలో తమ బలం పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తుండగా, టీడీపీని వీడేందుకు ఆ పార్టీ ఎంపీలు సమాయత్తం కావడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది

Sunday, May 26, 2019

పార్టీ కంటే మీ పిల్లలే ముఖ్యమా?

పార్టీ కంటే మీ పిల్లలే ముఖ్యమా?
27-05-2019 00:49:15

చిదంబరం, గెహ్లాట్‌, కమల్‌నాథ్‌లపై
రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం
మోదీని ఢీకొట్టే పని ఒక్క రాహుల్‌దేనా..?
రాఫెల్‌పై మీరెందుకు ప్రచారం చెయ్యలేదు?
ఓటమికి బాధ్యులంతా ఈ గదిలోనే ఉన్నారు
పదునైన విమర్శలతో టార్గెట్‌ చేసిన ప్రియాంక
హాట్‌హాట్‌గా వర్కింగ్‌ కమిటీ సమావేశం?
న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవ ప్రకంపనలు కాంగ్రె్‌సలో కొనసాగుతున్నాయి. పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కొందరు సీనియర్‌ నాయకుల్ని నేరుగా టార్గెట్‌ చేశారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టారని ఘాటుగా దుమ్మెత్తారు. మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, కమల్‌నాథ్‌లే లక్ష్యంగా విమర్శల శరాలు గుప్పించారు. కొడుకుల ఎదుగుదలే ముఖ్యమని భావించారని వారిని నిశితంగా విమర్శించారు. శనివారంనాడు జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ చాలా నిష్కర్షగా మాట్లాడారు. పార్టీ పరాజయాన్ని సునిశితంగా విశ్లేషించిన రాహుల్‌- ఓటమికి తాను బాధ్యత తీసుకుంటున్నానని చెబుతూనే ఈ వైఫల్యంలో మీ భాగస్వామ్యమూ తక్కువేం కాదని కుండబద్దలు కొట్టారు. ఏ అంతర్గత సమావేశంలోనూ ఆయన ఇంత తీవ్రంగా మాట్లాడలేదని సమావేశంలో పాల్గొన్న ఓ నేత చెప్పారు. ‘‘కొడుకు కార్తికి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి చిదంబరం బెదిరించారు... మరి ఇవ్వాలా? వద్దా? కొడుకు వైభవ్‌ను గెలిపించుకోవడం కోసం ప్రచారమంతటినీ పక్కన పడేసి ఏకంగా వారంరోజుల పాటు జోధ్‌ఫూర్‌లోనే మకాం పెట్టారు అశోక్‌ గెహ్లాట్‌! ఇలా కుమారుడి కోసం కాడి వదిలేయడం సబబేనా? ఛింద్వారా లో తన కుమారుడు నకుల్‌కు టికెట్‌ ఇవ్వనపుడు తాను సీఎంగా ఉండి ప్రయోజనమేంటని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రశ్నించారు. ఎంతో ఒత్తిడి తెచ్చారు. ఇలాగే చాలా మంది నాయకులు... వారి పిల్లలు, బంధువులే ముఖ్యమనుకున్నారు. ఇలా అయితే ప్రజలకు ఏం చెబుతాం?’’ అని రాహుల్‌ అధిక్షేపించినట్లు సమాచారం. నాలుగ్గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రియాంక చాలా మార్లు మధ్యలో కల్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి కారకులైనవారంతా ఈ సమావేశంలోనే ఉన్నారని ఆమె చాలా నిష్టురంగా విమర్శించారు.

‘‘చౌకీదార్‌ చోర్‌ హై... అన్నది మన నినాదం. మరి దీన్ని ఎందరు నేతలు తమ ప్రచారంలో ఎన్నిసార్లు ఉపయోగించారు? రాఫెల్‌ కుంభకోణంలో అవినీతిని బలంగా జనంలోకి తీసికెళ్లగలిగారా? ఈ రెండింటినీ రాహుల్‌కే వదిలేశారు. ఆయనే ప్రతీచోటా దీన్ని ప్రచారం చేయాల్సి వచ్చింది. న్యాయ్‌ పథకం గురించి కూడా అంతే..’’ అని ప్రియాంక అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ కూడా - ‘ప్రధాని మోదీ అవినీతిని హైలెట్‌ చెయ్యడంలో ఎందరు నేతలు ముందుకొచ్చారో చెప్పండి..’ అని ప్రశ్నించారు. కొందరు నాయకులు చేతులెత్తి తామూ దీన్ని లేవనెత్తామని అన్నపుడు ఆయన వారి మాటలను కొట్టిపారేశారు. పార్టీలో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాహుల్‌ అన్నారు. ఇలాంటపుడు తాను కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాజీనామాకు సిద్ధపడ్డారు. తన సోదరిని కూడా పార్టీ చీఫ్‌గా చేయవద్దని, అసలు గాంధీల కుటుంబం నుంచే ఉండాలని కోరుకోవద్దని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. నేతలు వారించినా వినకుండా మధ్యలోనే సమావేశ గది నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజీనామా వద్దని ప్రియాంక కూడా తన సోదరుడికి నచ్చచెప్పారు. వైదొలిగాలని నిర్ణయించుకుంటే బీజేపీ ఉచ్చులో పడ్డట్లేనని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు బయటకు పొక్కింది. ‘‘స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని’’ జ్యోతిరాదిత్య సిందియా సూచించారు. రాహుల్‌ రాజీనామాను నేతలంతా తిరస్కరించి- ఆయనకు నచ్చచెప్పే బాధ్యతను సోనియా, ప్రియాంకలకే అప్పగించారు. ‘పార్టీ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించుకోడానికి కొంత గడువు ఇవ్వాలని’ రాహుల్‌కు ప్రియాంక సూచించినట్లు సమాచారం. కానీ ప్రత్యామ్నాయాలేవీ లేవని నేతలంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. మొత్తంమీద, సీడబ్ల్యూసీ సమావేశం చాలా వేడిగా, వాడిగా సాగినట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే రాహుల్‌ అసలు రాజీనామాయే చేయలేదని పార్టీ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల ఆ తరువాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Sunday, May 12, 2019

11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత... సెకండ్‌ చాన్స్‌ దొరకని ఎంతోమంది

11 సార్లు ఎన్నికైన ఏకైక జననేత... సెకండ్‌ చాన్స్‌ దొరకని ఎంతోమంది
May 12, 2019, 05:38 IST
 Since 1951, 60 Percent Lok Sabha MPs were never re-elected - Sakshi
సెకండ్‌ చాన్స్‌ దొరకని ఎంతోమంది

మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వాళ్లు మళ్లీ ఆ పదవి పొందాలని ఆశించడం సహజమే. అయితే, అందరికీ అది సాధ్యం కాదు. వాజపేయి, అడ్వాణీ, ఇంద్రజిత్‌ గుప్తా, సుమిత్రా మçహాజన్‌ వంటి వారు కొందరు అనేక సార్లు ఎంపీలుగా గెలిచినా మెజారిటీ ఎంపీలకు రెండో అవకాశం దక్కలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1951 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే... 60 శాతం ఎంపీలు అంటే ప్రతి ఐదుగురిలో ముగ్గురు రెండోసారి ఎంపీ కాలేకపోయారు. ఇంత వరకు జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4,843 మంది ఎంపీలుగా (నామినేట్‌ ఎంపీలు 22 మంది కాకుండా) ఎన్నికయ్యారు.

వీరిలో 2,840 మంది రెండోసారి ఎంపీలుగా ఎన్నిక కాలేదు. మిగిలిన 2003 మందిలో 50 శాతం మంది మూడోసారి ఎన్నికకాలేదు. అంటే వీరు రెండు సార్లు మాత్రమే గెలిచారు. మొత్తం ఎంపీల్లో 999 మంది రెండుసార్లు, 502 మంది మూడుసార్లు, 249 మంది నాలుగు సార్లు, 134 మంది ఐదు సార్లు గెలిచారు.  ఒకసారికి మించి లోక్‌సభకు ఎన్నిక కాని వాళ్ల సంగతి ఇలా ఉంటే, కొందరు అనేకసార్లు పార్లమెంటుకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. ఇంద్రజిత్‌ గుప్తా 11 సార్లు ఎన్నికయి దేశంలో ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర నెలకొల్పారు.

ఆ తర్వాత అటల్‌ బిహారీ వాజపేయి, సోమనాథ్‌ చటర్జీ, పీఎం సయీద్‌లు పదేసి సార్లు ఎంపీలయ్యారు. వీరు కాక తొమ్మిది మంది నాయకులు 9 సార్లు, పద్దెనిమిది మంది ఎనిమిది సార్లు, 34 మంది ఏడుసార్లు, 54 మంది 6 సార్లు,134 మంది ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక నామినేటెడ్‌ ఎంపీల విషయానికి వస్తే ఇంత వరకు మొత్తం 22 మంది లోక్‌సభకు నామినేట్‌ కాగా వారిలో చాలా మంది కేవలం ఒకసారే నామినేట్‌ అయ్యారు. అయితే, ఆంగ్లో ఇండియన్‌ ఫ్రాంక్‌ అంటోనీ ఏకంగా 8సార్లు నామినేట్‌ అయి రికార్డు సృష్టించారు. ఏఈటీ బారో ఏడు సార్లు ఆంగ్లో ఇండియన్‌ సభ్యునిగా పార్లమెంటుకు నామినేట్‌ అయ్యారు



"Crocodile Tears": PM Asks Why Mayawati Backing Congress After Alwar Rape

"Crocodile Tears": PM Asks Why Mayawati Backing Congress After Alwar Rape
Lok Sabha Election 2019: Rajasthan is one of the three heartland states the Congress had wrested from the BJP last year, but fell short of majority by a couple of seats All India | Edited by Anindita Sanyal | Updated: May 12, 2019 15:53 IST

SHARE
EMAIL
PRINT
COMMENTS
'Crocodile Tears': PM Asks Why Mayawati Backing Congress After Alwar Rape
PM Narendra Modi takes on Mayawati, asks why she is supporting Ashok Gehlot government.


NEW DELHI: Prime Minister Narendra Modi, who hit out at the Congress government over a gangrape case in Rajasthan's Alwar, today shredded Mayawati over her comments condemning it. Pointing out that Mayawati is supporting the Congress government led by Ashok Gehlot, the Prime Minister accused her of shedding crocodile tears.
Rajasthan is one of the three heartland states the Congress had wrested from the BJP last year, but fell short of majority by a couple of seats. Mayawati, whose party won two and Akhilesh Yadav's Samajwadi Party are supporting the Congress.

This time, the Congress is expected to give a tough fight to the BJP for Rajasthan's 25 Lok Sabha seats. The BJP is also facing challenge from the combined forces of Mayawati and Akhilesh Yadav in the race for the 80 Lok Sabha seats in Uttar Pradesh.

"Today the daughters of Uttar Pradesh are asking Behen-ji (Mayawati) that the government in Rajasthan is running with your support and there, a girl from Scheduled Castes got raped. So Behen-ji, why have you not withdrawn your support?" PM Modi said in a Hindi post on Twitter.

"Had the Congress government's intention been right, they wouldn't have tried to suppress it (the news of the rape) But no, they have only one response - 'what happened, happened'," another Hindu tweet from him read.  The reference was to Congress leader Sam Pitroda's comment on the 1984 anti-Sikh riots, which raised a political storm over the weekend.


Hitting back at Prime Minister Narendra Modi, Mayawati said he was indulging in "dirty politics" and demanded his resignation for incidents of Dalit atrocities in the past. "The BSP will for sure take an appropriate political decision in the absence of stringent and proper legal action in the case," she said in a press note.

Yesterday, Mayawati had criticised the Congress government in Rajasthan over the gang-rape of a Dalit woman on April 26.The woman's family said though the complaint was on April 30, the police held off filing a case because of the election. Rajasthan had voted on April 29 and May 6.

"The Congress government suppressed this incident till the end of election in Rajasthan to preserve their political benefits and threatened the family of the victim to keep quiet about it," Mayawati was quoted as saying by news agency ANI.

COMMENT
"We want the Supreme Court to act against the Congress, the police and the state administration and punish them as strictly as possible," she had said.


మొసలి కన్నీరు, నీచ రాజకీయాలు: మోదీపై మాయ ఫైర్
12-05-2019 16:21:31

లక్నో: ఆల్వార్ సామూహిక అత్యాచారం ఘటనపై ప్రధాని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, మొసలి కన్నీరు కారుస్తారని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ఆల్వార్ ఘటనలో నిందితులపై చర్యలకు తమ పార్టీ పట్టుదలగా ఉందని చెప్పారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై 'అవార్డ్ వాసపీ గ్యాంగ్' ఎందుకు స్పందించడం లేదంటూ యూపీలోని కుషీనగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ నిలదీశారు. దళిత ఆడకూతురు అత్యాచారానికి గురైతే బెహన్‌జీ (మాయావతి) ఎందుకు రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం లేదంటూ నిలదీశారు. మాయవతి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.

మోదీ వ్యాఖ్యలపై మాయావతి ఒక ప్రకటనలో సూటిగా స్పందించారు. 'ఆల్వార్ ఘటనను అడ్డుపెట్టుకుని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే బీఎస్‌పీ రాజకీయంగా తగిన నిర్ణయం తీసుకుంటుంది. మరి మోదీ గతలో జరిగిన ఘటనలపై ఎందుకు బాధ్యత తీసుకోరు? ఉనా ఘటన, రోహిత్ వేముల కేసు, దళితులపై అత్యాచారాలకు సంబంధించిన కేసులపై ఆయనకు బాధ్యత లేదా? ఆయన ఎందుకు రాజీనామా చేయరు?' అని మోదీపై మాయావతి నిప్పులు చెరిగారు.




Saturday, May 11, 2019

12 Important Schemes By Modi Government

12 Important Schemes By Modi Government That You Must Know
Current Affairs by Vignesh Krishna

With 4 years of governance done the Modi government seems to be on track with its poll promises. Most of the recent surveys suggest that the people are happy wth the initiative towards progress. Though the output is yet to be seen, the progress looks promising. We take a look at some of the important schemes that every aspirant must know which are important for SSB :




1. PRADHAN MANTRI JAN DHAN YOJANA:

pmjdy

Launched on 28th August 2014

The Objective of “Pradhan Mantri Jan-Dhan Yojana (PMJDY)” is ensuring access to various financial services like availability of basic savings bank account, access to need-based credit, remittances facility, insurance and pension to the excluded sections i.e. weaker sections & low-income groups.

Benefits of schemes are

1. Interest on deposit.
2. Accidental insurance cover of Rs.1Lakh
3. No minimum balance required
4. Life insurance cover of Rs.30,000
5. Overdraft facility after 6 months.
6. Access to Pension, insurance products.
7. RuPay Debit Card.
8. Overdraft facility up to Rs.5000/- is available in only one account per household.

2. MUDRA BANK YOJANA : (Micro Unit Development and Refinance Agency Bank)

images

Launched on 8th April 2015.

MUDRA will provide credit up to Rs.10 lakh to small entrepreneurs & act as a regulator of Microfinance institutions. The Objective of the scheme is to encourage entrepreneurs and small business units to expand their capabilities and to reduce indebtedness.

Schemes offered by MUDRA bank are:

 Shishu-the starters-covers loan up to Rs.50,000
Kishor-the mid-stage finance seekers-covers loan above Rs.50,000 and up to Rs.5,00,000.
Tarun-growth seekers- covers loan above Rs.5,00,000 and up to Rs. 10,00,000
3. PRADHAN MANTRI JEEVA JYOTI BIMA YOJANA:

Capture3

Launched on 9th May 2015.

It is government backed life insurance scheme. It is open all sects of Indian civilians

Age limit: 18 to 50 years of age.
Annual premium- Rs.330 per year for life cover of Rs.2,00,000.

4. PRADHAN MANTRI SURAKSHA BIMA YOJANA:

Modi

Launched on 9th May 2015.

The government scheme is accident insurance coverage and is affordable for all sects of people.
Age limit: 18-70 years
Annual premium: Rs.12 per year.
Coverage: accidental death and full disability of Rs.2,00,00 and Rs.1,00,000 for partial disability.

5. ATAL PENSION SCHEME:

Atal-Pension-Yojana-Details

Launched on 9th may 2015
The Atal pension scheme is targeted at unorganised sector workers.Depending upon the contribution, the beneficiary will get guaranteed pension of Rs.1000 to Rs.5000 per month.Govt will contribute 50% of total contribution or Rs.1000 whichever is lower.

Age limit: 18-40 years
The pension will start at the age of 60 years.

6. PRADHAN MANTRI SANSAD ADARSH GRAM YOJANA:

sansad-adarsh-gram-yojna-sagy

Launched on 11th October 2014

Under this scheme, MPs will be responsible for developing the socio-economic and physical infrastructure of three villages each by 2019. A total of eight villages by 2024.The first Adarsh gram must be developed by 2016 and more by 2019. Total of 6433 Adarsh Grams of 265000 gram Panchayat will be created by 2024.

7. Deen Dayal Upadhyaya Gram Jyoti Yojana:

deen-dayal-upadhyaya-gram-jyoti-yojana

DDUGJY is a Government of India scheme aimed to provide continuous power supply to rural India. It is one of the key initiatives of Modi Government and it aims to supply 24×7 uninterrupted power supplies to all homes. The government plans to invest Rs 75,600 crore for rural electrification under this scheme. The scheme will replace the existing Rajiv Gandhi Grameen Vidyutikaran Yojana.

SPECIAL MENTION : Download GARV APP from play store and get real time update relating to this initiative.

8.UDAAN PROJECT:

The Special Industry Initiative J&K ‘Udaan’ Scheme is to provide skills and enhance the employability of 40,000 youth over a period of five years in key high growth sectors. The scheme is being implemented by the National Skill Development Council (NSDC) and the corporate sector in PPP mode.

download

Udaan also aims to provide a platform that empowers girl students and provides them with better learning opportunities. The human resource development (HRD) ministry programme is designed to provide a comprehensive platform to deserving girl students aspiring to pursue higher education in engineering and assist them in preparing for the IIT-JEE while studying in Classes 11 and 12.

9. DIGITAL INDIA:

The Government of India has launched the Digital India programme with the vision to transform India into a digitally empowered society and knowledge economy.

download

Launched on 1st July 2015.

Digital India is keyed on three key areas –

1. Digital Infrastructure as a Utility to Every Citizen
2. Governance & Services on Demand
3. Digital Empowerment of Citizens

Pillars of Digital India –

1. Broadband Highways
2. Universal Access to Phones
3. Public Internet Access Programme
4. e-Governance – Reforming government through Technology
5. e-Kranti – Electronic delivery of services
6. Electronics Manufacturing – Target NET ZERO Imports
7. IT for Jobs
8. Early Harvest Programmes

10. SKILL INDIA:

download (1)

Launched by PM Narendra Modi on 15th July 2015.

Skill India focuses on creating jobs for youth, the govt has decided to revamp the antiquated industrial training centres that will skill over 20 lakh youth annually and create 500 million jobs by 2020.  The initiative was launched on the occasion of world youth skills day. Samsung recently signed a major deal in providing hands-on training to youths for employment and improving the skills at the same time.

11. MAKE IN INDIA:

download (1)

Launched on 25th September 2014.

The main Objective of Make in India initiative is :

To promote India a manufacturing hub.
Economic transformation in India
To eliminate unnecessary law and regulation.
25 sectors have been included in Make in India scheme. Some of the sectors are automobiles, chemicals,IT, pharmaceuticals, textiles, leather, tourism and hospitality, design manufacturing, renewable energy,mining and electronics.

12. SWACHH BHARAT:

download (2)

Launched on 2nd October 2014.

Swachh Bharat Abhiyan is a national campaign by the government of India aims to accomplish the vision of
clean India by 2nd October 2019. A performance ranking on Swachh Bharat Abhiyan of 476 cities in the country, based on the extent of open defecation and solid waste management practices, released by the Ministry of Urban Development recently.

Top 10 cities are: Mysore, Tiruchirapalli, Navi Mumbai, Kochi, Hassan, Mandhya, Bengaluru, Thiruvananthapuram, Halisahar, Gangtok.

To crack SSB interview,  recommend you to get “Let’s Crack SSB Interview” book from Amazon.