Saturday, May 14, 2022

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Mayawathi నోట Azam Khan ప్రస్తావన BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Published: Thu, 12 May 2022 11:20:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mayawati నోట Azam Khan ప్రస్తావన.. BSP లోకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లఖ్‌నవూ: Samajwadi party సీనియర్ నేత Azam Khan తొందరలోనే Bahujan Samaj Party లో చేరనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా BSP సుప్రెమో Mayawati చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని కొందరు అంటున్నారు. ప్రత్యర్థులపై నిరంతరం ద్వేషపూరిత, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని.. ఎమ్మెల్యే అజాంఖాన్ విషయంలో జరిగిందిదే అంటూ గురువారం మాయావతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇదే తరుణంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీతో పోల్చి విమర్శలు గుప్పించారు. ఎస్పీని కాదనుకుంటే బీజేపీ వైపు అజాంఖాన్ వెళ్లే ప్రసక్తి లేదు. అయితే కాంగ్రెస్ గూడికి వెళ్లొచ్చనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

‘‘Bharatiya Janata Party అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పాలన Congress పాలనకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, ముస్లింలపై దౌర్జన్యాలు చేస్తూ భయాందోళనలకు గురి చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీ ప్రభుత్వం కూడా తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషం వెల్లగక్కుతోంది. తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యే అజాంఖాన్‌లో రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచారు. ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఆక్రమణల పేరుతో భయాందోళనలు సృష్టిస్తూ దురుద్దేశపూరిత వైఖరి అవలంబిస్తూ వలసదారులను శ్రామికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై విస్తృత చర్చ జరగాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

26 నెలల నుంచి జైలులో ఉన్న Azam Khan ను SP అధినేత Akhilesh Yadav ఒకేసారి కలిశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాకుండా తన జైలు జీవితంలో పార్టీ నుంచి ఎలాంటి మద్దతు తనకు అందలేదని అజాంఖాన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. జైలులో సైతం కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలను కలుస్తున్న ఆయన.. ఎస్పీ నేతలను మాత్రం కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే ఎస్పీ నుంచి బయటికి రావడానికి అజాంఖాన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయని అనుకుంటున్నారు.

Tuesday, May 3, 2022

Rahul Gandhi in Night Club.

 Published: Wed, 04 May 2022 03:01:37 IST

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌!

twitter-iconwatsapp-iconfb-icon

 సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌


విందులో ఆయన పక్కనే చైనా దౌత్యవేత్త.. పెళ్లికని వచ్చి వివాదంలో చిక్కుకున్న నేత

దేశం సంక్షోభంలో ఉండగా ప్రధాని మోదీ విదేశాలకు ఎలా వెళ్లారని కాంగ్రెస్‌ ట్వీట్‌ 

కౌంటర్‌గా రాహుల్‌ నైట్‌క్లబ్‌ వీడియో లీక్‌.. బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం


న్యూఢిల్లీ, మే 3: నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. కాఠ్‌మాండూలోని పాపులర్‌ నైట్‌ క్లబ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఆ పార్టీలో రాహుల్‌గాంధీ పక్కనే నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా పనిచేస్తున్న యువతి కూడా ఉండటం రాజకీయ దుమారాన్ని సృష్టించింది. బీజేపీ నేత కపిల్‌ శర్మ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఎవరో గుర్తు పట్టండి’ అంటూ నిప్పు రాజేశారు. అది సోషల్‌ మీడియాలోనే కాకుండా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మీడియా మిత్రురాలు సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ ఐదు రోజుల పర్యటనపై నేపాల్‌ వచ్చినట్లు అక్కడి పత్రికలు రాశాయి. సుమ్నిమా ఉదాస్‌ కొన్నాళ్లు సీఎన్‌ఎన్‌ ఢిల్లీ విలేకరిగా పని చేశారు. ఆమె తండ్రి మయన్మార్‌లో నేపాల్‌ రాయబారి.

వివాహం ఏర్పాట్లలో భాగంగా రాహుల్‌గాంధీకి, ఇతర మిత్రులకు మారియట్‌ హోటల్లో బస ఏర్పాటు చేశారు. కపిల్‌ శర్మ షేర్‌ చేసిన ఈ వీడియోలో నైట్‌క్లబ్‌లో జోరుగా సంగీతం వినిపిస్తుండగా, రాహుల్‌గాంధీ మరో ముగ్గురు వ్యక్తులు ఒక టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. మిగతా వ్యక్తులు డ్రింక్స్‌ తాగుతుండగా రాహుల్‌ మాత్రం పక్కనున్న యువతితో మాట్లాడుతూ, ఫోన్‌ చూస్తూ కనిపించారు. రాహుల్‌ వ్యక్తిగత జీవితంతో తమకు పని లేదని, ఆయన చైనా ఏజెంట్లతో కూర్చున్నపుడు ప్రశ్నించక తప్పదని కపిల్‌ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాహుల్‌గాంధీ విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ విమర్శించారు. 2008లో ముంబై మీద ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ రాహుల్‌గాంధీ నైట్‌ క్లబ్‌లో ఉన్నారని ఆరోపించారు.


కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మత ఘర్షణలు జరుగుతుంటే ఆ పార్టీని నడిపించాల్సిన రాహుల్‌ విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నారని బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోశారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ గట్టిగానే బదులిచ్చింది. మిత్రదేశం నేపాల్‌లో స్నేహితుడి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి రాహుల్‌గాంధీ వెళ్లడం నేరమేమీ కాదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీయే 2015లో ప్రత్యేక విమానంలో నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో పిలవని పేరంటానికి వెళ్లి, కేక్‌ కట్‌ చేసి మరీ వచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. బీజేపీ నేత తేజ్‌పాల్‌ బగ్గా మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్‌ నిజాయితీకి చప్పట్లు కొట్టాలి. సోమవారం రాత్రి పది గంటలకు రాహుల్‌గాంధీ నేపాల్‌ నైట్‌క్లబ్‌ పార్టీలో ఎంజాయ్‌ చేస్తుంటే ఆ పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ దేశం సంక్షోభంలో ఉంటే సాహెబ్‌(ప్రధాని) విదేశాలకు ఎలా వెళ్తారని ట్వీట్ల మీద ట్వీట్లు వేసి నిలదీసింది’’ అన్నారు.


నిజానికి సోమవారం రాత్రి కాంగ్రెస్‌ పెట్టిన ఈ ట్వీటే బీజేపీని రాహుల్‌గాంధీ మీద వ్యక్తిగత దాడికి దిగేట్లు చేసిందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పప్పు కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. పార్ట్‌ టైం రాజకీయ డ్రామాలో చేస్తున్న ప్రకటనలు కూడా అర్థ రహితంగా ఉంటున్నాయని, మత్తులో మునిగి తేలుతున్న వ్యక్తులే అలాంటి ప్రకటనలు చేస్తారని ఎద్దేవా చేశారు.