" ఇండియా పాకిస్తాన్ వ్యవహారాల్లో తల దూర్చితే అమెరికా నోరుమూసుకుని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెప్పుతాం"
- రిచర్డ్ నిక్సన్, అమెరికా అధ్యక్షుడు.
" ఇండియా అమెరికాను స్నేహితునిగా పరిగణిస్తోంది. యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవరించాలో మాకు తెలుసు."
- ఇందిరాగాంధీ, భారత ప్రధాని.
1971 లో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ లో ఇరువురు నేతల మధ్య ముఖాముఖి జరిగిన సంభాషణల్లో ఇది చిన్న భాగం. దీని తర్వాత జరగవలసిన భారత-అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఇందిరాగాంధీ తనకే సాధ్యమైన ఠీవి తో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
వీడ్కోలు చెప్పేందుకు కారువరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రి కిస్సింజర్ ఇందిరా గాంధీ కారు ఏక్కుతుండగా " మేడం అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా" అని అడిగినప్పుడు " మీ సలహాకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా నిటారుగా మా వెన్నెముక ఉంది. వేలమైళ్ళ దూరంనుండి ఏదేశాన్నైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తామ"ని ఇందిరాగాంధీ అన్నారని హెన్రి కిస్సింజర్ తన ఆత్మకథలో రాశారు.
తర్వాత ఇందిరాగాంధీ ప్రయాణించిన ఎయిర్ ఇండియా బోయింగ్ పాలం ( ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ) లో దిగంగానే ఇందిరాగాంధీ నాటి ప్రతిపక్షనేత అటల్ బిహారీ వాజపేయి ని తక్షణం తన నివాసానికి పిలిపించుకున్నారు.
ఒక గంట ఏకాంత చర్చల అనంతరం వాజపేయి హడావిడిగా వెళ్లిపోయారు. ఆ తర్వాత తెలిసింది ఐక్యరాజ్యసమితిలో భారత్ కు వాజపేయి ప్రాతినిధ్యం వహించనున్నారని.
బి.బి.సి ప్రతినిధి డోనాల్డ్ పాల్ " ఇందిరాజి మిమ్మల్ని బలమైన ప్రత్యర్థిగా భావిస్తారు కదా! అయినప్పటికీ ఈ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్యసమితి లో మీరు గొంతు చించుకోగలనని భావిస్తున్నారా?" అని వాజపేయిని ప్రశ్నించాడు.
దానికి " ఒక తోటలో గులాబీ ఉంటుంది. ఒక లిల్లీ కూడా ఉంటుంది. రెండూ తానే అందమైనదాన్ని అనుకుంటాయి. ఐతే తోట సంక్షోభంలో పడినప్పుడు మొత్తం తోట అందాన్ని కాపాడుకోటానికి రెండూ ఒకటిగానే ఉంటాయి. తోటను కాపాడుకొనేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇదే భారత ప్రజాస్వామ్యం" అని వాజపేయి సమాధానం.
తర్వాతి చరిత్ర తెలిసిందే ! అమెరికా పాకిస్థాన్ కు 270 పాటన్ టాంక్ లు పంపింది. ప్రపంచ మీడియా ప్రతినిధులను పిలిచి తమ టాంక్ లు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని అందువల్ల వాటిని ధ్వంసం చేయటం సాధ్యం కాదని ప్రదర్శించుకుంది. అమెరికా ఆంతర్యం విదితమే ! ఇండియాకు మరే దేశమూ సహాయం చేయకూడదని ప్రపంచ దేశాలకు అదొక హెచ్చరిక.
అక్కడితో అమెరికా ఆగిపోలేదు.భారత దేశానికి చమురు సరఫరా చేసే ఏకైక అమెరికా కంపెనీ బర్మాషెల్ కంపెనీని సరఫరా నిలిపివయమంది. భవిష్యత్ లో కూడా భారత్ తో వ్యాపారం చేయరాదని శాసించింది.
తర్వాతి చరిత్ర ఎదురు తిరగటమే! ఇందిరాగాంధీ అద్భుత దౌత్యనీతి వల్ల యుక్రెయిన్ నుండి చమురు సరఫరా జరిగింది.
ఒకరోజు యుద్ధంలోనే 270 టాంకులు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన టాంక్ లను ఇండియా కు తెచ్చి ప్రదర్శించారు. రాజస్థాన్ లోని మండే ఎడారులు అమెరికా ప్రతిష్ట భంగ పాటుకు నేటికీ సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
పద్దెనిమిది రోజుల యుద్ధం 1.5 లక్షల పాకిస్తానీయులను యుద్ధఖైదీలుగా పట్టుకోవటంతో ముగిసింది.లాహోర్ జైలునుండి ముజిబుర్ రెహ్మాన్ విడుదలయ్యారు.
మార్చి నెలలో బంగ్లాదేశ్ ను స్వతంత్రదేశంగా గుర్తిస్తూ ఇందిరాగాంధీ పార్లమెంట్ లో ప్రకటించారు.
వాజపేయి ఇందిరాగాంధీని "దుర్గామాత" అని సంబోధించారు.
ఈ సంఘటనలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాయి.
- ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ రూపుదిద్దుకొంది.
- ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పింది.
-అలీన దేశాల కూటమిని ఇండియా ముందుండి నడిపింది. ఈ కూటమికి తిరుగులేని నాయకుడిగా రూపొందింది.
శక్తివంతమైన ఆకాలం , ఆనాటి సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయాయి.
నిజమైన చరిత్ర ఇప్పటికీ మార్గదర్శిగా ఉంటుంది.
నాటినుండి ఇండియా ఏభై సంవత్సరాలు గడిపేసింది. ఒకవిధమైన అలసట స్వభావం గోచరిస్తోంది.
ప్రజాస్వామ్యం ఏకాకిగా నిఘంటువులో ఒక పదంగా మిగిలిపోయింది.
(నేటి) ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఇంకెంతమాత్రం భాగం కాదు.
తమకు వంత పాడని గొంతులన్నీ దుష్ట స్వరాలే !
(రాహుల్ బెనర్జీ ఎఫ్.బి ఆంగ్ల పోస్ట్ కు ఇది తెలుగుసేత.)

No comments:
Post a Comment