Tuesday, March 31, 2020

కరోన ఆ మత ప్రార్ధనల వల్లనే వచ్చినట్లు ఏం ప్రచారం బాబూ!

ఇప్పటికైనా బాధ్యతగా వుందాం!

అక్కడికి భారతదేశం మొతానికి కరోన ఆ మత ప్రార్ధనల వల్లనే వచ్చినట్లు ఏం ప్రచారం బాబూ! మెజారిటీ మీడియా తన రహస్య రాజకీయ అజెండాని పట్టపగ్గాల్లేకుండా బైటపెట్టుకుంటున్నది. ముస్లీంస్ వేలదిమంది యాంటీ-ఎన్నార్సీ ప్రదర్శనల్ని వందలాదిగా నిర్వహించినప్పుడు పట్టించుకోని మీడియా ఒక ప్రార్ధన సమావేశాన్ని తెగ హైలైట్ చేస్తున్నది. "ఇది కరోన సమయం కాబట్టి అంతమంది గుమిగూడటం తప్పు కదా?" అని ప్రశ్నిస్తున్నారా? తప్పు కాదని ఎవరంటారు? కానీ అదొకటే భారతదేశంలో జరిగిన తప్పా? మొత్తం నిర్లక్ష్యపూరిత వాతావరణంలో జరిగిన తప్పే అది.

అంతకంటే ముందుగా మీరేయాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. అసలు కరోన మొదటి స్థాయిలో వున్నప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? కేరళలో విదేశాల నుండి వచ్చిన వారు కరోనని మోసుకొచ్చినప్పుడే విదేశాలనుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎందుకు క్వారెంటైన్ చేయలేదు? ఏదో తూతూ మంత్రంగా టెంపరేచర్ కొలిచి వదిలేసారు కదా! ఎన్ని లక్షల మంది ఫిబ్రవరి మొదట వారం నుండి విదేశాల నుండి వచ్చారు. ఒక పారసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే దిగిపోయే టెంపరేచర్ని నమ్ముకుంటే ఎలా? రెండవ దశలోకి వచ్చిన తరువాతనే విదేశాల నుండి వచ్చిన వారి వివరాల ప్రకారం వాళ్ల కొసేం దేవులాడటం, అవసరమైన వారిని క్వారంటాఐన్ చేయటం జరిగింది. అందాక ఎందుకండి? ఫిబ్రవరి 24న అహ్మదాబాద్లో లక్షలాదిమందితో ప్రభుత్వ స్పాన్సర్డ్ ప్రోగ్రాం జరిగింది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ కార్యక్రమాలు ఆగిపోయాయి? ఏపీలో మొట్టమొదటి కరోన కేసు బైట పడిన నెల్లూరులోనే మార్చ్ 14 నుండి 16 వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగాయి. మరి వాటికి అనుమతి ఎలా లభించింది? అది కూడా ఒక మతానికి సంబంధించిన సంగీత కార్యక్రమమే కదా! విదేశాల నుండి హాజరైన వారు కూడా వుండొచ్చు. అసలు అన్ని వందలమందితో జరిగే కార్యక్రమాన్ని ఎలా అనుమతించారు? దేశ వ్యాప్తంగా ఇలాంటి సామూహిక హాజరు కార్యక్రమాలు ఎన్ని జరిగాయో!

తెలంగాణలో అందరికంటే కొంత ముందే మేలుకొని స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూసేసినప్పటికీ ఏపీలో ఆ తరువాత కొద్ది రోజులకి మాత్రమే మూసేసారు. అసలు ఏపీలో మార్చి మూడో వారంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపించమని ప్రభుత్వమే కోర్టుకి వెళ్లిన పరిస్తితి వుంది. ఊరకే హడావిడి చేయటం మినహ దేశం మొత్తం నిర్లక్ష్యం రాజ్యమేలింది. నాలుగు హితవులు, జాగ్రత్తలు దేశాన్ని ఏం రక్షిస్తాయి భయంకర విపత్తు నుండి? దేశం మొత్తం అవలంభించిన నిర్లక్ష్యంలో నిజాముద్దీన్ మత ప్రార్ధనలు ఒక భాగమే. చైనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు జాగరూకతతో వుండాల్సిన సందర్భంలో అంతమందితో అన్నాళ్లపాటు ఆ నిజాముద్దీన్ ప్రార్ధన కార్యక్రమం ఎలా జరిగింది? పైగా ఈ ప్రార్ధనల కోసం విదేశాల నుండి 280 మంది యాత్రికులు హాజరైనప్పుడు నిఘా వుండొద్దా?

నిర్లక్ష్యానికి మతం లేదు. ఒక రాజకీయ సన్యాసి లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఒంటిమిట్టలో శ్రీరామ నవమి జరిపించాలని జనాల్ని రెచ్చగొడుతున్నాడు. యూపీలో కూడా ఇలాంటిదే ఏదో దానికి ప్రణాళిక వేసారు. మార్చి 20 వరకు తిరుమల, జగన్నాధ్ ఆలయాలు యథావిధిగా నడిచాయి. ఇంక "రివర్స్ మైగ్రేషన్" సృష్టించిన కలకలం, సృష్టించబోయే సంక్షోభం గురించి చెప్పేదేముంది? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన సయోధ్య వున్నప్పుడు ఇరు రాష్ట్రాల పెద్దలు ముందుగా మాట్లాడుకొని వుంటే స్వగ్రామాలకు వెళ్లటం కోసం రోజుల తరబడి ఆకలిదప్పులతో పడిగాపులు పడే బాధ తప్పేది కదా. అలా చేయకుండా ఒకరు వేలాదిగా ఎన్నోసీలు ఇచ్చేస్తే మరొకరు ఏమెరగనట్లు సరిహద్దుల్లో అడ్డుకుంటే పరిణామాలేమిటి? అసలు మొత్తం దేశవ్యాప్త నిర్లక్ష్యానికి ఫలితాలేమిటి? ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు బాధ్యతాయితంగా వుండాలి. ప్రస్తుత పరిస్తితుల్లో నిర్లక్ష్యం అమానవీయ పరిస్తితులకి దారితీస్తుంది.

ఇది మతాల గురించి ఆలోచించాల్సిన సందర్భం కాదు. మతాతీతంగా అందరం ఎదుర్కోవాల్సిన సందర్భం. ఈ దేశంలో అందరూ టాక్సులు కట్టి బతికేవాళ్లే. అందరం భారతీయులమే. ముస్లీంస్ ని టార్గెట్ చేయటం మానేయండి దయచేసి. ఎవరూ కావాలని తమ ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోరు. ప్రభుత్వాలకి సహకరిద్దాం, పుకార్లకి కాదు.

మీరూ, మీ లేకి కూతలు కాకపోతే-

1. 13వతేదీ-నిజాముద్దీన్ మర్కాజ్‌లో ప్రార్థనా సమావేశాలు జరిగాయి.
2. 13వతేదీ- కేంద్ర ఆరోగ్యశాఖ "కరోనా హెల్త్ ఎమర్జెన్సీ కాద"ని ప్రకటించింది.
3. 15వతేదీ- నిజాముద్దీన్ సమవేశాలు సమాప్తం.
4. 16వతేదీ- హిందూమహాసభ గోమూత్ర సమావేశం ఏర్పాటు.
5. 16వతేదీ- అన్ని మతసంస్థల్ని మూసివేస్తూ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ.
6. 17వతేదీ- విదేశాలనుండీ, దేశంలోని పలుప్రాంతాలనుండి 40000వేలకుపైగా తిరుమల సందర్సన.
7. 18వతేదీ- నలభైవేలకి తగ్గని సందర్శుకులు తిరుమలలో దైవ దర్శనం.
8. 19వతేదీ- తిరుమల మూసివేత, ప్రధాని 22వతేదీ జనతా కర్ఫ్యూ కోసం ప్రకటన.
9. 22వతేదీ- జనతాకర్ఫ్యూ అమలు.
10.22వతేదీ- సాయంత్రం 5దాటినప్పటినుండి గుంపులుగా ప్రజలు ర్యాలీలూ, చప్పట్లు, మోతలు.
11.25వతేదీ- ఇండియా లాక్‌డౌన్ ప్రకటన.
12.25వతేదీ- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాంలీలా ఉద్యమ కార్యక్రమ నిర్వహణ.
13.30వతేదీ- నిజాముద్దీన్ నుండి తిరిగొచ్చిన 6గురు ముస్లింల మరణం.

నిజానికి, విదేశాల్లో జనాన్ని వూడ్చేసిన మహమ్మారిపట్ల కనీస అప్రమత్తత లేకుండా, విగ్రహాలకూ, యుద్ద సామాగ్రికీ తప్ప విద్య, వైద్యాలకు నిధులు ఖర్చుపెట్టకుండా, వైరస్ వార్తలు వెల్లడైన తర్వాతకూడా 60,000పైగా విదేశాలనుండి తరళివచ్చినవారిని దేశమ్మీదకు వదిలేసి, ఈడబ్బున్నవాళ్ల బాధ్యతారాహిత్య తిరుగుబోతుతనాన్ని కట్టడిచేయకుండా, కనీస వైద్యసదుపాయాలూ, యంత్రాంగాన్ని అప్రమత్తపరచకుండా, ప్రజలని సిద్దపరచకుండా -

ఇప్పుడు కొత్తవాదన సిగ్గులేని మీడీయా ఊదరగొడుతోంది. నోరులేని వలసకూలీలవల్లా, మాట్లాడలేని మైనారిటీలవల్లా, కొరుకుపడని డిల్లీ ప్రభుత్వం వల్ల కరోనా మహమ్మారి కట్టడిలేక విస్తరిచిందని ప్రచారం చేస్తుంది.

The following is a fact check from the wall of Siddharthi Subhas Chandrabose! Eye opener indeed!!!

1. 13వతేదీ-నిజాముద్దీన్ మర్కాజ్‌లో ప్రార్థనా సమావేశాలు జరిగాయి.
2. 13వతేదీ- కేంద్ర ఆరోగ్యశాఖ "కరోనా హెల్త్ ఎమర్జెన్సీ కాద"ని ప్రకటించింది.
3. 15వతేదీ- నిజాముద్దీన్ సమవేశాలు సమాప్తం.
4. 16వతేదీ- హిందూమహాసభ గోమూత్ర సమావేశం ఏర్పాటు.
5. 16వతేదీ- అన్ని మతసంస్థల్ని మూసివేస్తూ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ.
6. 17వతేదీ- విదేశాలనుండీ, దేశంలోని పలుప్రాంతాలనుండి 4000వేలకుపైగా తిరుమల సందర్సన.
7. 18వతేదీ- నాలుగువేలకి తగ్గని సందర్శుకులు తిరుమలలో దైవ దర్శనం.
8. 19వతేదీ- తిరుమల మూసివేత, ప్రధాని 22వతేదీ జనతా కర్ఫ్యూ కోసం ప్రకటన.
9. 22వతేదీ- జనతాకర్ఫ్యూ అమలు.
10.22వతేదీ- సాయంత్రం 5దాటినప్పటినుండి గుంపులుగా ప్రజలు ర్యాలీలూ, చప్పట్లు, మోతలు.
11.25వతేదీ- ఇండియా లాక్‌డౌన్ ప్రకటన.
12.25వతేదీ- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాంలీలా ఉద్యమ కార్యక్రమ నిర్వహణ.
13.30వతేదీ- నిజాముద్దీన్ నుండి తిరిగొచ్చిన 6గురు ముస్లింల మరణం.

Is it true ? Feb,21-23, 2020, Mahashivratri at ISHA,COIMBATORE, 10000 +participated, large no of International Participants as well. No tests like Markaj of Delhi ? Why? just curious ?

Vice president chief guest..

No comments:

Post a Comment