పార్టీ కంటే మీ పిల్లలే ముఖ్యమా?
27-05-2019 00:49:15
చిదంబరం, గెహ్లాట్, కమల్‌నాథ్‌లపై
రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం
మోదీని ఢీకొట్టే పని ఒక్క రాహుల్‌దేనా..?
రాఫెల్‌పై మీరెందుకు ప్రచారం చెయ్యలేదు?
ఓటమికి బాధ్యులంతా ఈ గదిలోనే ఉన్నారు
పదునైన విమర్శలతో టార్గెట్ చేసిన ప్రియాంక
హాట్‌హాట్‌గా వర్కింగ్ కమిటీ సమావేశం?
న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవ ప్రకంపనలు కాంగ్రె్‌సలో కొనసాగుతున్నాయి. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కొందరు సీనియర్ నాయకుల్ని నేరుగా టార్గెట్ చేశారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టారని ఘాటుగా దుమ్మెత్తారు. మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్‌లే లక్ష్యంగా విమర్శల శరాలు గుప్పించారు. కొడుకుల ఎదుగుదలే ముఖ్యమని భావించారని వారిని నిశితంగా విమర్శించారు. శనివారంనాడు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ చాలా నిష్కర్షగా మాట్లాడారు. పార్టీ పరాజయాన్ని సునిశితంగా విశ్లేషించిన రాహుల్- ఓటమికి తాను బాధ్యత తీసుకుంటున్నానని చెబుతూనే ఈ వైఫల్యంలో మీ భాగస్వామ్యమూ తక్కువేం కాదని కుండబద్దలు కొట్టారు. ఏ అంతర్గత సమావేశంలోనూ ఆయన ఇంత తీవ్రంగా మాట్లాడలేదని సమావేశంలో పాల్గొన్న ఓ నేత చెప్పారు. ‘‘కొడుకు కార్తికి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి చిదంబరం బెదిరించారు... మరి ఇవ్వాలా? వద్దా? కొడుకు వైభవ్‌ను గెలిపించుకోవడం కోసం ప్రచారమంతటినీ పక్కన పడేసి ఏకంగా వారంరోజుల పాటు జోధ్‌ఫూర్‌లోనే మకాం పెట్టారు అశోక్ గెహ్లాట్! ఇలా కుమారుడి కోసం కాడి వదిలేయడం సబబేనా? ఛింద్వారా లో తన కుమారుడు నకుల్‌కు టికెట్ ఇవ్వనపుడు తాను సీఎంగా ఉండి ప్రయోజనమేంటని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రశ్నించారు. ఎంతో ఒత్తిడి తెచ్చారు. ఇలాగే చాలా మంది నాయకులు... వారి పిల్లలు, బంధువులే ముఖ్యమనుకున్నారు. ఇలా అయితే ప్రజలకు ఏం చెబుతాం?’’ అని రాహుల్ అధిక్షేపించినట్లు సమాచారం. నాలుగ్గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రియాంక చాలా మార్లు మధ్యలో కల్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి కారకులైనవారంతా ఈ సమావేశంలోనే ఉన్నారని ఆమె చాలా నిష్టురంగా విమర్శించారు.
‘‘చౌకీదార్ చోర్ హై... అన్నది మన నినాదం. మరి దీన్ని ఎందరు నేతలు తమ ప్రచారంలో ఎన్నిసార్లు ఉపయోగించారు? రాఫెల్ కుంభకోణంలో అవినీతిని బలంగా జనంలోకి తీసికెళ్లగలిగారా? ఈ రెండింటినీ రాహుల్‌కే వదిలేశారు. ఆయనే ప్రతీచోటా దీన్ని ప్రచారం చేయాల్సి వచ్చింది. న్యాయ్ పథకం గురించి కూడా అంతే..’’ అని ప్రియాంక అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ కూడా - ‘ప్రధాని మోదీ అవినీతిని హైలెట్ చెయ్యడంలో ఎందరు నేతలు ముందుకొచ్చారో చెప్పండి..’ అని ప్రశ్నించారు. కొందరు నాయకులు చేతులెత్తి తామూ దీన్ని లేవనెత్తామని అన్నపుడు ఆయన వారి మాటలను కొట్టిపారేశారు. పార్టీలో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాహుల్ అన్నారు. ఇలాంటపుడు తాను కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాజీనామాకు సిద్ధపడ్డారు. తన సోదరిని కూడా పార్టీ చీఫ్‌గా చేయవద్దని, అసలు గాంధీల కుటుంబం నుంచే ఉండాలని కోరుకోవద్దని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. నేతలు వారించినా వినకుండా మధ్యలోనే సమావేశ గది నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజీనామా వద్దని ప్రియాంక కూడా తన సోదరుడికి నచ్చచెప్పారు. వైదొలిగాలని నిర్ణయించుకుంటే బీజేపీ ఉచ్చులో పడ్డట్లేనని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు బయటకు పొక్కింది. ‘‘స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని’’ జ్యోతిరాదిత్య సిందియా సూచించారు. రాహుల్ రాజీనామాను నేతలంతా తిరస్కరించి- ఆయనకు నచ్చచెప్పే బాధ్యతను సోనియా, ప్రియాంకలకే అప్పగించారు. ‘పార్టీ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించుకోడానికి కొంత గడువు ఇవ్వాలని’ రాహుల్‌కు ప్రియాంక సూచించినట్లు సమాచారం. కానీ ప్రత్యామ్నాయాలేవీ లేవని నేతలంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. మొత్తంమీద, సీడబ్ల్యూసీ సమావేశం చాలా వేడిగా, వాడిగా సాగినట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే రాహుల్ అసలు రాజీనామాయే చేయలేదని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాల ఆ తరువాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.