Thursday, March 19, 2026

Bharat Bachavo - INDIA Block

 భారత్ బచావో, ఆం ధ్రప్రదేశ్

మం చి భవిష్య త్తు కోసం రాజీ పడం డి

వామపక్ష, బహు జన, సెక్యు లర్ పార్టీ లకు

 

 భారత్ బచావో, ఆం ధ్రప్రదేశ్  విజ్ఞప్తి

 

ఏ సమాజం లోనైనా, ఏ దేశం లోనైనా, ఏ మతతత్వ వాదులైనా, మరీ ముఖ్యం గా మెజారిటీ మతతత్వ వాదు లు ఆ దేశ సమాజానికి హానిదాయకమైన వారే.

 

పాకిస్తాన్ ఆఫ్ఘనిఫ్ఘస్తాన్ బం గ్లాదేశ్ లు ఇస్లామును రాజ్యమతం గా ప్రకటించి తీవ్రం గా నష్టపోతున్న పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అనేక మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న భారత సమాజం ఆర్ఎస్ఎస్ పరివారం మరియు వారి రాజకీయ విభాగమగు బిజెపి బ్రాహ్మణీయ హిందూత్వ రాజ్యాంగ వ్యతిరేక' పరిపాలనలో ఇప్ప టికే తీవ్రం గా నష్టపోయింది. కనుక, ఎన్డీఏలో లేని, ఎన్నికలలో పాల్గొం టు న్న జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లి, లోక్ సభ ఎన్నికల వరకు  అన్ని ఎన్నికలలో, అన్ని రాష్ట్రా లలో జట్టు కట్టి బీజేపీ/ NDA పార్టీలను ఓడిం చి భారత బహుళ విశ్వాసాల సమాజాన్ని కాపాడాలి.

 

కారణం ఏదైనా కావచ్చు, ప్రస్తుతం బిజెపితో జట్టు కట్టిన, దళిత బహుజన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలి.

 

రాను న్న ఏప్రిల్ మాసంలో జరిగే అస్సాం , పశ్చి మబెగాల్, తమిళనాడు , పుదుచ్చేరి మరియు కేరళ అసె బ్లీ ఎన్నికలు చాలా కీలకమైనవి. అవి ఒక విధం గా

2029 (లేదా అం తకు ముం దే) జరిగే లోక్ సభ ఎన్నికలకు డ్రెస్ రిహార్స ల్స్ .

 

కేరళలో LDF, UDF ల్లో ఎవరో ఒకరు గెలుస్తారు గనుక తక్షణం ప్రమాదము లేకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తృ ణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు గా విడివిడిగా మొత్తం 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నట్లుగా ప్రకటనలు జారీ చేశారు . దీనివలన ప్రతి నియోజకవర్గంలో బిజెపి/ఎన్ డిఏ వ్యతిరేక ఓట్లు చీలి పోయి బిజెపి మెజారిటీ పొందే ప్రమాదం పొంచి ఉంది.

 

అందువల్ల, దేశాన్ని సం ఘపరివార్ కాషాయ మతోన్మాదం నుంచి రక్షించడమే తమ ధ్యేయమని పదేపదే ప్రకటిస్తున్న LDF, TMC, Congress లు రాజకీయ వివేకాన్ని ప్రదర్శించి సర్వ భ్రష్టభ్రష్టత్వానికి దారి తీసే మరియు బీజేపీకి ఉపయోగపడే పరస్ప ర పోటీని నివారించు కోవాలనీ INDIA కూటమిగా ఎన్నికల ఒడంబడిక చేసుకుని బిజెపిని ఓడించాలని భారత్ బచావో ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తు న్న ది.

 

తమిళనాడు నుంచి కూడా కొన్ని ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి - తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో బీజేపీ, సినిమా నటుడు విజయ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)ల మధ్య చర్చ లు తుది దశకు చేరుకు న్నాయని, విజయ్ కు 80 సీట్లతో పాటు ఉప ము ఖ్య మం త్రి పదవిని కూ డా బీజేపీ ఆఫర్ చేసిందని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఇది తప్పు వార్త అని ప్రకటిం చాలని టీవీకే నాయకు డు విజయ్ కు భారత్ బచావో ఆం ధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి చేస్తు న్న ది.

 

ఇక అస్సాం విషయానికి వస్తే - విద్యా వేత్త హిరెన్ గోహైన్; రచయిత నాగేన్ సైకియా; రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరేకృష్ణ దేకా; గౌహతి మాజీ ఆర్చ్ బిషప్ థామస్ మెనమ్పరంపిల్ మరియు ఏప్రిల్లో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుడు అజిత్ కు మార్ భూయాన్ నాయకత్వం లోని 171 మం ది మేధావులు , సామాజిక కార్యకర్తలు , వృ త్తి నిపుణు లతో కూ డిన ఒక పౌర సమాజ సమూ హం "మన రాష్ట్రా నికి ప్రజాస్వామ్య , లౌకిక భవిష్యత్తును ఆశించే మనలాంటి వారికి, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఎదిరిం చాల్సి న అవసరం ఇకపై ఎంపిక చేసుకునే విషయం కాదు;

అది ఒక తప్పనిసరి అవసరం ," అని ప్రకటీస్తూ , ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగిన అస్సాం జాతీయ పరిషత్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సి స్ట్ (సీపీఐ-ఎం ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), లిబరేషన్ సీపీఐ(ఎం ఎల్), ఆల్-పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫ రెన్స్ , కాం గ్రెస్ పార్టీల కూటమి మరీయు ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న రైజోర్ దళ్ ఎన్నికల అవగాహనకు వచ్చి బీజేపీ ఓడించాలని ఆ పక్షాలకు విజ్ఞప్తి చేయటం మంచి పరిణామం . ఆ పౌర వేదికకు భారత్ బచావో, ఆం ధ్రప్రధ్రప్రదేశ్ అభినందనలు తెలియ జేస్తున్నది.

 

ఏదేమైనప్పటికీ తమ సమాజాన్ని కాపాడుకోగలిగిన వారు ప్రజలే. కనుక, రాను న్న ఏప్రిల్ మాసం లో జరిగే అస్సాం , పశ్చి మ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆ ఐదు రాష్ట్రాల ప్రజలకు భారత్ బచావో, ఆంధ్రప్రదేశ్ ప్రగాఢంగా విజ్ఞప్తి చేస్తుంది.

 

చిగురుపాటి భాస్కరరావు, ఛైర్మ న్,

భారత్ బచావో, ఆంధ్రప్రదేశ్.

మొబైల్ నెంబరు ,: 8639195989

తేదీ: 19-03-2026